Header Ads

మ‌న బ్రాండే మ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష

బ్రాండ్ అన్న‌ది సింబ‌ల్ కాదు..స‌క్సెస్‌కు పెట్టింది పేరు. ప్ర‌తి రంగంలో త‌మ‌దైన ముద్ర క‌లిగి వుండ‌డ‌మే ఓ బ్రాండ్‌. ముద్ర గుర్తుందా..అదేదో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ పెట్టిన రుణాల ప‌థ‌క‌మ‌ని ట‌క్కున గుర్తుకు వ‌స్తుంది. కానీ ఆ ముద్ర వేరు. ఇండియాలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన ..మోస్ట్ పాపుల‌ర్ కంపెనీగా వ‌ర‌ల్డ్ యాడ్ మార్కెట్‌లో పేరు పొందింది. ముద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ అండ్ జ‌ర్న‌లిజం కూడా ఒక‌టి. కంపెనీలు, వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు , సెల‌బ్రెటీలు, బిగ్ టైకూన్స్ అన్నీ ..అంద‌రికీ ఓ బ్రాండ్ అంటూ వుంటుంది. భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాల‌ను అందించిన మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కు రిస్టీ బ్యాట్స్‌మెన్‌గా పేరుంది. కేవ‌లం మ‌ణిక‌ట్టుతో ఆడ‌డం ఈయ‌న‌కే చెల్లింది. ఇదీ ఆయ‌న బ్రాండ్‌.
మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ గుర్తున్నాడా..మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ ఇన్ ద వ‌ర‌ల్డ్‌. ప‌రుగుల వీరుడిగా ప్ర‌సిద్ది పొందారు. విరాట్ కొహ్లి ..ఏ ఫార్మాట్‌లోనైనా ప్ర‌త్య‌ర్థుల మీద విరుచుకు ప‌డే ఆట‌గాడిగా గుర్తింపు పొందారు. ఓట‌మి అంచుల్లో గెలుపు మ‌జాను ఆస్వాదించాలంటే కోహ్లీని చూడాలి. పులిలాగా ఉంటాడు. సింహం లాగా విరుచుకు ప‌డ‌తాడు. ఓట‌మిని ఒప్పుకోడు. గెలిచినా సంతోషించ‌డు. కోహ్లి బ్రాండ్ విలువ కోట్ల‌ల్లో ఉంది. టెన్నిస్ స్టార్ అంటేనే ఇండియా వ‌ర‌కు వ‌స్తే..ఒక‌ప్పుడు ప్ర‌కాశ్ ప‌ద్‌కోనె గుర్తుకు వ‌స్తాడు. చెస్ వ‌ర‌కు వ‌స్తే విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌. ఇపుడు ఆట స్వ‌రూపం మారింది. సానియా మీర్జా ఆమెకు త‌న‌కంటూ స్వంత బ్రాండ్ ఉంది. కోట్ల‌ల్లో సంపాదిస్తోంది. ఆమె ఆటే ఆమెకు బ‌లం..ఆమె అందం కూడా సానియాకు ఓ ప్ల‌స్ పాయింట్‌. 1983లో ఇండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిన క‌పిల్‌దేవ్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌, గుండ‌ప్ప విశ్వ‌నాథ్‌, రాహుల్ ద్ర‌విడ్ , ఫుట్‌బాల్‌లో రొనాల్డో, డిగో మార‌డోనా, మెస్సీ లు వుంటే..ఎంట‌ర్‌టైన్ ప‌రంగా చూస్తే రెహ‌మాన్‌, మ‌ణిర‌త్నం, శంక‌ర్‌, సంజ‌య్ లీలా బ‌న్సాలీ, స‌ల్మాన్ ఖాన్‌, అమీర్‌ఖాన్‌, షారుక్ ఖాన్‌, మాధురీ దీక్షిత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, శ్ర‌ద్దా క‌పూర్‌, ఆతిఫ్ అస్లాం, రాహ‌త్ ఫ‌తేహ్ అలీ ఖాన్‌, ఎస్‌పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, త‌దిత‌రులు లెక్క‌లేనంత మంది ఉన్నారు. వీరంద‌రికీ ఒక బ్రాండ్ ఉంది. వారి ప్ర‌తిభే వారికి ఓ ఇమేజ్‌ను ..ఓ బ్రాండ్‌ను క‌లిగి ఉండేలా చేసింది.

