Header Ads

మోజో టీవీ యాంకర్ మీద విరుచుకుపడిన బండ్ల గణేష్.. కారణం ఏమిటో తెలుసా.?

గడిచిన వారం నుండి బండ్ల హంగామా అంత ఇంత కాదు సోషల్ మీడియా లో, ఆలా అని ఆయన ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఈ వారం లో, కానీ కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రాకపోతే పీక కోసుకుంటా అని చెప్పాడు బండ్ల గణేష్.




తెలంగాణ ఎన్నికలో ఎన్నీయల్లో :

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు బండ్ల గణేష్ ను అంటుకున్నారు, కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి బ్లేడ్ తో ఎప్పుడు కోసుకుంటావ్ అన్నా అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ ఇంటికి వెళ్ళాడు మోజో యాంకర్, ఓడిపోతే 7'0 క్లోక్ బ్లేడ్ తీసుకురమ్మన్నారు, గెలిస్తే పుల్ల రెడ్డి స్వీట్స్ తీసుకురమ్మన్నారు, రెండు తెచ్చాను, కానీ ఆయన బయటికి రావట్లేదు అని వ్యంగ్యంగా మాట్లాడారు.

అగ్న్యాతం వీడిన బండ్ల గణేష్ :

తిరుమల శ్రీ వారి దర్శనార్థం బండ్ల గణేష్ అగ్న్యాతం వీడి బయటకు వచ్చాడు, దర్శనం అయిపోయాక మీడియా మిత్రులతో బండ్ల గణేష్ మాట్లాడుతూ : "కోపం లో ఎన్నో అంటాము, అవన్నీ పట్టించుకుంటామా.? నేను అగ్న్యాతం లోకి వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తో బాధ వేసి బయటికి రాలేకపోయా. ప్రజలు తెరాస పక్షాన నిలిచినందుకు బాధ వేసింది, కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి అలా గొంతుకోసుకుంటా అని చెప్పా, కానీ మీ మోజో యాంకర్ ఉన్నాడే అసలు. ఇప్పుడు గుడిలో అతని గురుంచి వద్దు లే" అంటూ వెళ్ళిపోయాడు బండ్ల గణేష్.

ఇది వరకే ట్రంప్ తో ఫోటో అని చివరికి అదేం లేదండి, ఏదో ఊరికే అనిన మాట అని కవరింగ్ చేసాడు చాలా రోజుల తరువాత, ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఫార్ములా యూస్ చేసాడు బండ్ల, ఇకపైన ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు కాదు కదా, అయన పార్టీ వర్గాలు, సినిమా మిత్రులు కూడా నమ్మరేమో. రానున్న రోజుల్లో బండ్ల గణేష్ తిరిగి కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడని సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



No comments