Header Ads

ఓ పోలీస్ అధికారి నేను సెక్స్ వర్కర్ గా ఉన్నపుడు, రాత్రి నన్ను బాగా వాడుకొని ఉదయం ఇష్టానుసారం గాచేసెవాడు.!! ఓ మహిళా రియల్ స్టోరీ.?

ఆమె పేరు నళినీ జమీలా. ఇప్పుడు ఆమె ఒక రచయిత. ఎన్నో సామాజిక కార్యకళాపాలు చేపడుతున్నారు. కానీ ఒకప్పుడు ఆమె ఒక సెక్స్ వర్కర్. ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ అంటూ కొన్ని రోజుల క్రితం నళినీ జమీలా తన ఆత్మకథ గురించి బుక్ కూడా రాసింది.
సెక్స్‌ వర్కర్‌ గా మారింది

ఈమెది కేరళలోని త్రిసూల్‌. కమ్యూనిస్టు కుటుంబంలో 1957లో పుట్టింది నళినీ జమీలా. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఆమె సెక్స్‌ వర్కర్‌ గా మారింది.

బుక్ రాసింది

సెక్స్ వర్కర్ గా ఆమె జీవితం ఎలా గడిచిందనే విషయంపై ఆమె మళయాళంలో ఒక బుక్ రాసింది. అది చాలా భాషల్లోకి అనువాదమైంది. నళినీ జీవితం గురించి ఆమె మాటల్లోనే..

ఆస్తులన్నీ తరిగిపోయాయి

నేను గొప్పింట్లినో పుట్టాను. మా నాన్న కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. రానురాను మా ఆస్తులన్నీ తరిగిపోయాయి. మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయడం వల్ల మా అమ్మ తాను చేసే పని కోల్పొవాల్సి వచ్చింది.

అమ్మకు కష్టాలు ఎక్కువయ్యాయి

అమ్మ నూలుమిల్లులో పని చేసేది. ఆ పని నుంచి కొందరు ఆమెను తీసేశారు. మా నాన్న సంపాదన గురించి ఆలోచించేవాడు కాదు. ఎప్పుడూ విప్లవాలంటూ తిరిగేవాడు. దీంతో అమ్మకు కష్టాలు ఎక్కువయ్యాయి.

ఆసరాగా ఉండేదాన్ని

పూట కూడా గడవని పరిస్థితిలో ఉండేవాళ్లం. దీంతో నేను కూలి పనులు వెళ్లడం మొదలుపెట్టాను. నేను సంపాదించే పదోపరకో మా అమ్మకు ఇచ్చేదాన్ని. అలా మా కుటుంబానికి చిన్నతనంలో ఆసరాగా ఉండేదాన్ని.

పని లేకుండా చేసేవాళ్లు

నాకు చదువుకోవాలని బాగా ఆశ ఉండేది. కానీ నా కల నెరవేరలేదు. ఇక నేను పనికి వెళ్లే చోట కొందరు మగాళ్లు ఎలా అంటే ప్రవర్తించేవాళ్లు. వారిని ఎదురిస్తే నన్ను పని లేకుండా చేసేవాళ్లు.

ప్రేమలో పడ్డాను

అయితే నేను అబ్బాయితో ప్రేమలో పడ్డాను. అతన్ని పెళ్లి చేసుకుందామని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. కానీ అతని మిత్రుడు నన్ను మోసగించాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాడు. అతనితో మూడు సంవత్సరాలు కలిసి కాపురం చేశాను.

డబ్బులు సరిపోయేవి కావు

మా ఆయన రోజూ తాగేవాడు. ఆయన ఎక్కువగా తాగడంతో క్యాన్సర్ వచ్చి మరణించారు. దీంతో నాకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. మా అత్తయ్య నన్ను డబ్బుల కోసం వేధించేది. నేను ఏ పని చేసినా కూడా నాకు డబ్బులు సరిపోయేవి కావు.

నన్ను వదిలేశాడు

ఇక తర్వాత నన్ను షాహుల్‌ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవడంతో తన పేరును జమీలాగా మార్చుకున్నాను. కానీ అతను మరో అమ్మాయికి అలవాటు అయిన నన్ను వదిలేశాడు.

వ్యభిచారం

కుటుంబాన్ని నడిపేందుకు, పిల్లలను బాగా చూసుకునేందుకు నాకు ఏ మార్గం లేక వ్యభిచారంలోకి దిగాను. నా స్నేహితురాలు నీకు ఇప్పుడు వ్యభిచారం కంటే మరో మంచి మార్గం లేదని చెప్పింది.

పోలీసులు కూడా

నాకు అందులోకి దిగడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఏ దారి లేక వేశ్యవృత్తిలోకి అడుగుపెట్టాను. అందులోకి దిగిన తర్వాత నేను రకరకాల మగవారిని చూశాను. కొందరు మంచి వాళ్లు నా దగ్గరకు వచ్చేవారు. కొందరు పోలీసులు కూడా నాతో సుఖాన్ని కోరుకునేవారు.

ఇష్టానుసారంగా కొట్టించాడు

ఒక పోలీస్ నాతో రాత్రి బాగా గడిపి ఉదయం నన్ను అరెస్ట్‌ చేయించాడు. ఇష్టానుసారంగా కొట్టించాడు. అతను అలా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నేను సెక్స్‌వర్కర్‌ గా చాలా ఏళ్లు ఉన్నాను.

ప్రాణాలు తీయడానికి

క్యాండెట్స్ కోసం నేను రోడ్డుపై ఎదురు చూస్తుంటే కొందరు నన్ను నానా ఇబ్బందులుపెట్టేవారు. కొందరు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు.

భార్య మంచిదికాదని

నా దగ్గకు వచ్చే వారంతా తన భార్య మంచిదికాదని, ఆమె అందంగా లేదని నీ దగ్గర మాంచి సుఖం దక్కుతుందని ఏవేవో కాకమ్మ కథలు చెప్పేవారు.

పెళ్లాం కన్నా ఎక్కువగా

అలాంటివి నేను చాలా విన్నాను. మొదట అవి నిజమనుకునేదాన్ని. కొందరు ఒక్క రాత్రికి నా దగ్గరకు వచ్చి నన్ను కట్టుకున్న పెళ్లాం కన్నా ఎక్కువగా వాడుకునేవారు. ఏవేవో ప్రశ్నలు అడిగేవారు. అలాంటి వాళ్లను చాలా మందినే చూశాను.

చాలా అనుభవించింది

ఇలాంటి కష్టాలు నళినీ చాలా అనుభవించింది. ఆమె జీవితంలో పడ్డ కష్టాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆమె రాసిన ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ బుక్ లో ప్రతి పేజీలో ఆమె జీవితంలో పడ్డ కష్టాలన్నీ కనపడతాయి. సెక్స్‌ వర్కర్ల హక్కుల గురించి కూడా ఆమె చాలా విషయాలు వివరించింది.

బయటపడింది

నళినీ సెక్స్ వర్కర్ జీవితం నుంచి బయటపడింది. జ్వాలాముఖి అనే స్వచ్ఛంద సంస్థ నళిని జీవితాన్ని మార్చేసింది. ఆమె థాయ్‌లాండ్‌ లో ఫోటోగ్రఫీ కూడా నేర్చుకుంది.

డాక్యుమెంటరీలు తీసింది

సెక్సు వర్కర్లకు సంబంధించిన హక్కులపై చాలా ప్రసంగాలు ఇచ్చింది. అలాగే వారి కష్టాలపై డాక్యుమెంటరీలు తీసింది. వారి కోసమే పాటుపడుతోంది.

No comments