Header Ads

విధుశేఖ‌రా విజ‌యోస్తు - విధుశేఖర భారతి మీద ప్రత్యక కధనం

ఆధ్యాత్మిక భావ జ‌ల‌ధార సజీవమై ప్ర‌వ‌హిస్తూనే ఉన్న‌ది. గుండె గుండెలో స‌మున్న‌త భారతమంతా ..విశ్వ‌వ్యాపిత‌మై సంచ‌రిస్తోంది. ఎంద‌రో యోగులు, రుషులు, ఆధ్యాత్మిక‌వేత్త‌లు, పీఠాధిప‌తులు, బాబాలు త‌మ త‌మ ప‌రిధిలో భ‌క్తిత‌త్వాన్ని ప్ర‌జ‌ల్లో పెంపొందించేందుకు కృషి చేశారు. ఆశ్ర‌మాలు , పీఠాలు , ఆల‌యాల ద్వారా మ‌నుషుల్లో ప‌రివ‌ర్త‌న తీసుకు వ‌చ్చేలా చేస్తున్నారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో భావ‌న‌. పీఠాధిప‌తులు ఎందరో. ఎవ‌రికి వారే ప్ర‌త్యేకం. నియ‌మ నిష్ట‌ల‌తో..ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితాన్ని గ‌డుపుతూ ఆద‌ర్శంగా..స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు. గ్లోబెల్ గురువులుగా ఇప్ప‌టికే ఇండియాకు పేరు తీసుకు వ‌స్తున్నారు. వారిలో శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్‌, శ్రీ జ‌గ్గీవాసుదేవ‌న్ ఉన్నారు. రాందేవ్ బాబా యోగా గురువుగా..ప‌తంజ‌లికి వార‌సుడిగా పేరు పొందారు.
దైవం ఒక్క‌టే..అంతా స‌మానమే. ప్ర‌తి ప్రాణి బ‌త‌కాలి. తోటి ప్రాణుల‌కు తోడ్పాటు అందించాలి. ఏ ఒక్క‌రు ఎక్కువ కాదు..మ‌రీ త‌క్కువ కాదు. జీవితం స‌జావుగా సాగాలంటే..దాని మ‌ర్మాన్ని అర్థం చేసుకోవాలంటే..మ‌నం ముందు భ‌క్తులం కావాలి. అంతులేని కోర్కెలతో స‌త‌మ‌వుతూ ..విలువైన కాలాన్ని గుర్తించ‌డం లేదు. దానిని విస్మ‌రిస్తున్నాం. ఇంకెక్క‌డ బంధాలు బ‌లంగా వుంటాయి.స‌మాజం విభిన్న వ‌ర్గాల‌, వ‌ర్ణాల స‌మ్మేళ‌నం. వేదాలు , ఉప‌నిష‌త్తులు ఇవ్వ‌న్నీ ధ‌ర్మబ‌ద్దంగా జీవించ‌మ‌ని బోధిస్తున్నాయి. ఆల‌యాలు, ఆశ్ర‌మాలు, మ‌ఠాలు భార‌తీయ ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

అన్ని ప్రాణులు, జీవుల కంటే మాన‌వ జీవితం గొప్ప‌ది. తోటి వారితో స‌ఖ్యంగా ఉండాలి. లోకం పోక‌డ‌ను అర్థం చేసుకునేందుకు భ‌క్తి మార్గం సాధ‌నంగా ఉప‌యోగ ప‌డుతుంది. త‌మిళనాడులోని గోల్డెన్ టెంపుల్‌, శంషాబాద్‌లోని శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి వారి దివ్య సాకేతం ఆశ్ర‌మం, మంత్రాల‌య పీఠంతో పాటు శృంగేరి మఠం కూడా భ‌క్తుల స్వ‌ర్గ‌ధామాలుగా వినుతి కెక్కాయి.ఆశ్ర‌మాలు, మ‌ఠాలు విద్య‌, వైద్యం, భ‌క్తి, ధ్యానంకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నాయి. పీఠాధిప‌తిగా ఉన్న భార‌తీతీర్థ భ‌క్తిత‌త్వాన్ని పెంపొందించేందుకు, విద్యా దానం, అన్న‌దానం చేస్తూ ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయంగా నిలిచారు. వేలాది మంది భ‌క్తులు దేశంలోనే కాక‌..విదేశాల‌లో సైతం ఆయ‌న ప‌ట్ల గురు భ‌క్తిని క‌లిగి ఉన్నారు.

శ్రీ భార‌తీ తీర్థ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న పీఠాధిప‌తిగా, ఆధ్యాత్మిక గురువుగా శ్రీ విధుశేఖ‌ర భార‌తి ప్రాచుర్యం పొందారు. ఎంద‌రో ప్ర‌ముఖులు, పామ‌రులు, భ‌క్తులు ఆయ‌న ప్ర‌వ‌చ‌నాల కోసం వేచి చూడ‌టం అల‌వాటే. మ‌నుషుల్లో భ‌క్తి లేక పోవ‌డం వ‌ల్ల‌నే అనర్థాలు జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు స్వామి వారు. అన‌ర్ఘ‌లంగా ఏ అంశ‌మైనా ప్ర‌సంగిస్తారు. అంత‌టి విద్వ‌త్తు క‌లిగిన గురువుగా వినుతికెక్కారు. 1993లో నాగ‌పంచ‌మి రోజున తిరుప‌తిలో విధుశేఖర భార‌తి జ‌న్మించారు. టీటీడీ వేద విజ్ఞాన పీఠంకు ఆచార్యులుగా ప‌నిచేశారు. వేదాల సారాన్ని అవ‌పోస‌న ప‌ట్టారు.

భ‌క్తుల‌కు అర్థ‌మ‌య్యేలా చిన్న చిన్న ప‌దాలు వాడుతూ ఆక‌ట్టుకుంటారు. అయోధ్య‌, రుషికేష్, హ‌రిద్వార్‌, కాశీ, క‌లాడి, మ‌ధురై, మ‌ధుర‌, రామేశ్వ‌రం, ఉజ్జ‌యిని ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. 2009లో శృంగేరి పీఠాన్ని సంద‌ర్శించారు. అప్ప‌టి నుండి నేటి దాకా శృంగేరీ పీఠం భార‌తీతీర్థ కు ప్రియ‌మైన శిష్యుడిగా..వార‌సుడిగా మారారు విధుశేఖ‌ర భార‌తి. ఇపుడు ఈ పీఠానికి పీఠాధిప‌తిగా ఉన్నారు. భ‌క్తికి ప్రాణం పోస్తూ..భార‌తీయ ఆధ్యాత్మిక ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూ..ప్ర‌యాణం సాగిస్తున్న స‌దాశ‌యం నిరాటంకంగా కొన‌సాగాల‌ని ఆశిద్దాం.

No comments