Header Ads

న‌ట‌న‌లో సూప‌ర్‌ వ‌సూళ్ల‌లో రికార్డ్ - త‌మిళ‌నాట విజ‌యీభ‌వ‌

ప్ర‌తిభావంతులైన న‌టులు ఎక్కువ‌గా త‌మిళ‌నాట క‌నిపిస్తారు. ఒక‌రిని మించిన మ‌రొక‌రు త‌మ‌కంటూ ఓ స్ట‌యిల్‌ను ఏర్పాటు చేసుకుని..అదే బ్రాండ్‌గా కంటిన్యూ చేస్తూ..కోట్లు కొల్ల‌గొడుతున్నారు. క‌మ‌ల‌హాస‌న్‌, అర్జున్‌, ర‌జ‌నీకాంత్‌, విశాల్‌, విజ‌య్‌..ఇలా హీరోలు త‌మ‌దైన ముద్ర‌తో దుమ్ము రేపుతున్నారు. త‌లైవాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో సైతం వీరి సినిమాల‌కు విప‌రీత‌మైన డిమాండ్. ప్ర‌పంచ వ్యాప్తంగా 80 దేశాల‌కు పైగా వీరి సినిమాలు రిలీజ్ అవుతాయి. న‌ట‌న‌లో డాల‌ర్ల‌ను దాటేసిన వీరు సామాజిక సేవ‌లో తాము సైతం అంటూ ముందంజ‌లో ఉంటున్నారు.

త‌మిళ‌నాట వ‌ర‌ద‌లు ముంచెత్తినా లేక ఏ ఆప‌దైనా సంభవించినా త‌క్ష‌ణ‌మే స్పందిస్తారు. అది వీరి స్పెషాలిటీ. క‌ళ్ల‌ద్దాలు తిప్ప‌డం..కండువా వేసుకోవ‌డం ర‌జ‌నీ స్ట‌యిల్‌. విజ‌య్ అస‌లు పేరు జోసెఫ్ విజ‌య్‌. 1974లో జ‌న్మించిన ఈ న‌టుడు..జెట్ స్పీడ్ కంటే ఎక్కువ‌గా ప‌రుగులు తీస్తూనే వుంటాడు..వెండి తెర మీద‌..మ్యాజిక్ చేయ‌డంలో విజ‌య్ దిట్ట‌. న‌టుడే కాదు సింగ‌ర్ కూడా. త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, హిందీ భాష‌ల్లోకి ఆయ‌న న‌టించిన సినిమాలు డ‌బ్ అయ్యాయి. భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఇటీవ‌ల మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌ర్కార్ కోట్లు కొల్ల‌గొట్టింది. రికార్డులు తిర‌గ రాసింది. ఇత‌ర దేశాల్లో విజ‌య్ సినిమాల‌కు విప‌రీత‌మైన క్రేజ్‌. జ‌పాన్‌, అమెరికా, మ‌లేషియా, సింగ‌పూర్‌, శ్రీ‌లంక‌, ఫ్రాన్స్‌, లండ‌న్ ..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాల్లో మ‌నోడికి ఫ్యాన్స్ ఎక్కువ‌. త‌లైవా త‌ర్వాత ఎక్కువ పారితోష‌కం తీసుకునే యాక్ట‌ర్‌గా పేరుంది. త‌మిళులు ప్రేమ‌గా త‌ల‌ప‌తి అని పిలుచుకుంటారు. త‌ల‌ప‌తి అంటే క‌మాండ‌ర్‌..ద‌ళ‌ప‌తి అని అర్థం. చైనా, జ‌పాన్ దేశాల్లో విజ‌య్ అంటే విప‌రీత‌మైన పిచ్చి. అంత‌గా ఆయ‌న‌ను ఆరాధిస్తారు అక్క‌డి వారు. 80 కంటే దేశాల్లో ఇత‌డి సినిమాలు విడుద‌ల కావ‌డం ఓ రికార్డు.
1984లో వెట్రి అనే నాట‌కంలో విజ‌య్ న‌టించాడు. త‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నీతి సినిమాలో న‌టించాడు. నాల‌య తీర్పులో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. విక్ర‌మ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన పూవే వున్న‌కాగా మూవీలో న‌టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 61 సినిమాల్లో న‌టిస్తే..50 సినిమాల‌కు అవార్డులు అందుకున్న ఘ‌న‌త విజ‌య్‌కు ద‌క్కుతుంది. త‌మిళ‌నాట ఇదో రికార్డు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం, కాస్మోపాలిట‌న్ అవార్డుతో పాటు ఇండియా టుడే అవార్డు స్వంతం చేసుకున్నాడు. ఎడిష‌న్ అవార్డులు, విక‌ట‌న్ అవార్డు, యుకె నేష‌న‌ల్ అవార్డు విజ‌య్ అందుకున్నారు. న‌టుడే కాదు స్వ‌త‌హాగా గాయ‌కుడైన విజ‌య్ ..32 వ‌ర‌కు పాట‌లు పాడారు. 1994లో విడుద‌లైన బాంబే సిటీ సినిమాకు పాడాడు. 2017లో పాపా పాపా, 2014లో విడుద‌లైన సెల్ఫీ పిల్లా పాడిన పాట యూర‌ప్ చార్ట్స్‌లో ఆల్‌టైం సాంగ్‌గా రికార్డు సృష్టించింది. అద్బుత‌మైన డ్యాన్స‌ర్‌, చైనాలోని షాంఘైలో నిర్వ‌హించిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు విజ‌య్‌. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ద‌క్షిణ కొరియాలోని బుచియాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో విజ‌య్ అవార్డులు అందుకున్నాడు. విజ‌య్ సినిమాలు ఒక్కోటి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల‌ను అమెరికాలో కొల్ల‌గొట్టి రికార్డ్ బ్రేక్ చేశాయి.

