Header Ads

తెలంగాణ ఎన్నికల్లో గెలుపెవరిది..? ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది.? తెలంగాణ ఎన్నికల సమగ్ర సమాచారం మీకోసం.

తెలంగాణ లో ఎన్నికలు ముగిసాయి, ఇక ఫలితాల కోసమే అందరి ఎదురుచూపులు, తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ స్టార్ హీరో లు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ మొదలు స్టార్ డైరెక్టర్ లు రాజమౌళి, కొరటాల శివ వరకు వారి ఓటు హక్కు ని వినియోగించుకున్నారు, క్రీడాకారులలో కూడా ప్రగ్యాన్ ఓజా, సానియా మీర్జా లాంటి వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇలా సెలబ్రిటీస్ నుండి సామాన్యుల వరకు అందరూ వారి వారి ఓటు లను వినియోగించుకున్నారు.



బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లు జనాలతో కిక్కిరిసాయి..!!

సామాన్యంగా హైదరాబాద్ మహా నగరం లో సంక్రాంతి పండక్కి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో ఎక్కువగా జనాల రద్దీ కనిపిస్తుంది, కానీ ఈ సారి ఎలక్షన్స్ కి రికార్డు స్థాయి లో జనాలు పల్లెలకి చేరి తమ ఓటు హక్కు ని వినియోగించుకున్నారు, బస్ పైన ఎక్కి, బస్సు వెనకాల పైకి ఎక్కే నిచ్చనను పట్టుకొని వేలాడుతూ, కింద మీద పడి తిప్పలు పడుతూ సొంత ఊర్లకి చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది అంటే...

2014 లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 69.5% ఓట్లు నమోదు కాగా, ఈ సారి తెలంగాణ వ్యాప్తంగా 67% కి పైగా ఓట్లు నమోదయ్యాయి అని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హ తెలిపారు.

లగడపాటి సర్వే...

జాతీయ మీడియా చానెల్స్ అన్నీ వారు చేసిన సర్వే లలో తెరాస నే గెలుస్తుందని చెప్పారు, కానీ లగడపాటి రాజగోపాల్ గారి సర్వే ప్రకారం కాంగ్రెస్+టీడీపీ అధికారం లోకి వస్తుందని చెబుతున్నారు, తెరాస కంటే ప్రజా కూటమి కె ఎక్కువ స్థానాలు వస్తాయి, జాతీయ మీడియా సర్వే లు దక్షిణ భారతదేశం లో ఎప్పుడు తప్పుగానే చెప్పారు, కచ్చితంగా టీడీపీ+కాంగ్రెస్ పార్టీ లు ఏర్పాటు చేసిన ప్రజకూటమి నే అధికారం లోకి వస్తుందని ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు లగడపాటి రాజగోపాల్.

 

No comments