Header Ads

పాలను మరగబెట్టడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్. ప్యాకెట్ పాలను మరగబెట్టరాదు.. పాల గ్యారేజ్, ఇక్కడ ఈఆర్టికల్ లో ప్యాకెట్ పలు ఎందుకు మరగపెట్టరాదో తెలుపబడను ..!!

పాల ప్యాకెట్ల లో పాలు ఎక్కువగా మరగబెట్టకండి, లేకపోతే పాలల్లోని పోషకాలు నశిస్తాయి. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమా తరహాలో డైలాగ్స్ చెబుతున్నారు కానీ మేటర్ లోకి రావట్లేదేంటి అని అనుకుంటున్నారా?. వివరాల్లోకెళితే,
పాల ప్యాకెట్ల లోని పాలను ముందుగానే మరగబెట్టి చల్లార్చి ప్యాకింగ్ చేస్తారు, ఏ డెయిరీలో అయినా పాల‌ను ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌కు మ‌రిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు పాల‌ను మ‌రిగించి వెంట‌నే 15 సెకండ్ల‌లోనే చ‌ల్లారుస్తారు. ఇలా చేయడాన్ని 'పాశ్చ‌రైజేష‌న్' అంటారు. దీని వ‌ల్ల పాల‌లో ఉండే హానికార‌క సాల్మొనెల్లా బాక్టీరియా తొల‌గిపోతుంది. అయితే ఇలా ఒక‌సారి మ‌రిగించాక ఆ పాల‌ను ప్యాక్ చేస్తారు, ఆ తరువాత మనం తిరిగి మళ్ళీ మన ఇళ్లల్లో ఆ పాలను మరిగిస్తే, పాలల్లోని పోషకాలు నశిస్తాయి.

మరి పాలు వేడి గా త్రాగాలి అంటే ఎలా?

పాలు చల్లగా ఉన్నప్పుడు తాగడానికి ఎవ్వరు ఇష్టపడరు, అందుకే ప్యాకెట్ పాలు బాగా మరగబెట్టుకొని తాగుతాము, ఆలా చెయ్యకుండా ఎక్కువ సేపు మరగబెట్టకుండా, వేడి అయ్యేంత వరకు మరగబెట్టాలి, ఆ తరువాత వెంటనే తాగాలి, ఇలా చెయ్యడం ద్వారా పాలల్లోని పోషకాలు నశించవు, వేడిగా తాగినట్టు కూడా ఉంటాది.

నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు ఏం చెయ్యాలి?

మీ ఇంట్లో గేదలు ఉన్నా లేక గెదల వ్యాపారుల దెగ్గర పాలు కొనుగోలు చేసుకుంటున్నా, ఆ పాలని ఎక్కువ సేపు మరగబెట్టాలి, ఆలా చేస్తే ఆ పాలల్లో ఉండే హానికార‌క సాల్మొనెల్లా బాక్టీరియా తొల‌గిపోతుంది, పోషకాలు తొలగిపోకుండా ఉంటాయి.

కనుక, ఇప్పటి నుండి మీరు ప్యాకెట్ పాలు వాడే లాగ ఉంటె, ఎక్కువ సేపు మరగబెట్టకండి, ఒక వేళా గెద వ్యాపారుల దెగ్గర నేరుగా పాలు తీసుకొనే లాగ అయితే, ఎక్కువ సేపు మరగబెట్టండి.

ఈ విషయాన్నీ ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి .

No comments