Header Ads

ఐటీలో పోటీ ప‌డుతున్న ఏపీ - టీఎస్

ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో ఇండియాలో తెలుగు రాష్ట్రాలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నాయి. భారీగా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తూ..పెట్టుబ‌డిదారులు, ఐటీ కంపెనీల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ప్ర‌పంచ‌మంతా ఐటీ రంగంపై ఆధార‌ప‌డి ఉన్న‌ది. దీనిని ముందే గ‌మ‌నించిన అమెరికా ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తోడ్పాడు అందిస్తోంది. గూగుల్‌, ఫేస్ బుక్‌, పొలారిస్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రాం, టంబ్ల‌ర్‌, టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెసీఎల్‌..తదిత‌ర ఐటీ దిగ్గ‌జ కంపెనీలు అక్క‌డే కొలువు తీరాయి. గ‌తంలో ఐటీ రంగం అనేస‌రిక‌ల్లా బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ న‌గ‌రాలు చెప్పే వారు. కానీ ఇపుడు ఆ సీన్ లేదు..చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఆయ‌న చాలా దేశాల‌లో ప‌ర్య‌టించారు.
సింగ‌పూర్‌లో అభివృద్ధిని..అమెరికాలో ఐటీ రంగం పోక‌డ‌ను ముందుగానే గుర్తించారు. ఇందుకోసం ఏకంగా సైబ‌రాబాద్ ను డెవ‌ల‌ప్ చేశారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అధికారం కోల్పోయినా..వ‌చ్చిన పాల‌కులు సైతం ఐటీ జ‌పం చేస్తూ వ‌స్తున్నాయి. ఆయా ప్ర‌భుత్వాల‌కు దేశీయ ప‌రంగా..రాష్ట్ర ప‌రంగా భారీగా ఆదాయం ఈ రంగం నుంచి అందుతోంది. లక్ష‌లాది మంది ఐటీ రంగంపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు. వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా ..ప‌రోక్షంగా ల‌క్ష‌ల్లో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. బీపీఓ, కేపీఓతో పాటు హెల్త్ రంగంలో భారీగా కొలువులు దొరుకుతున్నాయి. ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ప‌రంగా చూస్తే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించింది. టెక్నాల‌జీ బేస్డ్‌గా స్టార్ట‌ప్‌ల‌కు హ‌య్య‌స్ట్ ప్ర‌యారిటీ ఇచ్చారు. యువ‌తీ యువ‌కులు త‌మ క‌ల‌ల‌కు ప‌దును పెడుతూ ..స్టార్ట‌ప్ ల‌ను ప్రారంభిస్తూ..కంపెనీలుగా మారేలా చేస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ స‌ర్కార్ టీ - హబ్ పేరుతో ఏర్పాటు చేసింది. ఐటీ కంపెనీల‌ను భాగ‌స్వామ్యులు చేశారు. గ‌వ‌ర్న‌ర్ ఛైర్మ‌న్‌గా ఐటీ మినిస్ట‌ర్‌, టాటా ఛైర్మ‌న్ టాటా, సీఓఓ శ్రీ‌నివాస్ కొల్లిప‌ర‌, జ‌య్ కృష్ణ‌న్ చూస్తున్నారు.

