Header Ads

ఆడవాళ్ళూ సె** గురించి మాట్లాడితే తప్పేముంది.? సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా.!!

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ అంటే అందరికీ గుర్తొచ్చేది తమన్నా పేరే, తమన్నా అందమే తమన్నాకు ప్లస్ పాయింట్. నటన, నృత్యం, అందం, అభినయం.. ఇలా అన్నిటిలోను తమన్నా అదరగొడుతుంది. ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది తమన్నా, అలంటి తమన్నా సెక్స్ గురుంచి ఇప్పుడు డైరెక్ట్ గా కామెంట్ చేయడం తో సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా మారిపోయింది తమన్నా.




మహిళల లైంగిక పరమైన అంశాల గురించి మాట్లాడితే తప్పేంటి.? అని ప్రశ్నిస్తోంది తమన్నా. ''సమాజంలో ఆడవాళ్లు సెక్స్ గురించి మాట్లడితే తప్పేముంది, అలా మాట్లాడే వారిని ఎందుకు తప్పుపడతారు, లైంగికపరమైన అంశాల గురించి మాట్లాడడంలో తప్పులేదు. ఈ విషయంలో ఆడవాళ్లను ఎందుకు ప్రోత్సహించరు.? మన సమాజంలో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన విధానాన్ని బట్టి, వారు ధరించే లో దుస్తులను బట్టి అంచనా వేయడం సరికాదు, అసలు ఆలా దుస్తులను బట్టి అంచనా వేయడం ఏంటి అని'' ప్రశ్నిస్తోంది మిల్కీ బ్యూటీ.

తమన్నా, టాలీవుడ్ లో అగ్రకథానాయకులు అందరితోనూ నటించింది . మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్ టాప్ 6 స్టార్స్ తో నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ తమన్నా నే, ప్రస్తుతం అభినేత్రి-2 సినిమా షూటింగ్ ఓ బిజీ గా ఉంది. సుందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన 'నెక్స్ట్ ఏంటి' సినిమా అనుకున్నంతగా జనాల మధ్యలోకి వెళ్ళలేదు, దీంతో ఈ మిల్కీ బ్యూటీ కాస్త డీలా పడింది. వరుస పరాజయాలతో తమన్నా కు బడా ఆఫర్స్ దూరం అవుతున్నాయి.

బాహుబలి చిత్రం తరువాత తమన్నా కు బడా హీరో ల సినిమాల్లో తిరిగి అవకాశాలు వస్తాయి అనుకున్నారు అంతా, కానీ అలా జరగలేదు. తమన్నా చేతిలో ప్రస్తుతం ఉన్న ఏకైక బడా చిత్రం F2, వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరో లుగా నటిస్తున్న F2 చిత్రం లో తమన్నా తో పాటు మెహ్రీన్ మరొక హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కి విడుదల కానున్న F2 చిత్రం మీదే తమన్నా ఆశలు పెట్టుకుంది.

No comments