Header Ads

ప్ర‌పంచాన్ని ఊపేస్తున్న పాట‌ల చెలికాడు - జస్టిన్ బీబర్

బాబ్ మార్లే, మైఖేల్ జాక్స‌న్ లు ప్ర‌పంచాన్ని త‌మ పాట‌ల‌తో..త‌మ గాత్ర మాధుర్యంతో ఊపేసిన పాట‌గాళ్లు. జాక్స‌న్ త‌ర్వాత ఇపుడు ప్ర‌పంచమంత‌టా అమెరిక‌న్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ త‌న పాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. వేలు..ల‌క్ష‌లు కాదు..కోట్లాది మంది అభిమానులు క‌లిగిన ఏకైక ఇంట‌ర్నేష‌న‌ల్ సింగ‌ర్ ఇత‌ను ఒక్క‌డే. 1994 మార్చి ఒక‌టిన లండ‌న్‌లో జ‌న్మించిన బీబ‌ర్ పాట‌గాడే కాదు..ర‌చ‌యిత కూడా. యూట్యూబ్ ద్వారా మొద‌ట్లో తాను పాడిన వీడియోను అప్ లోడ్ చేశారు. ఊహించ‌ని రీతిలో వ్యూవ‌ర్స్‌ను ఊపేసింది. కోట్లాది మంది బీబ‌ర్ అంటూ ప‌రుగులు తీశారు. ఆ గాత్ర మాధుర్యం..ఆ లేలేత ప‌ద‌బంధ‌నాల‌లో త‌మ‌ను తాము చూసుకున్నారు. తామే లీన‌మై పాడుతున్నామా అన్నంతగా ప్రేమ‌లో ప‌డిపోయారు. చిన్నారులు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు..ఇలా ఒక‌రేటిమి..కుల‌, మ‌తాలు, జాతుల‌కు అతీతంగా జ‌స్టిన్ ...రికార్డులు తిర‌గ రాశాడు. ఇపి, మై వ‌ర‌ల్డ్ పేరుతో విడుద‌ల చేసిన సాంగ్స్ ఆల్బ‌మ్స్ ఆల్ టైం రికార్డులుగా నిలిచాయి.
స‌ర్టిఫైడ్ ప్లాటినం అందుకున్న ఒకే ఒక్క సింగ‌ర్ ఇత‌డే. బిల్ బోర్డ్ హాట్ 100 లిస్టులో బీబ‌ర్ ఆల్ టైం రికార్డు న‌మోదు చేశాడు. ఫుల్ లెవ‌ల్ లెంత్ స్టూడియో ఆల్బం మై వ‌ర‌ల్డ్ 2.0 డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టింది. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లో రికార్డు న‌మోదు చేసింది. సింగిల్ గా రిలీజ్ చేసిన బేబి సాంగ్ ఊపేసింది. నెవర్ సే నెవ‌ర్ అనే పేరుతో 2011లో ఆల్బంను రిలీజ్ చేశారు. బిల్‌బోర్డు 200 లో రికార్డు బ్రేక్ షేక్ చేసింది. మూడో స్టూడియో ఆల్బం బిలీవ్ పేరుతో 2012లో విడుద‌ల చేశాడు. బాయ్ ఫ్రెండ్ పాట ఊపేసింది. నాలుగో స్టూడియో ఆల్బం ప‌ర్ప‌స్ కు మంచి పేరు తీసుకు వ‌చ్చింది. వాట్ డూ యు మీన్ ..సారీ..ల‌వ్ యువ‌ర్ సెల్ఫ్‌, కోల్డ్ వాట‌ర్‌, లెట్స్ మీ ల‌వ్ యూ, డెస్పాటిసిఓ, ఐయాం ద ఒన్‌, 44.7 మిలియ‌న్ ప్ర‌జ‌లు యుఎస్‌లో ఆల్బ‌మ్స్‌ను కొనుగోలు చేశారు. ఇదో రికార్డుగా న‌మోదైంది. 44. 7 మిలియ‌న్ల‌ను వ‌సూలు చేశాయి. ట్విట్ట‌ర్ లో కార్లీ పెర్రీ త‌ర్వాత 100 మిలియ‌న్ ప‌ర్స‌న్స్ ఫాలోఅర్స్ గా ఉన్నారు.

