అతను ఓ కస్టమ్స్ ఇన్స్పెక్టర్. పేద విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాడు తెలుసా..?
కృతజ్ఞతా భావం అంటే నిజంగా సహాయం చేసిన వారికి కృతజ్ఞతగా ఉండడం కాదు. వారు చేసిన సహాయానికి సరైన సార్థకత కలిగేలా చేయడం. అంటే సహాయం పొందిన వారు బాగుపడిన పక్షంలో తమలాగే సహాయం అవసరం ఉన్న వారికి చేయూతనందించడం. అవును, మీరు విన్నది కరెక్టే. ఇదే సూత్రాన్ని సరిగ్గా వంటబట్టించుకున్నాడు కాబట్టే అతను విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే తాను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎంతో మందిచే సహాయం పొందాడు కాబట్టి. అందుకనే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. తనలాగే ఆర్థికంగా లేని వారి విద్యాభివృద్ధికి అతను కృషి చేస్తున్నాడు.
అతని పేరు ఆకాష్ త్రిపాఠి. అతని తండ్రి పేరు జై శంకర్ త్రిపాఠి. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లా ఆన్హి ప్రాంతంలో వీరు ఉండేవారు. అయితే జై శంకర్‌కు నలుగురు పిల్లలు. వారిలో ఆకాష్ త్రిపాఠి ఒకరు. కాగా వీరిది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడేది కాదు. దీంతో జై శంకర్ కుటుంబ సభ్యులతో సహా కోల్‌కతాలోని నాతూన్ బజార్‌కు మకాం మార్చాడు. అక్కడే ఓ షాప్ పెట్టాడు. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే అతను కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే ఆకాష్ కూడా తండ్రి కష్టాన్ని వృథా పోనివ్వలేదు. చాలా కష్టపడి చదివేవాడు. అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతి తరగతిలో ఫస్ట్ వచ్చాడు. అయితే పాఠశాల దశలో ఉన్నప్పుడు ఒక్కోసారి స్కూల్ ఫీజు కట్టేందుకు, పరీక్ష ఫీజుకు, పుస్తకాలకు డబ్బులు ఉండేవి కావు. దీంతో ఆకాష్ స్నేహితులు సహాయం చేసేవారు. అయితే ఇది ఆకాష్ తరువాత తరగతుల్లో ఉన్నప్పుడు కూడా కొనసాగింది.
కాలేజీ దశలోనూ ఫీజుకు, పుస్తకాలకు డబ్బులు ఉండేవి కావు. దీంతో ఆకాష్ స్నేహితులు, ఉపాధ్యాయులు సహాయం చేసేవారు. దీంతో ఆకాష్ కష్టపడి చదివి పీజీ చేశాడు. అదే సమయంలో ఓ వైపు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ, మరో వైపు రూం దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. స్నేహితుల సూచన మేరకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయగా, వాటిలోనూ ఆకాష్ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఆకాష్‌కు డీఆర్డీవోలో భువనేశ్వర్‌లో పోస్ట్ వచ్చింది. అయితే అక్కడికి మకాం మార్చినప్పటికీ ఆఫీస్‌లో క్లర్క్‌లు, ప్యూన్లు, అటెండర్లు, ఇంటి చుట్టు పక్క ఉండే పేద విద్యార్థులకు ఉచితంగా రోజూ చదువు చెప్పేవాడు. ఇక కోల్‌కతాకు అప్పుడప్పుడు వచ్చి అవసరం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చేవాడు. వాటిలో ఐఏఎస్ కోసం కూడా విద్యార్థులు ఆకాష్ వద్దకు వచ్చేవారు. అయితే ఆకాష్‌కు 2016లో కోల్‌కతాలో సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. దీంతో ఆకాష్ తిరిగి కోల్‌కతాకు వచ్చాడు. అయినప్పటికీ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం, ట్యూషన్లు చెప్పడం మానలేదు. ఆకాష్ ప్రస్తుతం ఏడాదికి 6 బ్యాచ్‌లకు కోచింగ్ ఇస్తాడు. ఒక్కో బ్యాచ్‌లో 150 మంది వరకు విద్యార్థులు ఉంటారు. వారికి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఎంట్రన్స్‌ల కోసం శిక్షణ ఇస్తున్నాడు. ఏది ఏమైనా ఒకప్పుడు తను చదువుకోవడం కోసం అనుభవించిన కష్టాలు మరొకరు పడకూడదని ఆకాష్ చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం కదా..!

Post a Comment