Header Ads

గులాబీ బాస్ మెచ్చుకున్న గులాటి - ఫేమ‌స్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎకాన‌మిస్ట్

కేసీఆర్‌..గులాబీ బాస్‌..వ్య‌వ‌సాయ‌దారుడు..క‌వి..ర‌చ‌యిత‌..గాయ‌కుడు..మాట‌ల మాంత్రికుడు. వ‌క్త‌..మెంటార్. అన‌లిస్ట్‌.మేధావి. విజ‌న్ వున్న నాయ‌కుడు..పొలిటిక‌ల్ లీడ‌ర్‌. ఇంకా అనేకం ఉన్నాయి..తెలంగాణ అంటేనే కేసీఆర్‌..కేసీఆర్ అంటేనే తెలంగాణ‌. ఒక బ్రాండ్‌ను..ఒక ఇమేజ్‌ను తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఆయ‌న‌దే. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఈ నాయ‌కుడిదే. కాద‌న‌లేని న‌గ్న స‌త్యం.మ‌న ముందున్న వాస్త‌వం. విజ‌యోత్స‌వం అనంత‌రం జ‌రిగిన ప్రెస్ మీట్‌లో..కేసీఆర్ మెచ్చుకున్న వ్య‌క్తి అశోక్ గులాటి. ఇత‌ను ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..మోస్ట్ ఫేవ‌ర‌బుల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎకాన‌మిస్ట్‌. అద్భుత‌మైన ర‌చ‌యిత‌. వివిధ అంశాల‌పై ఎంతో ప‌రిజ్ఞానం క‌లిగిన కేసీఆర్‌ను ఎంత‌గానో ప్ర‌భావితం చేశారు గులాటి.
వ్య‌వ‌సాయం దండుగ ఎంత మాత్రం కాద‌ని..వాడుకుంటే అద్భుత‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టు కోవ‌చ్చ‌ని ఆయ‌న ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా స్ప‌ష్టం చేశారు. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. కానీ మ‌నం 30000 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. ఈ విష‌యాన్ని కేసీఆరే స్వ‌యంగా చెప్పారు. ఇంకా 40000 వేల టీంఎసీల నీళ్లు వృధా అవుతున్నాయి. వాటిని స‌ద్వినియోగం చేసుకోగ‌లిగితే ఈ దేశంలో 70 శాతానికి పైగా వ్య‌వ‌సాయం సాగ‌వుతుంది. ల‌క్ష‌లాది మంది రైతులు ఆక‌లి చావుల నుండి..ఆత్మ‌హ‌త్య‌ల నుండి విముక్తం అవుతారు. ఇదంతా గులాటీ చెప్పిందే. అంత‌గా ఆయ‌న ఈ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను..వ్య‌వ‌సాయం రంగం ఎలా కుదేలైందో..ముందే హెచ్చ‌రించారు.

అశోక్ గులాటీ 1954 మే 11న జ‌న్మించారు. క‌మిష‌న్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌రల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్‌కు ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌రించారు. ఫుడ్ స‌ప్ల‌యిస్, ప్రైసింగ్ పాల‌సీస్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుగా ఉన్నారు. ఫుడ్ గ్రెయిన్స్ విష‌యంలో ధ‌ర‌లు పెంచాల‌ని గులాటీ ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఇన్ఫోసెస్ చెయిర్ ప్రొఫెస‌ర్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ తో పాటు ఐసీఆర్ైఇఆర్ కు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. నీతి ఆయోగ్‌లో స‌భ్యుడిగా ఉన్నారు. 2015లో అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ రిఫార్మ్ష్ ఎక్స్‌ప‌ర్ట్ గ్రూపులో మెంబ‌ర్‌గా ఉన్నారు గులాటి. ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాకు ఎన్డీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో బాధ్య‌త‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు ధ‌ర‌లు నిర్ణ‌యించ‌డం..రైతుల‌కు మేలు చేకూర్చేలా ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు అశోక్ గులాటి. కేంద్ర స‌ర్కార్‌కు ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా ఎన్నో మేలైన సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు ఆయ‌న‌. 23 వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర కల్పించేలా ..చ‌ర్య‌లు తీసుకునేలా గులాటి చేసిన సేవ‌లు మ‌రిచి పోలేం. అంత‌గా ఆయ‌న వ్య‌వ‌సాయ రంగంతో మ‌మేక‌మ‌య్యారు.

