Header Ads

త్వరలోనే రాజీనామా చేయనున్న కేసీఆర్.? జాతీయ రాజకీయాల కోసమా.?

జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం వస్తే తెలంగాణ సీఎం గా రాజీనామా చేసి జాతీయ రాజకీయాలపైన ఏకాగ్రత నిలుపుతా అని కేసీఆర్ తెలిపారు అని వినిపిస్తున్న పుకారు, అయితే ఇప్పుడు ఆయన ప్రాంతీయ పార్టీలన్నిటిని ఏకం చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి లో ఫెడరల్ ఫ్రంట్ ను నిర్మించే పని లో నిమగ్నమయ్యారు కేసీఆర్.




తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహం :

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్, పూర్తి స్థాయిలో కేవలం తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రమే ఉండాలని, మంత్రి వర్గం లో స్థానం వద్దు అని అంటున్నారని సమాచారం. జాతీయ స్థాయి లో తెరాస ను బలోపేతం చెయ్యడానికి కేటీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అందులో భాగంగా ఆంధ్ర ఎన్నికల్లో వైసీపీ లేదా జనసేన కు సపోర్ట్ చేసి, ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం అని కేటీఆర్, కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది టీడీపీ పార్టీ కి. ఇక ఆంధ్ర ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలి అని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.

ఆంధ్ర లో తెరాస కు ఆదరణ లభిస్తుందా.?

తెలంగాణ రావడానికి ముఖ్యమైన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు, అలంటి కేసీఆర్ తెరాస పార్టీ కి ఆంధ్ర లో ఆదరణ ఎలా లభిస్తుందని చాలా మంది వ్యక్త పరుస్తున్న అనుమానం, కానీ హైదరాబాద్ లో ఎక్కువగా నివసించే ఆంధ్ర ప్రాంత వాసులు ఈ ఎన్నికల్లో తెరాస కు భారీ మద్దతుని ఇచ్చారు. దీంతో తెరాస నేతలకు ఊపు వచ్చింది. ఇదే మంచి తరుణం అనుకొని, ఆంధ్రాలో జగన్ లేదా పవన్ లకు సపోర్ట్ గా నిలిచి చంద్రబాబు కి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగు దేశం తల దూర్చినప్పుడు , ఆంధ్ర ఎన్నికల్లో తెరాస కూడా తల దూరుస్తాది, రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తాం అని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ రాజీనామా చేస్తే తెలంగాణ సీఎం అయ్యేది ఎవరు.?

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్ కి ఇవ్వడం తో, ఒక వేళ కేసీఆర్ సీఎం గా తప్పుకుంటే, హరీష్ రావు ని సీఎం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. మాస్ జనాల్లో హరీష్ రావు కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అతనైతేనే కరెక్ట్ అని తెరాస కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. ఒకరు పార్టీ ని మరొకరు సీఎం పదవిని చూసుకుంటే, జాతీయ స్థాయి లో కేసీఆర్ తన వ్యూహాన్ని అమలు చెయ్యడానికి సులువుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల మాట.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో..

కేసీఆర్ ఎమ్మెల్యే గా రాజీనామా చేసి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేసి పార్లమెంట్ కి వెళ్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం అవుతున్న మాట, పార్లమెంట్ కి వెళ్లి జాతీయ స్థాయి లో చక్రం తిప్పాలంటే ముఖ్య మంత్రి బాధ్యతను వేరే వారికి అప్పగించాల్సిందే గా అని కామెంట్స్ వస్తున్నాయి నెటిజన్స్ నుండి.

No comments