Header Ads

యూత్‌కు ఆద‌ర్శం..కోట్ల‌ల్లో వ్యాపారం -మోస్ట్ ఫెవ‌ర‌బుల్ ప‌ర్స‌న్స్

ఈ ప్ర‌పంచ‌మంతా బిజినెస్ మీదే ఆధార‌ప‌డి న‌డుస్తోంది. స్టాక్ మార్కెట్ క‌ల‌ల బేహారుల‌కు అదో అంతులేని ఆనందాన్ని..విస్మ‌రించ‌లేని విషాదాన్ని క‌లుగ చేస్తుంది. ఆట‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. అలాగే బిజినెస్ కూడా ఓ ఆట లాంటిదే. టాస్ వేయ‌డం ద‌గ్గ‌రి నుండి మ్యాచ్ ముగిసే దాకా ఎన్నో మ‌లుపులు..మ‌రెన్న ఉత్కంఠ భ‌రిత క్ష‌ణాలు. బంతికీ బ్యాట్‌కు మ‌ధ్య‌..వికెట్లు..ప‌రుగుల‌కు మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ల‌క్ష‌లు..కోట్లు..మిలియ‌న్‌..బిలియ‌న్‌..ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను ఏనాడో దాటేసింది..ఈ బిజినెస్‌. ప్ర‌తి రోజు వ‌ర‌ల్డ్‌లో ఎక్క‌డో ఒక చోట టెస్ట్, వ‌న్డే , టీ 20 మ్యాచ్‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ల‌క్ష కోట్ల‌కు పైగా బెట్టింగ్‌లు జ‌రుగుతుంటాయ‌ని అభిజ్ఞ‌వ‌ర్గాల భోగ‌ట్టా. ప‌సికూన‌లు ప్ర‌తిభకు ప‌దును పెడుతున్నారు. అద్భుతంగా ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రుస్తున్నారు. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఇలాంటి ఆట‌ల్లోకే బ్యాడ్మింట‌న్‌, టెన్నిస్‌, హాకీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, క‌బ‌డ్డీ..ఇలా చెప్ప‌లేన‌న్ని క్రీడ‌లు రాజ్య‌మేలుతున్నాయి.
ప్ర‌తి ఆట చుట్టూ బిగ్ బిజినెస్ జ‌రుగుతోంది వ‌ర‌ల్డ్ వైడ్‌గా. ఇక మార్కెట్ రంగానికి వ‌స్తే ఎప్పుడూ బంగారం, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, వ‌జ్రాలు, లాజిస్టిక్స్‌, ఈ కామ‌ర్స్‌, సోష‌ల్ మీడియా, టెలికాం, విమాన‌యానం, సిమెంట్‌, స్టీల్‌, మైన్స్‌, బ్యాంకింగ్ రంగాల‌కు స్టాక్ మార్కెట్ లో ఎక్కువ‌గా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇవే నిత్యం స‌మాజానికి అవ‌స‌రం క‌నుక‌. ఇవి లేకుంటే మాన‌వ జీవితానికి మ‌నుగ‌డ వుండ‌దు క‌నుక‌. ఎన్నో ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు..19వ శ‌తాబ్ధం. ఇంట‌ర్నెట్ ప్ర‌పంచాన్ని శాసిస్తోంది. డేటా వినియోగం, క‌నెక్టివిటీ, క‌మాడిటీ రంగాల‌తో టెలికాం రంగం పెన‌వేసుకు పోయింది. ఇండియాలోనే కాదు ప్ర‌పంచంలోని ప్ర‌తి కుటుంబం నెట్‌వ‌ర్కింగ్‌తో క‌నెక్టివిటీ అయి వున్నారు. 70 శాతానికి మించి వినియోగం జ‌రుగుతోంది. ఇండియా వ‌ర‌కు వ‌స్తే బీఎస్ ఎన్ ఎల్ అతి పెద్ద నెట్‌వ‌ర్కింగ్ వాటా క‌లిగి ఉండేది..ఎప్పుడైతే ప్రైవేట్‌, విదేశీ కంపెనీల భాగ‌స్వామ్యం జ‌రిగిందో ఆ రోజు నుంచే కోట్లాది భార‌తీయులు ..ప్రైవేట్ టెలికాం స‌ర్వీసెస్ వైపు మొగ్గు చూపారు. వొడా ఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌, టెలినార్ ..ఇలా చాలా కంపెనీలు మార్కెట్‌ను స్వంతం చేసుకున్నాయి. 20 నుండి 30 శాతం మ‌ధ్య వ్యాపార వాటాను చేజిక్కించుకున్నాయి.

భార‌త్‌లో పెను సంచ‌ల‌నం రిల‌య‌న్స్ - ఏ ముహూర్తాన క‌ల గ‌న్నాడో కానీ ధీరూబాయి అంబానీ పేరు సూర్య చంద్రులున్నంత కాలం మారు మోగుతూనే వుంటుంది. గుడిసె నుంచి ఫైవ్ స్టార్ భ‌వంతుల దాకా..కూలీ నుండి వ్యాపార‌వేత్త దాకా..పిల్ల‌ల నుండి పండు ముదుస‌లి దాకా. అంద‌రి చేతుల్లో మొబైల్ ఉండాల‌ని కోరుకున్నాడు. అసాధ్య‌మైన దానిని సుసాధ్యం చేసి చూపించాడు. తాను అస‌లైన వ్యాపార‌వేత్త‌న‌ని నిరూపించుకున్నాడు. కొన్ని వేల రూపాయ‌ల‌తో ప్రారంభ‌మైన రిల‌య‌న్స్ వ్యాపారం ఇపుడు ల‌క్ష‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేరుకుంది. 999 రూపాయ‌ల లోపే అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకునే మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చాడు. మిగ‌తా ప్రైవేట్ కంపెనీలు ఊహించ‌లేదు. ఒకే ఒక్క ఐడియా ..ఇండియ‌న్ మార్కెట్‌ను కుదిపేసింది. టెలికాం , మొబైల్ కంపెనీలు ఠారెత్తాయి. ఓన్లీ విమ‌ల్ గుర్తుందా..కోట్లాది మందిని క‌నెక్టివిటీ చేసిన ప్ర‌క‌ట‌న అది. ముందు బ‌ట్ట‌ల వ్యాపారం..ఆ త‌ర్వాత ప్ర‌తి రంగంలో రిల‌య‌న్స్ ప్ర‌వేశించింది. త‌న‌కంటూ ఎదురే లేకుండా చేసింది.

