Header Ads

రజినీకాంత్ అంటే కేవలం పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించిమీకు తెలియని కొన్ని విషయాలు మీకోసం.!!

ఒక బస్సు కండక్టర్ నుండి ఇండియన్ సినిమా కె సూపర్ స్టార్ గా ఎదిగిన ఒక మహానుభావుడు రజినీకాంత్. ఆయన పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది అభిమానులు ఆనందం తో ఊగిపోతారు, సినిమా ఇండస్ట్రీ లో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించి ఆసియ సినిమా చిత్ర సీమ లోనే జాకీ చాన్ తరువాత అత్యంత పారితోషికం అందుకున్న హీరో గా, ఆసియ వ్యాప్తంగా జాకీ చాన్ తరువాత అత్యంత ప్రజాధారణ కలిగిన హీరో గా రజినీకాంత్ చరిత్ర లో నిలిచిపోయాడు.




రోడ్ మీద నిల్చుంటే లక్షల మంది చుట్టు ముట్టారు :

కొన్ని సంవత్సరాల క్రితం, రోడ్ మీద రజినీకాంత్ కార్ తో సహా జనాల కార్ లను బైక్ లను ఆపి, CM కాన్వాయ్ వెళ్ళడానికి మార్గం సుగమం చేసారు పోలీస్ లు. రజినీకాంత్ కార్ దిగి రోడ్ పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతూ నిల్చున్నాడు, అంతే రజినీకాంత్ ని చూసిన జనాలు ఒక్క సారిగా ఎగబడ్డారు, లక్షలాది జనాలు గుమికూడారు రజినీకాంత్ ని చూడటానికి, ఆ దెబ్బతో సినిమా ఇండస్ట్రీ నే కాదు, రాజకీయ వేత్తలు కూడా ఆశ్చర్య పోయారు, CM కాన్వాయ్ కాదు కదా, ఒక బండి కూడా ముందుకు కదల లేక పోయింది ఆ రోడ్ లో, రజినీకాంత్ కి జనాల్లో ఉన్న క్రేజ్ కి ఈ సంఘటన ఒక ఉదాహరణ.

సినిమాల్లో మాత్రమే రజినీకాంత్ గారు మేకప్ వేసుకుంటారు, బయట మాత్రం సామాన్య మనుషులు ఎలాగైతే ఉంటారో, ఆయన కూడా అలానే ఉంటారు, ఎలా కనిపించాం అన్నది కాదు, ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆయన చెప్పే మాట, ఆయన సినిమా రిలీజ్ అయ్యింది అంటే అభిమానులకే కాదు, సామాన్య ప్రేక్షకులకు కూడా పండగే, తమిళ్ నాడు లో ఆయనకు ఏ విధంగా అయితే క్రేజ్ ఉందొ, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే విధమైన క్రేజ్ ఆయన సొంతం.

నేను మరణించాక.

"నేను మరణించాక నా ఆస్తి మొత్తం ప్రజలకే సొంతం, నేను ఈ స్థాయి లో ఉన్నా అంటే అందుకు కారణం ప్రజలే, వారు లేనిదే నేను లేను" అంటూ చెప్పారు రజినీకాంత్, ఆయనకీ ప్రజలంటే ఎంతో ఇష్టం, ఒకటి కాదు రెండు కాదు.. ఆయన ఎన్నో మంచి పనులు చేసారు. కొన్ని వేల మందికి సహాయం చేసారు. ఇండియన్ సినిమాకి ఒక్కడే సూపర్ స్టార్, అది రజినీకాంత్ ఒక్కడే.. ఈ భూమి ఉన్నంత కాలం తలైవా అంటే రజినీకాంత్ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది అందరికి, కేవలం రజినీకాంత్ గారి పేరు మాత్రమే గుర్తొస్తుంది.

No comments