సీఏసీపీకి ఒక ఆయువుప‌ట్టుగా మారారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుడ్ పాల‌సీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల‌లో వ్య‌వ‌సాయ రంగాల‌ను ఆయ‌న కూలంకుశంగా పరిశోధించారు. ఏ పంట‌కు ఎంత ధ‌ర ఇవ్వాలి. ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌కు గులాటి 10 సంవ‌త్స‌రాల పాటు సేవ‌లందించారు. జ‌న‌వ‌రి 2001 నుండి ఫిబ్ర‌వ‌రి 2010 దాకా ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ప‌ర్య‌టించారు. ఆయా కాలాల‌లో వ్య‌వ‌సాయ రంగం ఎలా కుదేల‌వుతుందో..దానిని ఎలా సాగులోకి తీసుకు రావ‌చ్చో ..విలువైన సూచ‌న‌లు చేశారు. ఆర్థిక వృద్ధి కోసం నాబార్డ్‌లో చైర్ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు. నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ అప్ల‌యిడ్ ఎకనామిక్ రీసెర్చ్ కు 1997 వ‌ర‌కు చీఫ్ ఎక‌నామిస్ట్ గా ప‌నిచేశారు. అక‌డెమిక్ ప‌రంగా..ఆర్థిక‌వేత్త‌గా ..వ్య‌వ‌సాయ రంగ నిపుణుడిగా అశోక్ గులాటి చేసిన సేవ‌లు అద్భుతం. భార‌తీయ వ్య‌వ‌సాయ రంగం ఏ ర‌క‌మైన స‌వాళ్ల‌ను..స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుందో ..దాని నివారించి ఎలా అధిగ‌మించ వ‌చ్చో 13 పుస్త‌కాలు రాశారు. ద డ్రాగ‌న్ అండ్ ద ఎలిఫెంట్ పుస్తకం వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాపుల‌ర్ పుస్త‌కంగా నిలిచింది. లండ‌న్‌లోని ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్శిటీ ప్రెస్ ప్ర‌చురించింది . ఈ పుస్త‌కం చైనా భాష‌లోకి అనువ‌దించ‌బ‌డింది. జాతీయ‌, అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్స్‌లో వేలాది వ్యాసాలు రాశారు.

అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అశోక్ గులాటి వ్య‌వ‌సాయ ప‌రంగా స‌ల‌హాదారుగా ఉన్నారు. ఏపీ సీఎంకు కూడా స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రించారు. క‌ర్ణాట‌క స్టేట్ ప్లానింగ్ బోర్డు మెంబ‌ర్‌గా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంకింగ్ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. వ్య‌వ‌సాయ‌, ఆర్థిక రంగాల‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు, రైతుల‌కు మేలు చేకూర్చేలా పాల‌సీలు తీసుకు రావ‌డంలో ఎన‌లేని సేవ‌లు అందించిన గులాటీని కేంద్ర ప్ర‌భుత్వం 2015లో ప‌ద్మ‌శ్రీ అవార్డుతో ఘ‌నంగా స‌త్క‌రించింది. ఎంత సేపు పాల‌కుల‌ను తిడుతూ కూర్చుంటే ఏం లాభం. అపార‌మైన వ‌న‌రులు, అవ‌కాశాలు ఈ దేశంలో ఉన్నాయి. ఆర్థిక ప‌రంగా వ్య‌వ‌సాయ రంగం లాభసాటి రంగం. కానీ సాగు కావాలంటే నీళ్లు కావాలి. వాటిని వాడుకునే సౌలభ్యం ఉన్న‌ప్ప‌టికీ వినియోగించు కోవ‌డంలో నిర్ల‌క్ష్యం చేస్తున్నాం. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర లేకుంటే పండించిన పంట‌కు గిట్టుబాటు కాదు.

40 వేల టీఎంసీలకు పైగా నీళ్లు వృధాగా వెళుతోంది..దీనిలో స‌గాన్ని వాడుకున్నా ఈ దేశం వ్య‌వ‌సాయ ప‌రంగా గ‌ట్టెక్కుతుంది. ప్ర‌పంచంలోనే త‌న వాటాను మ‌రింత ద‌క్కించుకుంటుంది. ఏదైనా చిత్త‌శుద్ధి కావాలి. అది పాల‌సీల‌ను త‌యారు చేసే ఆర్థిక‌వేత్త‌లు, అనుభ‌వ‌జ్ఞులు, అధికారుల‌పైనే ఉందంటారు గులాటీ. అవును..వ్యవ‌సాయం ఈ దేశ‌పు సంస్కృతిలో ఓ భాగం..అది కోట్లాది మందికి అన్నం పెడుతుంది..ల‌క్ష‌లాది మంది రైతుల‌కు ఆదెరువుగా మారింది. ఈ రంగం దండుగ కాదు ఓ పండుగ‌..అంటున్న ఈ వ్య‌వ‌సాయ ఆర్థిక వేత్త‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల్సిందే..!

No comments