Header Ads

మిత్రుల‌వుతున్న శ‌త్రువులు - జియో దెబ్బ‌కు అబ్బా అంటున్న కంపెనీలు

ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌తంజ‌లి ఓ ప్ర‌భంజ‌న‌మైతే..రిల‌యన్స్ ఓ పెను సంచ‌ల‌నం. ఇండియ‌న్ మార్కెట్‌పై రిల‌య‌న్స్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. ఆయిల్ రంగంలో..ఇటు లాజిస్టిక్‌..గ్యాస్‌..టెలికాం రంగాల‌లో త‌న‌కు పోటీ అంటూ లేకుండా చూసుకుంటోంది. ప్ర‌తి భార‌తీయుడి ఇంట్లో రిల‌య‌న్స్ కు సంబంధించి ఏదో ఒక‌టి ఉండాల‌న్న‌ది ..ధీరూభాయి అంబానీ క‌ల‌. ఆయ‌న ఏ ముహూర్తాన ఈ క‌ల క‌న్నాడో కానీ ..ఇండియాలో రిల‌య‌న్స్ అన్న ప‌దం ఇండియ‌న్ కంట్రీకి ఓ ప‌ర్యాయ ప‌దంగా మారిపోయింది.
ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ ..మార్కెట్‌ను షేక్ చేస్తూ..మ‌దుప‌రులకు లాభాల వాటాల‌ను పంచుతూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త స్కీంల‌తో ముందుకొస్తోంది రిల‌య‌న్స్‌. అంబానీ చ‌నిపోయాక‌..అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలు విడి పోయారు. అనిల్ త‌న కొడుకు, కూతురుకు వ్యాపార బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్పారు. వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో ఆరి తేరిన వ్య‌క్తిగా అంబానీ కూతురు పేరు గాంచింది. ఆమె ఐడియాల దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్తుల కంపెనీలు ఠారెత్తి పోతున్నాయి. ఏ రోజు ..ఏ క్ష‌ణాన ..ఎలాంటి స్కీంను ప్ర‌క‌టిస్తుందోనంటూ మార్కెట్ వ‌ర్గాలు బెంబేలెత్తి పోతున్నాయి. జియో మొబైల్ పోర్ట‌బిలిటీ స‌ర్వీస్ . అతి త‌క్కువ ధ‌ర‌కే ఇంట‌ర్నెట్ డేటా సేవ‌లు అందించి ప్ర‌పంచంలోనే అతి పెద్ద టెలికాం రంగ కంపెనీగా అవ‌త‌రించింది.

దాదాపు నాలుగున్న‌ర కోట్ల మంది జియో స‌భ్యులుగా ఉన్నారంటే వారి వ్యాపారం ఎలా విస్త‌రించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌తి ఇంటికి ఇంట‌ర్నెట్ అనుసంధానం కావాలి. ప్ర‌పంచం మ‌న టెక్నాల‌జీని చూసి విస్తు పోవాలి. ఈ దేశంలో ఏముంది అని అన్న వారికి ఒక్క‌టే స‌మాధానం. అదే జియో ..ప్ర‌తి ఇండియ‌న్ స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని చెప్పే స్థాయికి చేరుకోవాల‌న్న‌దే మా కంపెనీ ల‌క్ష్యం . అంటారు అంబానీ కూతురు.

ఆమె ప‌గ్గాలు చేప‌ట్టాక‌. రిల‌య‌న్స్ సంస్థ ..కంపెనీలు భారీగా విస్త‌రించాయి. ఇండియ‌న్ మార్కెట్‌నే కాకుండా వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో త‌న వాటాను పెంచుకునేలా చేశాయి. ఉచితంగా సిమ్‌లు..త‌క్కువ ధ‌ర‌కే డేటా, కాల్ స‌ర్వీస్ ఇవ్వ‌డం జియో ప్ర‌త్యేక‌త‌. అప‌రిమిత‌మైన క‌నెక్ట‌విటీ, స్పీడ్‌, ఎక్క‌డికి వెళ్లినా..ఏ అడ‌విలో సంచ‌రించినా అక్క‌డికి రిల‌య‌న్స్ జియో ద‌ర్శ‌న‌మిస్తుంది. అంత‌గా పాపుల‌ర్ అయ్యింది. ఇటీవ‌ల భార‌త్‌లో..ఏసియా ఖండంలో ఈ కంపెనీ సృష్టించిన సునామీ దెబ్బ‌కు మిగతా కంపెనీలు త‌ల్ల‌డిల్లి పోయాయి. త‌క్కువ ధ‌ర‌కే డేటా, నెట్ క‌నెక్ష‌న్‌, ఫ్రీ సిమ్‌..4జీ క‌నెక్టివిటీ ..ఎక్క‌డ చూసినా స్మార్ట్ ఫోన్లే. దేశ మంత‌టా జియో స్టోర్లు వెలిశాయి. ప్ర‌తి 100 మంది భార‌తీయుల్లో అత్య‌ధిక శాతం జియో క‌స్ట‌మ‌ర్లే.

పాత ఫోన్లు ఏ కంపెనీ అయినా స‌రే..ఎప్పుడు కొనుగోలు చేసినా స‌రే..మా కివ్వండి..కొత్త ఫోన్లు తీసుకు వెళ్లండి అంటూ ఇచ్చిన జియో ప్ర‌క‌ట‌న‌కు కోట్లాది మంది స్పందించారు. ఒకే రోజు నాలుగు కోట్ల‌కు పైగా జియోతో క‌నెక్ట్ అయ్యీరు. మొద‌ట్లో అనిల్ అంబానీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను చూసి మిగ‌తా టెలికాం కంపెనీలు కొట్టి పారేశాయి. జియో ఎప్పుడైతే ఇండియాలో రిలీజ్ అయ్యిందో ఆ రోజు నుండి టెలికాం దిగ్గ‌జాలు బీఎస్ ఎన్ ఎల్‌, ఎయిర్ టెల్‌, టెలినార్‌, ఐడియా, వొడా ఫోన్ కంపెనీలు దివాలా తీసే ప‌రిస్థితికి వ‌చ్చాయి. ఆయా కంపెనీల క‌స్ట‌మ‌ర్లు అంద‌రూ ఇపుడు జియో వైపు మొగ్గారు.

ఇంట‌ర్నెట్‌లో క‌నెక్టివిటీ విష‌యంలో జియో ఇపుడు అత్యంత న‌మ్మ‌క‌మైన టెలికాం కంపెనీగా అవ‌త‌రించింది. రిల‌య‌న్స్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌త్య‌ర్థి టెలికాం కంపెనీలు క‌లిసి ఒకే సంస్థ‌గా అవ‌త‌రించాల‌ని నిర్ణ‌యించ‌డం వారి ప‌త‌నాన్ని సూచిస్తోంది. ఎన్ని కంపెనీలు ఏక‌మైనా స‌రే ..సింహం సింగిల్‌గా వ‌స్తుంద‌న్న‌ట్టు ఇపుడు జియో..రిల‌య‌న్స్ కొట్టిన దెబ్బ‌కు ప్రైవేట్ కంపెనీలు అబ్బా అంటున్నాయి.

No comments