Header Ads

దేవుడి దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవాలంటారు ఎందుకు??? గర్భగుడి గడప తొక్కకూడదు ఎందుకోతెలుసా?

రోజు కొక సారో ,వారానికి ఒక సారో.. వారంలో ఫలానా రోజో గుడికెళ్తూనే ఉంటారు...దేవుడి దర్శనం కోసం ,మానసిక ప్రశాంతత కోసం గుడికి వెళ్తుంటాం..గుడికి వెళ్లినప్పుడు అక్కడ రక రకాల నియమాలుంటాయి..వాటివెనుక కొన్ని కథలుంటాయి.. గర్భగుడి గడప తొక్క కూడదనే దాని గురించి,దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవాలనే దాని గురించి తెలుసుకొండి.




మన ఇళ్ళకూ గడప ఉంటుంది కానీ ఇళ్ల లో మాదిరి గా చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండలమీదే వెలిశాడు. కావున ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుడ్ని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అలాగే అంతటి భక్తుడ్ని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము.కాబట్టి  దేవాలయాల్లో గడపని తొక్కిదాటకండి, కేవలం దాటండి.

గుడిలో దేవుని దర్శనం, షటగోపము పెట్టడం అయ్యాక కొంచెంసేపు గుడిలో కూర్చొని వెళ్ళాలి అని అంటుంటారు. అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము, పుణ్యం కోసము, కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు. అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాము. ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాము. రోజువారి జీవన విధానాన్ని సరి చేసుకుని సరైన మార్గంలో నడుస్తాము. గుడిలో కూర్చోవడం ఒక రకమైన ధ్యాన పధ్ధతి కూడా.

కేవలం కూర్చోవటమే కాకుండా ఓ రెండు నిమిషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది.

No comments