వెట్రీతో స్టార్ట్ అయిన విజ‌య్ కెరీర్‌..కుదుంబం, వ‌సంత రాగం, స‌త్తం ఓరు విల‌య‌ట్టు, ఇత్తు యాంగ‌ల్ నీతి, నాన్ సిగప్పు మ‌నిథాన్ సినిమాలు పేరు తీసుకు వ‌చ్చాయి. దేవ‌, రాజ‌విన్ ప‌ర్వాఈలె, చంద్ర‌లేఖ సినిమాలు బాగా ఆడాయి. విక్ర‌మ‌న్ విజ‌య్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన పూవె ఉన‌క్కాగ సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌గా నిలిచింది. వ‌సంత వ‌స‌ల్‌, కాల‌మెల్లం కాత్తిరూపెన్‌, నెరుక్కు నెర్‌, మిన్‌సారా క‌న్నా, క‌న్నుక్కుల్ నిలావు, కుషి , ప్రియ‌మ‌న‌వాలే, సిద్దిఖీ, సూరియా, బ‌ద్రి, త‌మ్ముడు, షాజ‌హాన్‌, త‌మిజాన్‌, భ‌గ‌వ‌తి, వ‌సీగ‌ర‌, పుధియా గీతాయి సినిమాలు కాసులు కురిపించాయి. 2003లో విజ‌య్ న‌టించిన రొమాంటింక్ మూవీ తిరుమాలై సినిమా దుమ్ము రేపింది. ఉద‌య‌, గిల్లీ, ఒక్క‌డు, త్రిష‌, ప్ర‌కాశ్‌రాజ్‌తో క‌లిసి న‌టించిన గిల్లీ సినిమా 500 మిలియ‌న్ల డ‌బ్బులు కొల్ల‌గొట్టింది. తిరుపాచి, సాచిన్‌, శివ‌కాసి, పేరాసు, ఆది, పోకిరి సినిమాలు బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌గా నిలిచాయి. కేర‌ళ‌లో పోకిరి 100 రోజులు ఆడింది. విల్లు, వెట్టైక‌ర‌న్‌, సురా మూవీస్ రికార్డు బ్రేక్ చేశాయి. కావ‌ల‌న్‌..బాడీగార్డ్‌కు డ‌బ్బింగ్ ఈ మూవీ. ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో బాక్స్ ఆఫీస్ బ‌ద్ద‌లు కొట్టింది. షాంఘై ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో అవార్డు ద‌క్కించుకుంది. వేలాయుధం..సినిమా చైనాతో పాటు ప‌లు దేశాల్లో ఫ్యాన్స్‌ను అల్లాడేలా చేసింది. నౌబాన్ సినిమా బాలీవుడ్‌లో 3 ఇడియ‌ట్స్‌గా వ‌చ్చింది. ఆస్ట్రేలియా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అవార్డు ద‌క్కించుకుంది. రౌడీ రాథోడ్ గా వ‌చ్చింది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తుపాకీ రికార్డులు తిర‌గ‌రాసింది. యుఎస్‌లో ఒన్ బిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటిన సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది. త‌లైవా మూవీ మ‌రో రికార్డును కొల్ల‌గొట్టింది. కాజ‌ల్‌తో న‌టించిన జిల్లా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు సాధించింది. భైర‌వ‌, మెర్సాల్‌, శ్రీ‌తెన్నాద‌ల్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్కార్ కోట్లు కొల్ల‌గొడుతోంది.

ఇండియ‌న్ సెల‌బ్రెటీస్ ఎర్నింగ్‌లో ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన 100 మంది లిస్టులో 2012 నుండి 2018 దాకా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నారు. సంపాద‌న‌లో అంత‌కంత‌కూ పెంచుకుంటూ వ‌స్తున్నారు. విజ‌య్ బ్రాండ్ కోట్ల‌ను దాటింది. దీంతో కంపెనీలు క్యూ క‌ట్టాయి. కోకో కోలా, చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. జోయా లుకాస్ కు త‌మిళ‌నాట బ్రాండ్ అంబాసిడ‌ర్‌..టాటా డొకొమోకూడా యాడ్ చేశాడు. యుఎస్ కాన్సులేట్‌లో ప్ర‌పంచ మొక్క‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఓ మొక్క‌ను నాటాడు. పిల్ల‌ల కోసం విజ‌య్ పీపుల్ ఆర్గ‌నైజేష‌న్ ఏర్పాటు చేశాడు. ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాడు. త‌మిళ‌నాట త‌లైవా త‌ర్వాత త‌ల‌ప‌తి పేరు తెచ్చుకున్న ఒకే ఒక్క న‌టుడు విజ‌య్ మాత్ర‌మే. కాద‌న‌లేం..ఎందుకంటే కోట్లాది అభిమానుల‌ను ఎప్పుడో దాటేశాడు కాబ‌ట్టి. త‌ల‌ప‌తి..స‌క్సెస్ ఇలాగే ఉండాల‌ని కోరుకుందాం. అత‌డితో పాటే ఆ ఆనందాన్ని అందుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

No comments