బీబ‌ర్ లెక్క‌లేనన్ని అవార్డులు అందుకున్నారు. అమెరిక‌న్ మ్యూజిక్ అవార్డు పొందారు. 2010, 2012 లో గ్రామీ అవార్డు లు పొందారు. బెస్ట్ డాన్స్ రికార్డింగ్ తో త‌యారైన సాంగ్ వేర్ ఆర్ యు నౌ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. లాటిన్ గ్రామీ అవార్డు ద‌క్కించుకున్నారు. ఫోర్ట్స్ మ్యాగ‌జైన్ మూడేళ్ల పాటు అత్యుత్త‌మ సింగ‌ర్స్ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచాడు బీబ‌ర్‌. జ‌స్టిన్ వీడియో ఆల్బ‌మ్స్‌ను 10 బిలియ‌న్స్ చూశారు. ఇదో ప్ర‌పంచ రికార్డు . రేమాండ్ బ్రాం మీడియా గ్రూప్ సంస్థ‌కు సంత‌కం చేశాడు. ఒన్ టైం సాంగ్ ఇప్ప‌టికీ ఆల్ టైం రికార్డుగా ఉంది. కెన‌డియ‌న్ హాట్ 100లో 12వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , త‌దిత‌ర కంట్రీస్‌లో బీబ‌ర్ సాంగ్స్ సంచ‌ల‌నం రేపాయి. ఒన్ లెస్స్ లోన్లీ గ‌ర్ల్, ల‌వ్ మీ , ఫెవ‌రేట్ గ‌ర్ల్ సాంగ్స్ బిల్‌బోర్డు చార్ట్స్‌లో చోటు చేసుకుంది. కెనెడా, అమెరికా, లండ‌న్‌ల‌లో బీబ‌ర్ సాంగ్స్‌కు జ‌నం ప‌డిచ‌స్తారు. ప‌రుగులు తీస్తారు. ఒక్కోసారి ఏడుస్తారు. త‌ట్టుకోలేక‌..అత‌డిని చూసేందుకు ల‌క్ష‌లాది మంది త‌ర‌లి వ‌స్తారు. ఇది ఈ గాయ‌కుడికి ఉన్న క్రెడిబిలిటి. ద టుడే షో, వెండీ విలియ‌స్ షో, లోపెజ్ టునైట్‌, ద ఎల్లెన్ డీ జెన‌ర‌స్ షో, అలెక్సా చుంగ్‌, గుడ్ మార్నింగ్ అమెరికా, చెలెసా లేట్‌లీ, బెట్స్ 106, పార్క్ బీబ‌ర్ , ట్రూ జాక్స‌న్ లు పాట‌గాళ్లుగా పేరొందారు.

వైట్ హౌస్‌లో అప్ప‌టి యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా, మిచెల్లె ఒబామాల స‌మ‌క్షంలో నిర్వ‌హించిన స‌మ్ డే క్రిష్ట‌మ‌స్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జ‌స్టిన్ బీబ‌ర్ త‌న గాత్రంతో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. బీబ‌ర్ పాడుతున్న దానిని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సారం చేశారు. కోట్లాది మంది బీబ‌ర్ అండ్ టీంను వీక్షించారు. 2010 జ‌న‌వ‌రి 31న 52 యాన్యువ‌ల్ గ్రామీ అవార్డుల కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా బీబ‌ర్ హాజ‌ర‌య్యారు. వావిన్ వీడియో ఆల్బం కూడా రికార్డు సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే జ‌స్టిన్ బీబ‌ర్‌కు ఆ దేశాధ్య‌క్షుడి కంటే ఎక్కువ జ‌నాద‌ర‌ణ క‌లిగిన వ్య‌క్తిగా పేరు సంపాదించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా లెక్క‌లేన‌న్ని ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. పాప్ మ్యూజిక్ స్టార్‌గా ప్ర‌పంచాన్ని మ‌నోడు ఊపేస్తున్నాడు. యూట్యూబ్‌లో హ‌య్య‌స్ట్ వ్యూవ‌ర్స్ క‌లిగిన సింగ‌ర్‌గా బీబ‌ర్ రికార్డు సృష్టించారు. కోట్లాది రూపాయ‌లు..లెక్క‌లేన‌న్ని ఆస్తులు..ఆయ‌న చెంత‌కు చేరాయి. స్పెష‌ల్‌గా భారీ బిల్డింగ్ క‌ట్టారు. ఎక్క‌డికి వెళ్లినా వంద‌లాది మంది బౌన్స‌ర్లు ఉంటారు. త‌న‌కంటూ స్వంత టీం ఉంది.

బీబ‌ర్‌ను కూడా వివాదాలు వెంటాడాయి. అయినా ఈ పాట‌ల చెలికాడు ..పాడితే చాలు కోట్లాది గుండెలు ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డ‌తాయి. ఇండియాలోని ముంబ‌యికి వ‌చ్చాడు. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు ఈ గాయ‌కుడిని చూసేందుకు బారులు తీరి నిల‌బ‌డ్డారు. రిల‌య‌న్స్ అంబానీ బీబ‌ర్‌ను ఇక్క‌డికి ర‌ప్పించాడు. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ..బీబ‌ర్ ..బీబ‌ర్ అంటూ ఊగిపోయింది. ఆ న‌గ‌రం నినాదాల‌తో అట్టుడుకి పోయింది. ఇదీ బీబ‌ర్‌కు ఉన్న క్రేజ్‌. వ‌ర‌ల్డ్ మోస్ట్ టాలెంటెడ్‌..సింగ‌ర్‌గా ఇప్ప‌టికీ త‌న స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకుంటూ ..త‌న రికార్డుల‌ను తానే బ్రేక్ చేస్తూ సాగిపోతున్నాడు..బీబ‌ర్. వీలైతే యూట్యూబ్‌లోకి వెళ్లండి..బీబ‌ర్ సాంగ్స్ వినండి..ఆ మాధుర్యాన్ని మీలోకి వంపుకోండి..జీవితం ఇక ధ‌న్య‌మైన‌ట్టే..అనిపిస్తుంది.

No comments