టీ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
చల్లని వాతావరణంలో వేడి వేడి చాయ్ తాగితే ఎంతో మజాగా ఉంటుంది కదా. దాంతో మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. శరీరానికి ఉత్తేజం, ఆహ్లాదం లభిస్తుంది. ఇక మధ్యాహ్నం పూట పకోడి, సమోసా, బిస్కెట్ లాంటి స్నాక్స్‌తో చాయ్ తాగితే ఆ మజాయే వేరు. అయితే టీ తాగడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగే మాట నిజమే అయినా, అది రోజూ కోటా మించకూడదు. ఒకటి, రెండు కప్పుల టీ అయితే ఓకే. కానీ అంతకు మించి అదే పనిగా రోజులో ఎక్కువ సార్లు టీ తాగితే వచ్చే అనర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్రలేమి
చాలా మంది రాత్రి పూట పనిచేసే వారు లేదంటే మధ్యాహ్నం పూట కూడా కొందరు నిద్ర వస్తుందని చెప్పి దాన్ని పోగొట్టుకునేందుకు టీ తాగుతారు కదా. అది నిజమే. టీ వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు టీ తాగితే మాత్రం మీరు నిద్రపోదామని పడుకున్నప్పుడు కూడా నిద్ర రాదు. నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక ఎక్కువ సార్లు టీ తాగకుండా ఉండడమే బెటర్.
2. మలబద్దకం
టీ ఎక్కువగా తాగితే అందులో ఉండే థియోఫిలైన్ అనే ఓ కెమికల్ జీర్ణాశయంపై ప్రభావం చూపుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్దకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
3. ఆందోళన
టీ ఎక్కువగా తాగితే మానసిక ప్రశాంతత దెబ్బ తింటుంది. ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఎల్లప్పుడూ కంగారుగా ఉంటారు. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
4. గర్భిణీలు
గర్భంతో ఉన్న మహిళలు టీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే అందులో ఉండే కెఫీన్ పిండం ఎదుగుదలకు ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంటుంది.
5. ప్రోస్టేట్ క్యాన్సర్
టీ ఎక్కువగా తాగే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
6. గుండె సమస్యలు
టీలో ఉండే కెఫీన్ వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తాయి. రోజులో ఎక్కువ సార్లు టీ తాగితే దాని వల్ల కెఫీన్ ఒంట్లో పెరిగిపోతుంది. ఫలితంగా అది గుండె సమస్యలకు దారి తీస్తుంది.

Post a Comment