Header Ads

బాధితుల‌కు అండ‌గా స్టాన్ ప్ల‌స్.!!

దేశంలోని జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాలు ప్ర‌తి రోజు కోకొల్ల‌లు. కొన్ని దారులు ర‌క్తంతో త‌డిసి పోతున్నాయి. రోడ్డు ప్ర‌మాదాల్లో బాధితుల‌కు స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క చ‌నిపోతున్న వారు ఎంద‌రో. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని కాశ్మీర్ టు క‌న్యాకుమారి దాకా ఉన్న జాతీయ ర‌హ‌దారిపై లెక్క‌లేన‌న్ని యాక్సిడెంట్లు. కోలుకోలేని ప‌రిస్థితి. బాధితుల‌కు అండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో త‌క్ష‌ణ‌మే వైద్య సేవ‌లు అందించాల‌న్న వ‌చ్చిన ఆలోచ‌నే స్టాన్ ప్ల‌స్‌.

ప్ర‌మాద వార్త తెలిసిన క్ష‌ణాల్లోనే అంబులెన్స్‌ల సౌక‌ర్యాన్ని పేరొందిన హాస్పిట‌ల్స్‌. ప్ర‌తి హోట‌ల్‌కు ప్ర‌త్యేక‌మైన అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇప్పటికే 108, 104 స‌ర్వీసులు సేవ‌లందించ‌డంలో ముందంజ‌లో ఉన్నాయి. జాతీయ ఆరోగ్య మిష‌న్ ద్వారా ఇవి న‌డుస్తున్నాయి. మొద‌ట్లో స‌త్యం కంపెనీ టేక్ ఓవ‌ర్ చేయ‌గా ఆ త‌ర్వాత మ‌హీంద్ర గ్రూప్ తీసుకుంది. ఆ కంపెనీ కూడా వైదొల‌గ‌డంతో జీవీకే కంపెనీ ప్ర‌భుత్వ స‌హ‌కారంతో న‌డిపిస్తోంది.

ఎమ‌ర్జెన్సీ కేసుల గురించి తెలియాలంటే ప్ర‌త్యేక‌మైన టెక్నాల‌జీ అవ‌స‌ర‌మ‌వుతుంది. సాంకేతిక‌త‌తో పాటు అంబులెన్స్ స‌ర్వీసెస్ అంద‌జేస్తోంది స్టాన్ ప్ల‌స్‌. ఎన్ ఎం ఐసీ లో మేనేజ్‌మెంట్ చ‌దువుకున్న ప్ర‌బహ‌దీప్ సింగ్ మ‌దిలో మెదిలిన ఐడియానే స్టాన్ ప్ల‌స్‌. ఒరానో కంపెనీలో ప్రాజెక్టు ఇంజ‌నీర్‌, ఆప‌రేష‌న్స్ స్పెష‌లిస్ట్ ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద సంఘ‌ట‌న‌లు భారీగా చోటు చేసుకున్నాయి.

రోజుకు వంద‌ల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డం, యాక్సిడెంట్స్ జ‌ర‌గ‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలేన‌ని సింగ్ ఆవేద‌న చెందారు. దీనికి శాశ్వ‌త‌మైన ప‌రిష్కారం క‌నుగొనేందుకు తానే ఎందుకు అంబులెన్స్ సేవ‌ల‌ను కొన‌సాగించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ ఐడియా ఎంద‌రికో న‌చ్చింది. త‌న వారితో పాటు మ‌రికొంద‌రు ఈ అంకుర సంస్థ‌కు తోడ్పాటు అందించారు.

పేటెంట్ సెంట్రిక్ ప్లాట్‌ఫాం ఇదే స్టాన్ ప్ల‌స్ ట్యాగ్ లైన్‌. జియో స్సేషియ‌ల్ అన‌లిస్ట్‌గా ఉన్న జోస్ లియోన్ సింగ్‌కు టెక్నిక‌ల్‌గా పూర్తి స‌హ‌కారాన్ని అంద‌జేశారు. స్టాన్ ప్ల‌స్ అంబులెన్స్‌లు 15 నిమిషాల్లో ప్ర‌మాద స్థ‌లం ద‌గ్గ‌ర‌కు చేరుకుంటుంది. జీపీఎస్ ట్రాకింగ్‌, ఫేయిర్ ప్రైసింగ్‌, క‌స్ట‌మ‌ర్ కేర్‌, శిక్ష‌ణ పొందిన సుశిక్ష‌త‌మైన సిబ్బంది, 300కు పైగా అంబులెన్స్‌ల ఏర్పాటు దీని ప్ర‌త్యేక‌త‌. స్టార్ట‌ప్ నుండి ఇపుడు కంపెనీగా రూపాంత‌రం చెందింది. 60 మంది ఆప‌రేట‌ర్లు ప‌నిచేస్తున్నారు. ఎమ‌ర్జెన్సీ, నాన్ ఎమ‌ర్జెన్సీ విష‌యంలో ఈ అంబులెన్స్‌లు సేవ‌లు అందిస్తాయి.

రిమోట్ మెడిక‌ల్ యుటిలిటి అంబులెన్స్ వెహిక‌ల్‌గా దీనిని పిలుస్తున్నారు. 15000 వేల డాలర్ల‌తో దీనిని స్టార్ట్ చేశారు. 1.1 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను సాయంగా కిలారీ కేపిట‌ల్ స‌మ‌కూర్చింది. రోగులు, బాధితుల పాలిట స్టాన్ ప్ల‌స్ క‌ల్ప‌త‌రువుగా మారింది. వేలాది రూపాయ‌ల వేత‌నాలు వ‌దులుకుని ..మాన‌వీయ దృక్ఫ‌థంతో సామాజిక సేవ‌లు అందించేందుకు న‌డుం బిగించిన సింగ్ ప‌ట్ల స‌ర్వ‌త్రా అభినందన‌ల వ‌ర్షం కురిపిస్తోంది.

డ‌బ్బున్న వాళ్లు కోకొల్ల‌లు. వ్యాపార‌స్తులు, కంపెనీలు తాము సంపాదించిన ఆదాయంలోంచి ఇలాంటి అంబులెన్స్‌ల‌కు సాయం చేస్తే బావుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ‌లందిస్తున్న స్టాన్ ప్ల‌స్
కంపెనీకి తోడ్పాటు చేస్తే కొన్ని బ‌తుకులైనా బాగు ప‌డ‌తాయి.

No comments