Header Ads

యాంకర్ అనసూయ ను ట్రోల్ల్స్ తో ముంచెత్తుతున్న సోషల్ మీడియా, కారణం ఏంటో తెలుసా.?

యాంకర్ అనసూయ కు సోషల్ మీడియా కు విడదియ్యలేని అనుబంధం ఉంది, లేడీ యాంకర్స్ లో నెటిజన్స్ ఎక్కువగా ట్రోల్ చేసేది ఆమెనే, దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయ్, ఒకప్పుడు సోషల్ మీడియా లో ఏవేవో కామెంట్స్ చెయ్యడం, జనాలతో దురుసుగా ప్రవర్తించడం, ఇలా చేసే వారు ఆమె . అందుకనే ఆమెను ట్రోల్ చేసే వారు నెటిజన్స్, ఒక పిల్ల వాడి ఫోన్ ను పగులగొట్టిన సంఘటనలో ఏకంగా సోషల్ మీడియా కు మీడియా కు దూరం కావాల్సి వచ్చింది అనసూయ. ఆ సమయం లో అనసూయ ను విపరీతంగా ట్రోల్ చేసారు నెటిజన్స్.




రంగస్థలం తో ఫేట్ రూట్ మార్పు :

రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత క్యారెక్టర్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమా విడుదల తరువాత నుండి, అనసూయ ను సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం ఆపేసారు నెటిజన్స్, ఆ సినిమా తరువాత సోషల్ మీడియా లో ఇతరుల పైన కామెంట్స్ చెయ్యడం కూడా మానేసింది అనసూయ. దీంతో అనసూయ పైన ట్రోల్ల్స్ అనేవి లేకుండా పోయాయి.

నిన్ను అంత ఈజీ గా వదలము :

ఒక యాడ్ కోసం సావిత్రమ్మ నటించిన 'మాయాబ‌జార్‌' సినిమాలోని ఆహ నా పెళ్ళంటా సాంగ్ లో అనసూయ నటించింది, మహానటి సినిమా లో సావిత్రమ్మ పాత్ర పోషించిన కీర్తి సురేష్ ని ఇప్పటికీ అందరు మెచ్చుకుంటున్నారు అంటే సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ఏ రకంగా జీవించేసిందో అర్ధం చేసుకోగలం. కానీ ఒక్క సారిగా అనసూయ ను సావిత్రమ్మ పాత్ర లో చూసే సరికి జనాలకు కోపం వచ్చింది. ఇక ఛాన్స్ దొరకడం ఆలస్యం, అనసూయ పైన ఎప్పుడెప్పుడు ట్రోల్ల్స్ స్టార్ట్ చేద్దాం అని కాసుకొని ఉన్న అనసూయ హేటర్స్ కు మంచి అవకాశం దొరికినట్టు అయ్యింది, ఇంక ఆ యాడ్ విడుదల అయిన నాటి నుండి అనసూయ ను మళ్ళీ అంటుకున్నారు సోషల్ మీడియా లో.

ఇంక ఆపేయండి ప్లీజ్ :

సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ని తప్ప వేరే ఎవ్వరిని ఊహించుకోలేము, దయ చేసి మీ యాడ్ ల కోసం ఆమె స్థానం లో వేరే వారిని నటింపజేయడం కంటే, సావిత్రమ్మ పాత్రను ఇన్వాల్వ్ చెయ్యకపోడమే మంచిది, ఇలాంటి యాడ్స్ లో నటించకండి అనసూయ గారు, సావిత్రమ్మ పాత్ర ఇంకెప్పుడు చెయ్యకండి, ప్లీజ్ ఇలాంటి యాడ్స్ చెయ్యడం ఆపేయండి అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు నెటిజన్స్.

మొత్తానికి చాలా రోజుల తరువాత తిరిగి అనసూయ మీద ట్రోల్ల్స్ మొదలయ్యాయి, MEMES కూడా చాలానే చేసారు అనసూయ యాడ్ పైన, ఆ MEME ట్రోల్ల్స్ అనసూయ కంటికి కనబడకపోవటమే అనసూయ కు, అనసూయ ఫ్యాన్స్ కు మంచిది.

Tewwt:

https://twitter.com/anusuyakhasba/status/1069468214675918849



No comments