Header Ads

ఇంకో సారి పెళ్లి చేసుకొనే ఆలోచనే లేదు - సుమంత్.!!

మళ్ళీరావా సినిమా తో మరో సారి మనందరినీ ఆకట్టుకున్న సుమంత్. తన జీవితం లో మాత్రం మళ్ళీ ఇంకో అమ్మాయి రాకూడదు అనుకుంటున్నాడు, కారణం ఏంటో తెలియదు కానీ, ఇంకొకరు మాత్రం వద్దనుకుంటున్నాడు. ఒక ఇంటర్వ్యూ లో సుమంత్ ని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ:




"విడాకులు తీసుకున్నాక నాకు మళ్ళీ పెళ్లి చేసుకోబుద్ధి కాలేదు, నాకు తెలిసి బ్రతకాలి అంటే పెళ్లి అవసరం కాదు, సినిమా ఇండస్ట్రీ లో, రాజకీయాల్లో, బిజినెస్ మాన్ లలో పెళ్లి చేసుకోకుండా కూడా జీవితం లో సక్సెస్ సాధించిన వారు ఉన్నారు". అని సమాధానమిచ్చారు సుమంత్.

సినిమాలు ప్లాప్ అవుతున్నా, నాకు నమ్మకం ఉంది..

"సినిమా లు ప్లాప్ అవుతున్నా, నాకు ఎక్కడో ఒక నమ్మకం ఉండేది, ఒక్క సినిమా హిట్ అయినా జనాలు ఆదరిస్తారు, ఎన్ని వచ్చినా కూడా కష్టపడి పని చేస్తే జనం ఒప్పుకుంటారు అని నాకు నమ్మకం ఉంది, సత్యం టైం లో కూడా జరిగింది ఇదే. మళ్ళీ ఫార్మ్ లోకి రావొచ్చు అని నీరుపించింది, సత్యం సినిమాకు ముందు కొన్ని ప్లాప్స్ వచ్చాయి, కానీ సత్యం బ్లాక్ బస్టర్. గోదావరి, గోల్కొండ హై స్కూల్ సినిమాలకు కూడా ఇలాగె జరిగింది, అండ్ మళ్ళీరావా సినిమా నాకో కొత్త లైఫ్ ఇచ్చింది". అని సుమంత్ తెలిపారు.

నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఇలా ఉన్నా :

"ప్లాప్స్ వచ్చినప్పుడు కూడా నేను పెద్దగా డిప్రెషన్ లోకి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా గట్టిగా ఉంది, వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసారు, డబ్బుల కోసం సినిమాలు చెయ్యాలి అని అనుకోలేదు, ఎందుకంటే నా దెగ్గర డబ్బులు ఉన్నాయ్ కాబట్టి, అందుకే డబ్బుల కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యాలని నేను అనుకోను, కొంత మంది ఇంక డబ్బుల కోసం తప్పక చెయ్యాలి అనుకుంటారు, కానీ నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం, నేను ఇన్వెస్ట్ చేసిన మనీ, ఇలా అనుకూలమైనవి చాలా ఉండటం తో నాకు ఆ అవసరం రాలేదు". అని సుమంత్ తెలిపారు.

Watch Video:

https://www.youtube.com/watch?v=tH6gQlEE_qk&feature=youtu.be&fbclid=IwAR0Mg4i4sofShF8wjhKDQD-TC31B-EnEx1Yr5S5Y_3N6Hcq5rjcUvrA-RHM

No comments