Header Ads

నిలిచి గెలిచిన తెలంగాణ -విజ‌య సార‌ధి గులాబీ ద‌ళ‌ప‌తి

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న తెలంగాణ మ‌రోసారి త‌న ఆత్మ గౌర‌వాన్ని చాటుకుంది. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం క‌లిగిన ఈ ప్రాంతం కొత్త రాష్ట్రం ఏర్పాట‌య్యాక ..జ‌రిగిన మ‌లి విడ‌త రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లలో స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. బ‌లిదానాలు, ఆత్మ త్యాగాలు, ఆందోళ‌న‌ల‌కు పెట్టింది పేరైన ఈ ప్రాంతం ఇంకొక‌రి పెత్త‌నాన్ని స‌హించ‌మంటూ ఓట‌ర్ల రూపంలో గులాబీ ద‌ళం తిరిగి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేలా చేసింది. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌, రైతు బంధు, కేసీఆర్ కిట్ , త‌దిత‌ర ప‌థ‌కాలు ఆధిక్యం వ‌చ్చేందుకు దోహ‌ద ప‌డ్డాయి. కేసీఆర్ ఒకే ఒక్క‌డుగా మారి విస్తృతంగా ప‌ర్య‌టించారు. 50 శాతానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్నా తానే అన్నీ అయి విజ‌య‌దుందుభి మోగించేలా చేయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు.
గ‌తంలో పోలింగ్ శాతం గ‌ణనీయంగా పెరిగితే అది పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని జిల్లాల్లో త‌న‌దైన ముద్ర వేసింది. ప‌లు చోట్ల పోటీ ఏక‌ప‌క్షంగా సాగింది. తొమ్మిది నెల‌ల ముందుగానే టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ర‌ద్దు చేశారు. ఈ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్త‌మైంది. ప‌ట్ట‌ణంలో పోలింగ్ శాతం త‌గ్గితే..గ్రామీణ ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఓట్లు పోల‌య్యాయి. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌ల్లె ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్ల‌గ‌లిగారు. విచ్చ‌ల‌విడిగా అధికార పార్టీ అధికారాన్ని, అవ‌కాశాల‌ను వాడుకున్నారు.ప్ర‌తిప‌క్షాల ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో ..కొంద‌రు మిన‌హా అంద‌రికీ తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కులాలను విభ‌జించి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చారంటూ విప‌క్షాలు ఆరోపించాయి.

మ‌రోసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. స‌ర్కార్‌కు కావాల్సిన 61 మ్యాజిక్ ఫిగ‌ర్‌ను చేరుకుంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి జ‌గిత్యాల‌లో ఓట‌మి పాల‌య్యారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌రిగిన వివ‌క్ష‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచి పోలేదు. టీఆర్ ఎస్ ఏక‌ప‌క్షంగా పాల‌న సాగించినా ప్ర‌జ‌లు విస్ప‌ష్టంగా కూట‌మిని కాద‌ని గులాబీ వైపే మొగ్గు చూపారు. ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌క పోయినా..కేసీఆర్ చాలా తెలివిగా ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు కొన్ని ఏళ్ల నుండే వ‌ర్క్‌వుట్ చేశారు.మ‌హిళ‌లు భారీ స్థాయిలో టీఆర్ ఎస్ వైపు పోటెత్తారు. రైతులు, మ‌హిళ‌లు అధిక శాతం ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూట‌మిగా ఏర్పాటు అయ్యాక కేసీఆర్‌ను ఎదుర్కోవ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఏం చేస్తామో చెప్ప‌క పోవ‌డం, కూటమి ప‌రంగా సీఎం క్యాండిడేట్ ను ప్ర‌క‌టించ‌క పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి.

ట్ర‌బుల్ షూట‌ర్‌గా కేసీఆర్‌కు..హ‌రీష్ రావుకు పేరుంది. ఏ స‌మ‌యంలోనైనా ఓట‌మిని ఒప్పుకోని మ‌న‌స్త‌త్వం కేసీఆర్‌ది. హ‌రీష్‌, కేటీఆర్‌, కేసీఆర్ లు భారీ మెజారిటీని సాధించినా..సెంటిమెంట్‌ను ర‌గిలించ‌డంలో సక్సెస్ కాగ‌లిగారు. ఇది ప్ర‌జ‌ల తీర్పు గా ప్ర‌క‌టించినా ..తెలంగాణ ప్ర‌జ‌లు టీడీపీని, చంద్ర‌బాబును నిర్ద‌ద్వంగా ఈ తీర్పుతో తిర‌స్క‌రించారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా ఇక్క‌డి జ‌నం జీర్ణించు కోలేక పోయారు. సెటిల‌ర్స్ సైతం గులాబీ వైపే ఉండ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను క‌ల‌వ‌ర‌ప‌డేలా చేసింది. ట్రెండ్ ఈ రకంగా ఉంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు సైతం ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్ట‌డంలో, కోలుకోలేని విధంగా దెబ్బ తీయ‌డం కేసీఆర్‌కు వెన్న‌తో పెట్టిన విద్యం. టీడీపీలో వ్యూహాత్మ‌క నాయ‌కుల్లో కేసీఆర్ ఒక‌రు.

ప్ర‌తి పైసా ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం, కేడ‌ర్‌లో జోష్ నింప‌డం, విప‌క్షాల అభ్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో గులాబీ ద‌ళ‌ప‌తి అంద‌రికంటే ముందంజ‌లో నిలిచారు. కోదండ‌రాంను స‌క్ర‌మంగా వినియోగించుకోలేక పోయింది కూట‌మి, గ‌ద్ద‌ర్‌, మంద‌కృష్ణ మాదిగ‌, చాడ వెంక‌ట్ రెడ్డి, ఎల్‌.ర‌మ‌ణ‌, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజ‌నర‌సింహ‌, భ‌ట్టి విక్ర‌మార్క‌, విజ‌య‌శాంతి, ఖుష్బూ, త‌దిత‌రులు ప్ర‌చారం చేసినా బ‌క్క ప‌ల్చ‌ని బాస్‌ను క‌దిలించ లేక‌పోయారు. ఈ గెలుపు ఇచ్చిన తీర్పుతో మ‌రింత ముందుకు వెళ్లే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇప్ప‌టికే ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ స‌చివాలయానికి రాకుండా పాల‌న సాగిస్తున్న కేసీఆర్ మ‌రోసారి త‌న మాట‌కు..చేత‌ల‌కు ప‌వ‌ర్ ఉంద‌ని నిరూపించారు..విజ‌యం సాధించారు. ఎవ‌రు గెలిచారు..ఎవ‌రు ఓడారు అన్న దానికంటే..ఎన్నిక‌లు అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం. కానీ అంతిమంగా ప్ర‌జ‌లు త‌మ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు. త‌మ‌పై ఇంకెవ్వ‌రి పెత్త‌నం స‌హించ‌మంటూ తేల్చి చెప్పారు.

ఈ గెలుపు గులాబీది కాదు..నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌లది. అందుకే ఎన్ని నోట్ల క‌ట్ట‌లు దొర్లినా..ఎన్ని బెట్టింగ్‌లు చోటు చేసుకున్నా..కేసులు న‌మోదైనా..బంగారం దొరికినా..మ‌ద్యం ఏరులై పారినా..ఓట‌ర్లు మాత్రం ఏపీ పెత్త‌నాన్ని స‌హించ‌బోమంటూ స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చారు ఓట్ల ద్వారా. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుంద‌న్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌పై మొగ్గు చూపారు.

No comments