Header Ads

రేవంత్ రెడ్డి పైన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కేసు లు నమోదు చేసిన పోలీస్ లు.! రేవంత్ రెడ్డి గారిభార్య మాట్లాడుతూ..

రేవంత్ రెడ్డి ని బలవంతంగా పోలీస్ లు ఈడ్చుకుపోయారు అని రేవంత్ రెడ్డి గారి భార్య తెలిపారు, రేవంత్ రెడ్డి సోదరులను కూడా అరెస్ట్ చేసారు, రేవంత్ రెడ్డి మీద కావాలనే కుట్ర జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన ఐపీసీ సెక్షన్లు 341,188,506,511 కింద కేసులు నమోదు చేసారు పోలీస్ లు,




రేవంత్ రెడ్డి గారి భార్య పోలీస్ లను మీడియా ముఖంగా ప్రశ్నించారు:

"మీ పోలీస్ లు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరన్నా కానియ్యండి, ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ ఉంది అండి, తలుపులు బద్దలు కొట్టి దూకి పారిపోతారా అండి? చుట్టూ పోలీస్ లు ఉన్నారు, మీరు హౌస్ అరెస్ట్ చేయొచ్చు, ఆయన బయటికి పారిపోనికి చూస్తే హౌస్ అరెస్ట్ చేయొచ్చు, కానీ బాధతోనూ ఉన్న మనిషిని తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకొని వెళ్లారు మీరు పొద్దున్న 3 గంటలకు, ఇది ఏమైనా న్యాయమా", అని రేవంత్ రెడ్డి గారి భార్య మీడియా ఎదురుంగా ఉన్న పోలీస్ లను ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి గారి భార్య మీడియా తో మాట్లాడుతూ:

"నేను కార్యకర్తలకు మళ్లీమళ్లీ చెబుతున్నాం, ఎవరి గ్రామాలకు వారు వెళ్లి పోయి, వాళ్ళ ప్రచార కార్యక్రమాలు వారు నిర్ణయించుకోవాలి. మేము RO గారికి కంప్లైంట్ ఇస్తాము, కెసిఆర్ గారికి ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేసుకొనే హక్కు ఎలా ఉందొ, కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థి గా లక్షల మంది అభిమానాలు ఉన్న ఒక నాయకుడిగా, ఎంతో మంది మనసు గెలుచుకున్న నాయకుడిగా, రేవంత్ రెడ్డి కి కూడా తన నియోగజ వర్గం లో ప్రచార సమయం పూర్తి అయ్యే సమయం లోపు ప్రచారం చేసుకొనే హక్కు ఉంది,ఆ హక్కు ఆయనకు ఇచ్చి ఆయన్ని రిలీజ్ చేసి ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలని ఎస్పీ గారికి ఎన్నికల అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మేము కంప్లీట్ గా పోలీస్ లకి ఎలక్షన్ కమిషన్ కి, అందరికి సహకరిస్తాం, కార్యకర్తలకి కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి గారి భార్య మీడియా ముందు తెలిపారు.

No comments