టాలీవుడ్ లో రెచ్చెస్ట్ శ్రీమంతులు వీరే.!! మనోళ్లు శ్రీమంతులు కోట్లకు అధిపతులు.!!
ప్రపంచ వ్యాప్తంగా ఫోర్ట్స్ సంస్థ ప్రకటించే ఏ వార్తయినా అదో సంచలనమే. ప్రతి ఏటా ప్రతిభావంతులు, వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం మామూలే. అత్యంత ధనవంతుల జాబితాను వెల్లడించింది. అందులో మన తెలుగు వాళ్లు ఉండడం చరిత్రే. వరల్డ్ వైడ్ గా ప్రకటించిన 100 మందిలో 11 మంది మన వారికి చోటు దక్కడం విశేషం. మళ్లీ బాలీవుడ్ బాద్ షా సల్మాన్‌ఖాన్ నెంబర్ 1 స్థానాన్ని తిరిగి దక్కించుకుని రికార్డు తిరగ రాశారు. బాలీవుడ్, టాలివుడ్ స్టార్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన విజయ దేవరకొండకు స్థానం దక్కడం సినీ, మార్కెట్ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి లోను చేసింది.
మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్‌తో సమానంగా దేవరకొండ ఉండడం ఇక్కడ స్పెషల్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టార్‌గా పి.వి.సింధుకు స్థానం దక్కింది. ఇండియాలో మోస్ట్ రిచెస్ట్ ఎర్నింగ్ సెలబ్రెటీలను ప్రతి సంవత్సరం ఫోర్ట్ష్ ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది. సల్మాన్ మూడోసారి తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తున్నారు. 253 కోట్ల సంపాదనతో విస్తుపోయేలా చేశారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 228.09 కోట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి రెండింతలు ఎక్కువ కొల్లగొట్టారు. అక్షయ్ కుమార్ 185 కోట్లతో మూడో స్థానంలో ఉండగా..మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి దీపికా పదుకొనె నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు.
బాలీవుడ్ నుండి హాలీవుడ్ రంగానికి వెళ్లిన ప్రియాంక చోప్రా ఆదాయం గణనీయంగా తగ్గడం ఆశ్చర్యానికి గురి చేసింది. 2017లో ఆమె 68 కోట్లను సంపాదిస్తే..ఈసారి కేవలం 18 కోట్లు గడించారు. బాలీవుడ్ బాద్ షాగా పేరున్న షారూఖ్ ఖాన్ గత సంవత్సరం రెండో స్థానంలో ఉండగా ..ప్రస్తుతం 56 కోట్ల సంపాదనతో 13వ స్థానానికి దిగజారారు. అమీర్‌ఖాన్ 97.5 కోట్లతో ఆరో స్థానంలో, బిగ్ బి అమితాబ్ బచ్చన్ 96.17 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. తెలుగు వారి విషయానికి వస్తే..కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. సింధు 36 కోట్లతో టాప్ 25లో ఉన్నారు. ఉమెన్స్ ఎర్నింగ్ లో ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ 31.33 కోట్లతో టాప్ 25లో ఉండగా, మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ 28 కోట్లతో, మహేష్‌బాబు, నాగార్జున, కొరటాల శివ, సైనా నెహ్వాల్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండలు ఉండడం విశేషం.
ప్రిన్స్ 24 కోట్లతో ఉన్నారు. రామ్ చరణ్ , విజయ దేవరకొండలు చెరో 18 కోట్లతో సమానంగా ఉన్నారు. మొత్తం వంద మంది ధనవంతుల సంపాదన 3 వేల 140 కోట్లుగా ఫోర్ట్స్ ప్రకటించింది. ఇది కూడా ఓ రికార్డుగానే భావించాల్సి ఉంటుంది. సినీ నటులు, ఆటగాళ్లు తాము సంపాదించిన కోట్లల్లోంచి కొంత మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేస్తే ఎంతో మందికి సేవ చేసిన వారవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Post a Comment