Header Ads

ఓంకారం యొక్క గొప్పతనం. ఓం శబ్దానికి ఉన్న శక్తి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

ఓం అనే పదం ఎంతో గొప్పది, మహర్షులు తప్పస్సు చేసే సమయం లో ఓం అనే పదాన్ని మాత్రమే పలుకుతారు, ఓం అనే పదానికి ఎందుకు అంత శక్తి.?





ఓం అనే పదం హిందువులకు ఎందుకు ఆంత ప్రీతి :

అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓం. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. ఓం హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక ఓం. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. అందుకనే ఓంకారం హిందువులకు ప్రీతి.

వినాయకుడిని ఓం రూపం లో..

ఓం అనే పదం వినాయకుడిని కూడా సూచిస్తుంది. విగ్నేశ్వరుడిని ఓం రూపం లో చిత్రిస్తారు కళాకారులు, మనము ఏదైనా మొదలు పెట్టాలి అంటే ముందు విగ్నేశ్వరుడిని పూజిస్తాం, ఏదైనా కార్యం మొదలు పెట్టాలి అంటే ఓం అని మొదలుపెడతాం, అందువలన విగ్నేశ్వరుడిని ఓం అనే పదము లా మలిచి మనము పూజిస్తాము.

సృష్టి అంతమూ ఆరంభమూ ఓంకారం తోనే :

సృష్టి ఆవిర్భవించినప్పుడు ఓం అనే ధ్వని గట్టిగ విన్పించిందని పురాణాల్లో తెలుపబడి ఉంది, అందుకనే ఓంకారం మొదటి పదముగా చెబుతారు, సృష్టి అంతం అయ్యేటప్పుడు కూడా ఓం అనే ధ్వని గట్టిగా విన్పిస్తుందని పురాణాల్లో తెలిపారు.

ఏకాగ్రత ను పెంపొందించే... :

ఓం పదం ఏకాగ్రతను పెంపొందిస్తుంది, మునీశ్వరులు నుండి సామాన్య మానవుల వరకు అందరూ ఓం పదాన్ని జపిస్తూ ఉంటారు, దీనికి ముఖ్య కారణం ఓంకారం ఏకాగ్రతను పెంపొందిస్తుంది, ఒక విషయం మీద దృష్టి పెట్టాలంటే ఓంకారం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

మంత్రోచ్చారణ కు మొదలు ఓం :

ఓంకారం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న కారణంగా, ఓం శబ్దంతోనే మంత్రోచ్చారణ ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది. అలాగే కొనసాగుతుంది కూడా.

No comments