ధీరూభాయి ఆలోచ‌న‌ల వెనుక మ‌న తెలుగు వాడు కృష్ణ‌మూర్తి ఉన్నారు. ల‌క్ష‌లాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తోంది రిల‌య‌న్స్‌. ముఖేష్ అంబానీ ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. మేం ఈ దేశాన్ని..ప్ర‌పంచాన్ని కుదిపేయ బోతున్నాం. డేటా..టెలికాం రంగంలో అని ప్ర‌క‌టించాడు. దానిని టేకిట్ ఈజీగా తీసుకున్నాయి ప్ర‌త్య‌ర్థి కంపెనీలు. అదే జియో..రిల‌య‌న్స్ ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా మార్కెట్‌ను ఊపేసింది. మ‌దుప‌రుల‌కు కాసులు పండించింది. అమాంతం షేర్లు పెరిగాయి. పేద‌లు ..క్ష‌ణాల్లో ధ‌న‌వంతులై పోయారు. జియో ఒక సంచ‌ల‌నం..జియో అద్భుతం..జియోనే ఓ జీవితం అనుకునేలా చేశారు. టెలికాం మార్కెట్ రంగాన్ని ఊపేసింది. 70 శాతం వాటాను ద‌క్కించుకుంది. టాప్ ఒన్‌గా నిలిచింది.

మిలియ‌న్స్‌..బిలియ‌న్స్‌..ట్రిలియ‌న్స్ డాల‌ర్ల‌ను దాటేసింది జియో. ఒకే ఒక్క రోజు 5 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లుగా చేరారు. బిగ్గెస్ట్ మార్కెట్ ఐడియా ప్ర‌పంచం గుర్తించింది. టెక్నిక‌ల్‌గా స‌క్సెస్ అయిన ఈ టెలికాం కంపెనీ వెనుక క‌ఠోర‌మైన శ్ర‌మ దాగి వుంది. వేలాది మంది ఇండియ‌న్స్ భాగ‌స్వామ్యం ఉంది. అన్నింటికి మించి ముఖేష్ కొడుకు ఆకాశ్ అంబానీ, కూతురు ఇషా అంబానీల పాత్ర ముఖ్య‌మైన‌ది. వీరిద్ద‌రూ వ్యాపార రంగాన్ని చేతుల్లోకి తీసుకున్నాక ..న్యూ ఐడియాలకు ప్రాణం వ‌చ్చింది. ల‌క్ష‌లాది మందిని వారు టెస్టింగ్ చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌పంచాన్ని ప‌రిశోధ‌న చేశారు. ఎక్క‌డ టాలెంట్ వుంటే అక్క‌డి వారిని గుర్తించారు. భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌తి ఇండియ‌న్‌..ప్ర‌తి భార‌తీయ ఫ్యామిలీ జియోలో భాగం కావాల‌న్న‌దే వీరి కోరిక‌. అది ఇపుడు నెర‌వేరింది. ఇండియా అంటే జియో..జియో అంటేనే భార‌త్ అనే స్థాయికి తీసుకు పోయారు. ప్రైవేట్ టెలికాం దిగ్గ‌జాలు ప‌త‌నావ‌స్థ‌లోకి చేరుకున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు వీరిద్ద‌రు. జ‌స్ట్ వీరి వ‌య‌స్సు 25 ఏళ్ల లోపే.

రిల‌య‌న్స్ ను ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ ఒన్ కంపెనీగా నిల‌బెట్టాల‌న్న‌ది వీరి ఆలోచ‌న‌. ముఖేష్ అంబానీ కుటుంబానికి కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివిని మ‌నోజ్ మోడీ కుడి భుజంగా ఉన్నారు. జియో కంపెనీకి సంజ‌య్ మ‌శ్రూవాలా మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా స‌క్సెస్ ఫుల్ బాట‌లో న‌డిచేలా చేస్తున్నారు. టెలికాం రంగంలో 25 ఏళ్ల అనుభ‌వం క‌లిగిన అనూజ్ జైన్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా..మ్యాథ్యూ ఊమెన్ మొత్తం నెట్‌వ‌ర్కింగ్ రంగాన్ని చూస్తున్నారు. మేనేజ్‌మెంట్ రంగాల‌కు చెందిన వేలాది మంది టెక్నిక‌ల్ గురూస్ ఇపుడు రిల‌య‌న్స్‌- జియోలో భాగ‌స్వామ్యులు. రాబోయే రోజుల్లో రిల‌య‌న్స్ దే హ‌వా. డేటా, క‌నెక్టివిటీ రంగాల్లో జియోనే రారాజు..కాద‌న‌గ‌ల‌మా.

No comments