రాజ‌కీయ రంగం, సినిమా రంగం, క్రీడా రంగం ఈ మూడు అత్య‌ధిక బ్రాండ్ వాల్యూ క‌లిగి ఉన్నాయి. ఈ రంగాల‌లో ఏ ఒక్క‌రు ఉన్నా..లేక రాణించినా వారికంటూ ఓ బ్రాండ్ ఏర్ప‌డి పోతుంది. నిజ‌మైన వ్య‌క్తిత్వం, ఆహార్యం, తెలివి, జీవిత‌పు స్ట‌యిల్‌..చ‌దువు ,ఉద్యోగం ఇలా ప్ర‌తిదీ ఇందులో ఉంటుంది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స్ట‌యిల్ ఓ బ్రాండ్, యంగ్ హీరో విశాల్ రెడ్డి కూడా ఓ బ్రాండ్ ఉంది. మ‌హేష్‌బాబుకు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. మాధురీ దీక్షిత్‌, మిథాలీ రాజ్ కూడా బ్రాండ్ క‌లిగి ఉన్నారు. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ విష‌యానికి వ‌స్తే..దివంగ‌త ప్ర‌ధానుల్లో విశిష్ట‌మైన వ్య‌క్తులుగా పేరు పొందారు..వారిలో మొరార్జీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, ఇందిర‌, నెహ్రూ, రాజీవ్‌, పీవీ, వాజ్ పేయి, న‌రేంద్ర మోడీ వీళ్లంద‌రికీ ఓ బ్రాండ్ ఉంది. వాజ్‌పేయి క‌విత్వంతో ఆక‌ట్టుకునే వారు. ఆయ‌న షాయ‌రీలు ఎక్కువ‌గా చ‌దివేవారు.

క‌రుణానిధి, ఎంజేఆర్‌, జ‌య‌ల‌లిత‌, ఎన్టీఆర్ మేన‌రిజం, వైఎస్ఆర్ ప‌ల‌క‌రింపు, పంచ‌క‌ట్టు ఓ బ్రాండ్‌. రిల‌య‌న్స్‌, ఎయిర్‌టెల్‌, శాంసంగ్‌, రెడ్ మీ, గూగుల్‌, ఫేస్ బుక్‌, వాట్స్ అప్‌, పొలారిస్‌, ఒరాకిల్‌, ముద్ర‌, స్టే ఫ్రీ, విప్రో, ఫిలిప్స్‌, మోటోరోలా, ఎల్ అండ్ టీ, మెట్రో, జీఎంఆర్ ..ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అపోలో, ఎంఆర్ ఎఫ్ టైర్లు, మారుతీ, టాటా, హ్యూందాయి, ఫోర్డ్ కంపెనీలు త‌మ బ్రాండ్‌తో కోట్లు గ‌డిస్తున్నాయి. ఓన్లీ విమ‌ల్ రిల‌య‌న్స్‌కు విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చి పెట్టాయి. ఆట ఆడే స‌మ‌యంలో త్రిబుల్ సెంచ‌రీ త‌ర్వాత మైదానాన్ని ముద్దాడిన బ్ర‌యాన్ లారా విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయ‌న న‌డ‌కే ఆయ‌న‌కు బ్రాండ్ తెచ్చి పెట్టింది. స‌క్సెస్ సాధించ‌డం..ఎవ్వ‌రూ అందుకోలేని విజ‌యాల‌ను న‌మోదు చేసుకోవ‌డం కూడా బ్రాండ్‌ను తెచ్చి పెడుతుంది.

సో..మ‌న‌కంటూ ఓ బ్రాండ్ కావాలంటే ఏం చేయాలి. ఒక‌రిని అనుస‌రిస్తే మీకంటూ వ్య‌క్తిత్వం లేని వారుగా ఉండిపోతారు. మీదైన వ్య‌క్తిత్వం..మీదైన జీవితం మీకే స్వంతం. మీ మాట‌..మీ చూపు..మీ న‌డ‌క‌..న‌డ‌త‌..మీ వ్య‌క్తిత్వం..మీ ఆహార్యం..మీ ప్ర‌వ‌ర్త‌న‌..మీ చ‌దువు..ఇవ్వ‌న్నీ క‌లిస్తే మీ..బ్రాండ్‌. చెప్పే మాట‌కు చేసే ప‌నుల‌కు పొంత‌న ఉండాలి. లేక‌పోతే మాట మీద నిల‌బ‌డ‌ని వ్య‌క్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఇది మీ వ్య‌క్తిత్వాన్ని దెబ్బ తీస్తుంది.

ఆస్తులు, అంత‌స్తులు, వాహ‌నాలు, ప‌ద‌వులు ఇవేవీ కావు బ్రాండ్ అంటే. మీదైన జీవితం..మీదైన వ్య‌క్తిత్వం..మీదైన విజ‌యం ..ఇదే మీ బ్రాండ్‌. సో ..మీకు మీరుగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయండి. ఎదుటి వారిని గుడ్డిగా అనుక‌రించ‌కండి..మీకేమీ లేక పోయినా స‌రే మీరు మీరుగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయండి..అదే మీకు ప‌ది వేలు..అదే మీ బ్రాండ్‌..మ‌హాత్ముడి ద‌గ్గ‌ర ఏమీ లేదు. ఒక్క అహింస అనే ఆయుధం త‌ప్ప‌. ఆయ‌న క‌ట్టు, ఆయ‌న న‌డ‌క‌..ఆయ‌న మాటే ఓ బ్రాండ్‌. రాంగోపాల్ వ‌ర్మ ను చూశారా..కొత్త ద‌నం..ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటారు. అదే ఆయ‌న బ్రాండ్‌. ప్రిన్స్ విష‌యంలో కూడా అంతే. గూగుల్ సీఇఓ సుంద‌ర్ పిచ్చెయ్‌, అబ్ర‌హం లింక‌న్‌, చేగువేరా, హ్యూగో చావెజ్‌..ఇలా వాళ్ల కంటూ ఓ బ్రాండ్ ఉంది.

No comments