Header Ads

కూతుర్ని గొప్ప చ‌దువులు చ‌దివించాల‌ని పుస్త‌కాలు అమ్ముకుంటున్న ఓ త‌ల్లి. రియ‌ల్ స్టోరీ..!

''స‌మాజంలోని ప్ర‌తి వ్య‌క్తికి విద్య అనేది అత్యంత ఆవ‌శ్య‌కం. కానీ నాకు ఆ భాగ్యం ద‌క్క‌లేదు. ఎందుకంటే మాది చాలా నిరుపేద కుటుంబం. దీంతో నాకు చ‌దువుకునేందుకు స్థోమ‌త క‌ల‌గ‌లేదు. రెక్కాడితే కానీ డొక్కాడ‌దు. అలాంటి స్థితిలో కుటుంబం ఉంటే ఇంక నా చ‌దువు ఎలా సాగుతుంది. ఎన్ని రోజులు గ‌డిచినా మా కుటుంబ ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఉండేది నేను, నా కూతురు ఇద్ద‌రమే. అయినా పూట గ‌డ‌వ‌డం చాలా క‌ష్టంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితిలోనూ నాకు ఒక్క‌టే ల‌క్ష్యం. నా కూతుర్ని బాగా చ‌దివించాల‌ని.




నా కూతుర్ని బాగా చ‌దివిస్తే అది నాలాంటి ఎంతో మందికి ప్రేర‌ణ అవుతుంద‌ని, వారికి దారి చూపుతుంద‌ని ఏదో ఒక చిన్న ఆశ నాలో. దాని దిశ‌గానే సాగుతున్నా. అన్న‌ట్టు నా పేరు చెప్ప‌లేదు క‌దూ. నా పేరు ల‌క్ష్మి. మంగ‌ళూరులో ఉంటున్నా. రాను రాను మా కుటుంబ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. రోజు గ‌డ‌వ‌డం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే నేను ఎట్టి పరిస్థితిలోనూ బిచ్చ‌మెత్తుకోవ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్నా. ఎంత క‌ష్ట‌మైనా స‌రే శ్ర‌మ చేసి దాని ద్వారా వ‌చ్చిన డ‌బ్బుతోనే జీవించాల‌నుకున్నా.

అందులో భాగంగానే రోడ్ల వెంట పుస్త‌కాలు అమ్మ‌డం ప్రారంభించా. ఎప్ప‌టికైనా నా కూతురు కూడా ఇలాంటి పెద్ద పుస్త‌కాలు చ‌దివి ఉన్న‌త విద్యాభ్యాసం పూర్తి చేయాల‌ని నా కోరిక‌. అందులో భాగంగానే పుస్త‌కాలు అమ్మ‌డం మొద‌లు పెట్టా. అయితే ప్ర‌స్తుతం నా కూతురుకి ఇంకా నాలుగేళ్లే. స్కూల్‌లో జాయిన్ చేసేందుకు కొంత స‌మ‌యం ఉంది. అలా అని చెప్పి ఇంటి ద‌గ్గ‌ర ఒక్క‌దాన్నే ఉంచ‌లేను. అందుక‌నే నాతో తీసుకెళ్తున్నా. కానీ ఎప్ప‌టికైనా నా కూతురుకి మంచి స్కూల్‌లో చ‌దువు చెప్పిస్తాననే న‌మ్మ‌కం ఉంది. ఆ చ‌దువుతోనైనా మా బ‌తుకులు బాగుప‌డితే అంతే చాలు..!''

మంగ‌ళూరులో రోడ్ల‌పై పుస్త‌కాలు అమ్ముకునే లక్ష్మి అనే మ‌హిళ య‌దార్థ గాథ ఇది. రియ‌ల్ స్టోరీ..!

No comments