Header Ads

ఎన్నికల్లో ఉపయోగించే ఇన్క్ ఎక్కడ తయారీ చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తయారీ చేసిన వాళ్ళని మెచ్చుకున్నఉన్నతాధికారి, ఆయన ఎవరంటే.?

ఎలక్షన్స్ (ఎన్నికలు) అనేవి ప్రపంచం లో ముఖ్య పాత్ర పోషిస్తాయి, నాయకులను ఎన్నుకొనేది ప్రజలు, ఏ నాయకుడు పాలించాలి అనేది నిర్ణయించేది ప్రజలు మాత్రమే, అందుకే ఎలక్షన్స్ కి అంత ప్రాధాన్యత. ఎలక్షన్ ఇన్క్ కి కూడా చాలా ప్రాధాన్యత ఉంది, ఎలక్షన్స్ లో ఓటు వేసిన వెంటనే ఇన్క్ మన చేతి గొరికి అంటిస్తారు, దాని అర్ధం, మనం ఓటు వేసాం అని. ఆ ఇన్క్ తొందరగా తొలగిపోదు, అందుకే ఆ ఇన్క్ వాడుతారు, అసలు ఆ ఇన్క్ ఎక్కడ తయారీ చేస్తారో తెలుసా?




మైసూర్ కంపెనీ అనే కంపెనీ ఈ ఇన్క్ ని తాయారు చేస్తుంది, ఈ మైసూరు కంపెనీ కర్ణాటక గవర్నమెంట్ నడుపుతుంది, నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా కర్ణాటక గవర్నమెంట్ దెగ్గరుండీ చూసుకుంటాది.

ఈ ఇన్క్ ని తాయారు చేసిన మైసూరు కంపెనీ వాళ్ళని మధ్య ప్రదేశ్ ఎలక్షన్ కమీషనర్(ఎన్నికల అధికారి) ఆర్. పరుశురాం కొనియాడారు, ఈ ఇన్క్ చాలా బాగా ఉపయోగపడింది, మా అందరికి ఈ ఇన్క్ మీదా నమ్మకం కలిగింది, దీని నాణ్యతా ఉత్తమంగా ఉంది, మైసూరు కంపెనీ వాళ్ళు చాలా బాగా పని చేసారు, ప్రమాణాలు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు, అందుకే వేరే వాటిని ఉపయోగించ దలుచుకోలేదు అని పరుశురాం తెలిపారు.

ఇక డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ లో జరగబోయే ఎన్నికలకు కూడా మైసూర్ కంపెనీ వారి ఇన్క్ నే వాడనున్నారు, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా, మైసూర్ కంపెనీ వల్లే ఇన్క్ ని సరఫరా చేస్తారు. నాణ్యతా ప్రమాణాలు మంచిగా పాటిస్తే ఎప్పటికి గుర్తింపు దక్కుతుందని మైసూరు కంపెనీ ద్వారా రుజువైంది.

No comments