అడోబ్ సీఇఓ శంత‌న్ నారాయ‌ణ్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్ సీఇఓలు స‌త్య‌నాదెళ్ల‌, సుంద‌ర్ పిచ్చెయ్ లాంటి వాళ్లు టీ హ‌బ్‌ను సంద‌ర్శించి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అల్లా ర‌ఖా రెహ‌మాన్ ఇక్క‌డి ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌తో ముచ్చటించారు. త‌న అనుభ‌వాల‌ను వారితో పంచుకున్నారు. ఐటీ కంపెనీలు, సిఇఓలు, ఛైర్మ‌న్లు, ఎక్స్‌ప‌ర్ట్స్ టీ హ‌బ్‌కు క్యూ క‌ట్టారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం అడ్డంకిగా మారిన చట్టాల‌ను టీఎస్ ప్ర‌భుత్వం మార్చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో అనుమ‌తి వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఒక‌వేళ వారం రోజుల్లో కూడా ప‌ర్మిష‌న్ రాక‌పోతే అనుమ‌తి వ‌చ్చిన‌ట్టుగా భావించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.దీంతో బిజినెస్ టైకూన్స్‌, ఐటీ, హెల్త్ , ఆయిల్ రిలేటెడ్ కంపెనీలు కొత్త ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు భారీగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. భారీ ప్రోత్సాహ‌కాల‌తో పాటు మెంటార్స్‌, ట్రైనింగ్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు ప్ర‌త్యేకించి స‌హ‌కారం అందించేందుకు ఫండింగ్ స‌పోర్ట్ చేస్తోంది. ఐటీ మినిస్ట‌ర్ విద్యాధికుడై ఉండ‌డం కూడా ఇక్క‌డ ఐటీ సెక్టార్ రంగంపై కాన్‌సెంట్రేష‌న్ పెట్టారు. ఐటీ సెక్ర‌ట‌రీ జ‌యేష్ రంజ‌న్ ఉండ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్ పాయింట్‌గా మారింద‌నే చెప్పుకోవాలి.

నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజ‌లో ఉంది. ఇది ఆ రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ ప‌నికి ద‌క్కిన గౌర‌వంగా భావించాలి. ఏపీలో ప్ర‌త్యేకంగా ఐటీ రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చారు. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తెర తీశారు. క్యాంప‌స్ ట్రైనింగ్ సెంట‌ర్‌, ఫ్యాక‌ల్టీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం, క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ , గ‌వ‌ర్న‌మెంట్ కెపాసిటీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం ప్రాతిప‌దిక‌గా ఐటీ రంగం దూసుకెళుతోంది. ప్ర‌తి ప‌ట్ట‌ణంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌ను ఏపీ స‌ర్కార్ ఏర్పాటు చేసింది. లక్ష‌లాది మంది యువ‌తీ యువ‌కుల‌కు స్కిల్స్‌ను అప్‌డేట్ చేస్తూ..వారి కాళ్ల మీద వారు నిల‌బ‌డేలా చేస్తున్నారు. స్కూల్స్‌, ఇంట‌ర్‌, డిగ్రీ కాలేజీలతో పాటు ఇంజ‌నీరింగ్ కాలేజీల‌లో స్టార్టింగ్ నుంచే ఐటీ సెక్టార్‌లో ఎక్స్‌ప‌ర్ట్స్‌గా మార్చేలా విస్తృతంగా ట్రైనింగ్స్ ఇచ్చారు.

విద్య‌, శిక్ష‌ణ‌, ఉపాధి ఇవ్వాల‌నే ఉద్ధేశంతో ప్ర‌య‌త్నం చేసింది. కాలేజ్ క‌నెక్ట్ పేరుతో ట్రైనింగ్స్‌, యూత్‌తో ఇంట‌రాక్ష‌న్ ప్రొవైడ్ చేసింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, సాప్‌, ఇఎస్‌ఫ్ ల్యాబ్స్‌, డిజిట‌ల్ టెక్నాల‌జీ కంపెనీల‌తో ఏపీ టై అప్ చేసుకుంది. డిజిట‌ల్ లిట‌ర‌సీ ప్రోగ్రాంపై అధికంగా కాన్‌సెంట్రేష‌న్ చేసింది. మొత్తం మీద ఐటీ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లు దూసుకు వెళుతున్నాయి. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, డిజిట‌ల్ రంగాల‌లో కొత్త కంపెనీలు న్యూ ఐడియాస్‌కు ప్ర‌యారిటీ ఇస్తూ కొలువులు ఏర్పాట‌య్యేలా చేస్తున్నాయి.

No comments