Header Ads

ఇషా ఆనంద్ ల పెళ్లి ఖర్చు ఎంతనో తెలుసా .? తెలిస్తే నోరెల్లబెడతారు.!!

అంబానీ కూతురి పెళ్లి అంటే మన దేశ ప్రజలు అబ్భా అనుకొనేలా ఉంటాది అని అందరూ అనుకుంటారు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాలు అంబానీ కూతురి పెళ్లి చూసి అబ్బా అంటారని ఎవ్వరూ అనుకోని ఉండరు, ఎందుకంటె అంబానీ పెళ్ళికి అంబానీ ఖర్చుపెడుతుంది భారీ మొత్తం, ఎంతో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు, అంబానీ కూతురి పెళ్ళికి అంబానీ ఖర్చుపెడుతున్న అమౌంట్ అక్షరాలా 100 మిలియన్ డాలర్ల పైనే, ఇప్పటి వరకు ప్రపంచం లో అత్యంత ఖరీదైన పెళ్లి ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ డయానా పెళ్లి, వీరి పెళ్లి జరిగి 37 ఏళ్ల అవుతుంది. వారి పెళ్ళికి అయిన ఖర్చు 110 మిలియన్‌ డాలర్లుగా చెపుతుంటారు.
ప్రైవేట్ ఫ్లైట్స్ నుండి 7 స్టార్ హోటల్స్ వరకు.

పెళ్లికి ముంద జరిగే సంగీత్‌ వేడుక ఉదయ్ పూర్ లో నిర్వహించారు. అంతర్జాతీయంగా పేరు పొందిన బియోన్స్‌ మొదలు హిల్లరీక్లింటన్‌, బిజినెస్‌ దిగ్గజాలు హెన్రీ క్రావిస్‌ వంటివారిని ఆహ్వానించారు. అంబానీ పిలిస్తే కుదరదు అని చెప్పే వారు ఉండరు, సంగీత్ కి వచ్చిన వారి సంఖ్యా చాలా ఎక్కువ. సంగీత్ నిర్వహించే ప్రదేశానికి దేగ్గర్లో ఉన్న 7 స్టార్ హోటల్స్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు అన్నింటిలోను గదులు బుక్‌చేసారు. సుమారు 100కుపైగా చార్టర్డ్‌ విమానాలు ఉదయ్ పూర్ మహారాణాప్రతాప్‌ ఎయిర్‌పోర్టునుంచి ఎగిరేందుకు సిద్ధంచేసారు. మొత్తం నాలుగురోజులపాటు రోజు 5100 మందికి అన్నదానం చేయనున్నారు.

అసలు అంబానీ కూతురిని పెళ్లి చేసుకోబోతుంది ఎవరో తెలుసా.?

పిరమాల్‌ గ్రూప్‌ అధినేత అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌. సెప్టెంబర్‌ నెలలోనే ఇషా అంబానీ నిశ్చితార్థం అజయ్ పిరమాల్‌ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో వైభవంగా జరిగింది. ఇందుకు ఇటలీలోని లేక్ కోమో వేదికైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుండి ముఖ్యమైన వ్యక్తులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఇటలీ నది తీరంలో ఎంగేజ్‌మెంట్‌ వేడుక కళ్లు జిగేల్‌ మనేలా జరిగింది. ఈషా, ఆనంద్‌ చాలాకాలంగా స్నేహితులు. అంబానీ, పిరమల్‌ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. ఆనంద్‌ పిరమల్‌ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్‌ చేశారు. ఆమె ఒప్పుకోవడం. ఇరువైపులా పెద్దలకు తెలియజేయడం వాళ్లూ అంగీకరించడం వేగంగా జరిగిపోయాయి.

అంబానీ కూతురి పెళ్లి కావడం తో జియో సిం కస్టమర్ లకు ఎటువంటి సర్ప్రైస్ లని ఇస్తాడో చూడాలి, త్వరలోనే జియో ఫైబర్ నెట్ అందుబాటులోకి రాబోతుంది, జియో సిం తో ఎలాగైతే భారత దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపాడో, జియో ఫైబర్ నెట్ తో కూడా అదే రకంగా సంచలనం సృష్టిస్తాడని నెటిజెన్ లు కామెంట్స్ చేస్తున్నారు.

No comments