Header Ads

చ‌ర్మ సంర‌క్ష‌ణ కోస‌మే కాదు.. వాజెలైన్ ఇలా కూడా మ‌న‌కు ప‌నికొస్తుంది తెలుసా..?

వాజెలైన్‌. చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు దీన్ని చాలా మంది వాడుతారు. ప‌గిలిన చ‌ర్మానికి ర‌క్ష‌ణ అందించ‌డం కోసం, చ‌ర్మం మృదువుగా మార‌డం కోసం, పొడిగా ఉన్న చ‌ర్మం తేమ‌గా అవ‌డం కోసం దీన్ని వాడుతారు. అయితే మీకు తెలుసా..? వాజెలైన్ కేవ‌లం ఈ ప‌నుల‌కే కాదు, ఇంకా ప‌లు ర‌కాల ప‌నుల‌కు కూడా మ‌న‌కు ప‌నికొస్తుంది. ఆ ప‌నులు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చ‌ర్యపోతారు. మ‌రి వాజెలైన్ ను ఇంకా మ‌నం ఏ విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!




1. మేక‌ప్ రిమూవ‌ర్‌

మేక‌ప్‌ను తీయ‌డానికి స్త్రీల‌కు మార్కెట్‌లో ఎన్నో ర‌కాల మేక‌ప్ రిమూవ‌ర్స్ దొరుకుతున్నాయి. అయితే వాటితో ప‌నిలేకుండా కేవ‌లం వాజెలైన్ ద్వారానే మేక‌ప్‌ను తీయ‌వచ్చు. అందుకు ఏం చేయాలంటే కొద్దిగా వాజెలైన్‌ను తీసుకుని ముఖంపై మ‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి. అనంత‌రం టిష్యూ పేప‌ర్‌తో తుడిచి నీటితో క‌డిగేయాలి. దీంతో మేక‌ప్ పోతుంది.

2. వ‌క్షోజాలు

కొంద‌రు స్త్రీలు తమ వక్షోజాలు చిన్న సైజ్‌లో ఉన్నాయ‌ని బాధ‌ప‌డుతూ ఉంటారు. అయితే వారు వాజెలైన్‌తో త‌మ వ‌క్షోజాల సైజ్‌ను పెంచుకోవ‌చ్చ‌ట‌. నిత్యం కొంత వాజెలైన్‌ను తీసుకుని వ‌క్షోజాల‌కు రాసి 5 నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల‌కు వ‌క్షోజాల సైజ్ పెరుగుతుంద‌ట‌.

3. పెర్‌ఫ్యూమ్‌

నేడు మన‌కు మార్కెట్‌లో ఎన్నో ర‌కాల పెర్‌ఫ్యూమ్స్ ల‌భిస్తున్నాయి. అయితే ఏ పెర్‌ఫ్యూమ్‌ను వాడినా అది వేసుకున్న కొంత సేప‌టి వ‌ర‌కు మాత్ర‌మే వాస‌న ఉంటుంది. కానీ వాజెలైన్‌తో ఆ వాస‌న ఎక్కువ సేపు ఉండేలా చేయ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. కొద్దిగా వాజెలైన్ తీసుకుని చంక‌ల్లో రాసుకోవాలి. త‌రువాత పెర్‌ఫ్యూమ్ కొట్టాలి. దీంతో దాని వాస‌న ఎక్కువ సేపు ఉంటుంది.

4. వెంట్రుక‌లు

కొంద‌రు స్త్రీలకు ముఖంపై అవాంఛిత రోమాలు ఉంటాయి. వాటిని సుల‌భంగా తీసేందుకు వాజెలైన్ ప‌నికొస్తుంది. అందుకు ఏం చేయాలంటే కొద్దిగా వాజెలైన్‌ను స‌ద‌రు వెంట్రుక‌ల‌పై రాసి వాటిని పీకితే చాలు, మంట పుట్ట‌దు, నొప్పి అనిపించ‌దు. వెంట్రుక‌లు వెంట‌నే వ‌చ్చేస్తాయి.

5. క‌ను రెప్ప‌లు

క‌ను రెప్పల‌కు ఉండే వెంట్రుక‌లు ద‌ట్టంగా పెర‌గాల‌ని కొంద‌రు కోరుకుంటారు. అయితే అందుకు వాజెలైన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. నిత్యం రాత్రి ప‌డుకునే ముందు క‌ను రెప్ప‌ల‌పై వాజెలైన్‌ను రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే క‌డిగేయాలి. దీంతో కొద్ది రోజుల‌కు క‌ను రెప్ప‌లు పెరుగుతాయి.

6. శిరోజాలు

కొంద‌రికి శిరోజాలు చివ‌ర్లో చిట్లిపోయి అంద విహీనంగా, ప్ర‌కాశం లేకుండా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే వాజెలైన్‌ను ఆ వెంట్రుక‌ల‌కు అప్లై చేసి కొంత సేపు అయ్యాక షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. దీంతో వెంట్రుక‌లు చిట్లిపోవ‌డం త‌గ్గుతుంది. అయితే ప‌దే ప‌దే ఇలా వాజెలైన్‌ను వాడ‌రాదు. రిజ‌ల్ట్ రాగానే ఇలా వాడ‌డం ఆపేయాలి.

7. తెగిన గాయాల‌కు

వెంట్రుల‌ను షేవ్ చేసేట‌ప్పుడు కొంద‌రికి చ‌ర్మం తెగుతుంది. అయితే దానిపై కొంత వాజెలైన్‌ను అప్లై చేస్తే చాలు, మంట త‌గ్గుతుంది. ఆ గాయం కూడా త్వ‌ర‌గా మానుతుంది.

No comments