ఆ అమెరికా మహిళ మన దేశంలో వాడి పడేసిన పువ్వులతో సేంద్రీయ ఎరువులను తయారు చేస్తోంది, తెలుసా..?
మన దేశంలో పువ్వుల వినియోగం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆలయాల్లో వీటి వాడకం ఎక్కువ. భక్తులు చాలా మంది పువ్వులను కొని దైవానికి సమర్పించి ప్రార్థిస్తారు. అనంతరం ఆ పువ్వులను సాధారణ చెత్తతో కలపరు. వాటిని నీటిలో వేస్తారు. ఎందుకంటే దైవాన్ని పూజించిన పువ్వులు కదా, కనుక వాటిని సాధారణ చెత్తలో వేయరు. అయితే ఆ పువ్వులను కూడా నేటి తరుణంలో క్రిమి సంహారక మందులతో పూయిస్తున్నారు. దీంతో అలాంటి పువ్వులను నీటిలో వేసినప్పుడు వాటిల్లో ఉండే క్రిమి సంహారక మందుల అవశేషాలు నీటిలో కలుస్తున్నాయి. ఈ క్రమంలో అలాంటి నీరు మానవాళికే కాదు, పర్యవరణానికి కూడా హాని కలిగిస్తోంది. మన దేశంలో ఇలాంటి పువ్వుల కాలుష్యాన్ని గురవుతున్న నదుల్లో ముఖ్యమైంది గంగా నది. అక్కడ రోజూ 80 లక్షల టన్నుల పువ్వుల వ్యర్థాలను నదిలో వేస్తున్నారట.
అయితే ఇలా పువ్వుల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని గమనించింది ఆమె. ఆమె పేరు మెలియా మూర్. అమెరికా వాసి. ఆమెకు అంకిత్ అగర్వాల్, కరణ్ రస్తోగి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిది కాన్పూర్. దీంతో కాన్పూర్‌లోనే ఈ ముగ్గురూ కలిసి హెల్పస్ గ్రీన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏమిటంటే... దేవాలయాల్లో మిగిలిపోయే పువ్వులను తీసుకువచ్చి వాటితో సేంద్రీయ ఎరువులను తయారు చేయడం. ఈ పనికోసం పలువురు మహిళలకు పని కూడా కల్పించారు. దీంతో వారికి కూడా ఉపాధి లభిస్తోంది.
దేవాలయాల్లో మిగిలిన పూలను సేకరించేందుకు గాను 77 మంది మహిళలు ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇక వీరితోపాటు హెల్పస్ గ్రీన్ సంస్థలో పనిచేసే వారు మరికొంత మంది. వీరందరూ మెలియా మూర్, అంకిత్ అగర్వాల్, కరణ్ రస్తోగి ల శిక్షణతో వాడి పడేసిన పువ్వులను ఉపయోగించి సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారు. అంతే కాదు, ఆ పువ్వుల వ్యర్థాలతో అగర్ బత్తీలు, సబ్బులు కూడా తయారు చేస్తున్నారు. దీంతో ఆ మహిళలకు ఉపాధి ద్వారా ఆదాయం లభిస్తోంది. పర్యవరణానికి, మానవాళికి కూడా మేలు జరుగుతోంది. ఈ క్రమంలో మెలియా మూర్, అంకిత్ అగర్వాల్, కరణ్ రస్తోగిలు తమ పనిని మరింత విస్తరించాలని అనుకుంటున్నారు. వారి ఆశయం నెరవేరాలని కోరుకుందాం. ఏది ఏమైనా అమెరికా మహిళ అయినప్పటికీ మెలియా మూర్ మన దేశంలో ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండడం నిజంగా అభినందనీయం కదా..!

Post a Comment