Header Ads

ఈ లేడీ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతనో తెలిస్తే షాక్ అవుతారు.!!

తెలుగు టీవీ చానెల్స్ లో వచ్చే లేడీ యాంకర్స్ కు చాలా మంచి క్రేజ్ ఉంది, అబ్బాయిలలో యాంకర్స్ గా పేరు తెచ్చుకున్న వారి సంఖ్యా చాలా తక్కువే, కానీ అమ్మాయిలలో మాత్రం బాగా పేరు తెచ్చుకున్న వారి సంఖ్యా చాలా ఎక్కువ.
సుమ, ఝాన్సీ, ఉదయభాను, అనసూయ లాంటి వాళ్ళు టీవీ యాంకర్స్ గా బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సుమ గారు అయితే ఏ షో కైనా పర్ఫెక్ట్ గ సెట్ అయ్యేలా యాంకరింగ్ చేస్తారు, ఇక ఒకప్పుడు అందమైన యాంకర్ గా ఉదయబాను కి మంచి పేరు ఉండేది, ఆ తరువాత ఆ పేరు అనసూయ దక్కించుకోగా, అనసూయ ప్లేస్ ని రష్మీ దక్కించుకుంది, అందమైన యాంకర్ పేరు ని దక్కించుకోడానికి రష్మీ తో చాలా మంది లేడీ యాంకర్స్ పోటీ పడుతున్నారు.

ఈ యాంకర్స్ ఒక ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటారు అంటే :

సుమ గారు ఒక ఎపిసోడ్ కి రెండున్నర లక్షల వరకు తీసుకుంటారు అంట, యాంకర్లుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్షిణి,మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30వేలనుంచి 50వేల రూపాయల వరకు తీసుకుంటున్నారట, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్యామల ఒక్క ఎపిసోడ్ కి 70 వేల రూపాయిలు తీసుకుంటుందట.

జబర్దస్త్ యాంకర్స్ ఆ మజాకా :

ఇక జబర్దస్త్ షో నుండి బాగా పాపులర్ అయిన అనసూయ రెండు లక్షలు తీసుకుంటుందట ఒక ఎపిసోడ్ కి, ప్రస్తుతం అందమైన యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ ఒక్క ఎపిసోడ్ కి లక్షన్నర నుండి రెండు లక్షల వరకు తీసుకుంటుందట. అనసూయ, రష్మీ లిద్దరు సినిమాల్లో కూడా బాగా బిజీ అయ్యారు. జబర్దస్త్ షో వీరిద్దరి ఫేట్ ని మార్చేసిందని చెప్పాలి.

No comments