Header Ads

ప్ర‌పంచ‌మంత‌టా త‌లైవా ఫీవ‌ర్ - మెస్మ‌రైజ్ చేస్తున్న ర‌జ‌ని.!!

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గిన న‌టుల్లో..సినీ దిగ్గ‌జాల్లో అత్యుత్త‌మ‌మైన న‌టుడిగా పేరు సంపాదించారు త‌మిళ‌నాడుకు చెందిన ర‌జనీకాంత్‌. వ‌య‌సు రీత్యా 68 ఏళ్లు నిండిన ఈ త‌మిళ యాక్ట‌ర్ ఏది చేసినా ఓ రికార్డే..మ‌రో చ‌రిత్రే. ఈ న‌టుడి బ్రాండ్ మార్కెట్ వాల్యూ..వంద‌ల కోట్ల‌ను ఎప్పుడో దాటేసింది. ఆయ‌న మాటే వేదం..ఆయ‌న న‌టనే శాస‌నం..ఆయ‌న న‌డ‌తే చ‌ట్టం. ఇదీ ర‌జ‌నీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌. ఈ దేశంలో ఏ పొలిటిక‌ల్ లీడ‌ర్‌కు..న‌టుడికి లేరు ఆయ‌న‌కున్నంత ఫ్యాన్స్‌. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఆయ‌న అభిమానులే.
పాలాభిషేకాలు..పూల‌దండ‌లు..పూజ‌లు..ఇలా చెప్పుకుంటూ వెళితే ఓ సంవ‌త్స‌రం ప‌డుతుంది. విల‌క్ష‌ణ‌మైన మేన‌రిజం ఆయ‌న స్వంతం. అది ర‌జ‌నీకాంత్‌కే సాధ్యం. ఈ యాక్ట‌ర్ అస‌లు పేరు శివాజీరావు గైక్వాడ్‌. 1950 డిసెంబ‌ర్ 20న క‌ర్ణాట‌క‌లో జ‌న్మించారు. స్వ‌స్థలం మ‌రాఠీ. ర‌జ‌నీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ గుర్తించి ..ప‌ట్టుకున్నారు. ద‌గ్గ‌రుండి న‌టుడిగా అవ‌కాశాలు ఇచ్చి ప్రోత్స‌హించారు. ఆయ‌న‌ను ఫ్యాన్స్ త‌లైవ‌ర్‌గా ప్రేమ‌గా పిలుచుకుంటారు.

ఇండియాలోనే కాదు..ప్ర‌పంచ‌మంత‌టా త‌లైవాకు లెక్క‌లేనంత‌మంది ..ఇసుక వేస్తే రాల‌నంత అభిమాన జ‌నం కోట్ల‌ల్లో ఉన్నారు. ప్ర‌తి రోజు ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. ఇంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ఇంకెవ్వ‌రు లేరంటే న‌మ్మ‌లేం. త‌మిళ‌నాడే కాదు క‌ర్ణాట‌క‌, ముంబ‌యి, హైద‌రాబాద్‌..ఇలా ప్ర‌తి చోటా త‌లైవా అన్న ప‌దం ఓ సంచ‌ల‌నం. లెక్క‌లేన‌న్ని సినిమాలలో న‌టించారు.

కోట్లాది ఆస్తులు సంపాదించారు. కానీ జీవితంలో ఎంత సంపాదించినా ఆయ‌న మాత్రం ..సింపుల్‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. ఒక్కో మాట తూటా కంటే ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. అది ప్ర‌జ‌ల‌ను ఊగిపోయేలా చేస్తుంది..ఇదే ర‌జ‌నీకాంత్ స్పెషాలిటీ. సిగ‌రేట్‌ను గాల్లోకి విసిరి ..తిరిగి పెద‌వుల‌పై తీసుకు వ‌చ్చేలా చేయ‌డం..ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

అప‌ర భ‌క్తుడు ర‌జ‌నీకాంత్‌. వ్య‌క్తి నుంచి వ్య‌వ‌స్థ‌గా ఎదిగారు. తానే బ్రాండ్‌గా మారిన ఈ న‌టుడు ..గొప్ప భ‌క్తుడు. ప్ర‌తి ఏటా హిమాల‌యాల‌కు వెళ‌తారు. అక్క‌డ ధ్యానం చేస్తారు. అత్యంత సాధార‌ణ‌మైన దుస్తులు ధ‌రిస్తారు. సామాన్య భ‌క్తులు లాగే జీవించ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. గుప్త దానాలు చేయ‌డంలో ముందు వ‌రుస‌లో నిలుస్తారు. త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాలం, మ‌రాఠీ, హిందీ, ఇంగ్లీష్‌, జ‌ప‌నీస్ ఇలా ప‌లు భాష‌ల్లో ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమాలు విడుద‌లై రికార్డులు బ్రేక్ చేస్తాయి.

ఇండియ‌న్ అగ్ర ద‌ర్శ‌కుడిగా విరాజిల్లుతున్న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శివాజీ, 2.0 సినిమాలు వ‌సూళ్ల రికార్డుల‌ను చెరిపి వేశాయి. ఏ పాత్ర ఇచ్చినా స‌రే దానిలో లీన‌మై పోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఒక‌ప్పుడు కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేసిన ఈ అరుదైన న‌టుడు..ఇపుడు కోట్లాది ప్ర‌జ‌ల‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. ముత్తు సినిమా జ‌పాన్‌, మ‌లేషియా, శ్రీ‌లంక ప్ర‌జ‌ల‌ను షేక్ చేసింది.

1975లో కె. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అపూర్వ రాగంగ‌ళ్ సినిమాలో మొద‌టి సారిగా ర‌జ‌నీకాంత్ న‌టించారు. క‌మ‌ల్ హాస‌న్‌, జ‌య‌సుధ‌, శ్రీ‌విద్య ఆ మూవీలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. అక్క‌డితో స్టార్ట్ అయిన త‌లైవా ప్ర‌స్థానం అప్ర‌హ‌తిహ‌తంగా సాగుతూనే ఉన్న‌ది. న‌ర‌సింహ కోట్లు కురిపించింది. ముత్తు గురించి చెప్ప‌క్క‌ర్లేదు. జ‌య‌ప్ర‌దతో క‌లిసి తెలుగులో న‌టించిన అంతులేని క‌థ సినిమా ర‌జ‌నీకాంత్‌కు న‌టుడిగా బ్రేక్ ఇచ్చింది. న‌టుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు త‌లైవా. ఇప్ప‌టికే 164 సినిమాల్లో న‌టించారు.

ద‌ళ‌ప‌తి, మ‌న్న‌న్‌, బాషా, పెద‌రాయుడు, అరుణాచ‌లం, బాబా, చంద్ర‌ముఖి,కుచేల‌న్‌, ది వారియ‌ర్‌, రోబో, కొచ్చాడియ‌న్‌, విక్ర‌మ సింహా, లింగా, క‌బాలి, కాలాతో పాటు ఇటీవ‌ల విడుద‌లైన 2.0 సినిమాలు ర‌జ‌నీకాంత్‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చాయి. త‌లైవాకు రాయ‌చూర్‌లోని మంత్రాల‌యంలోని రాఘ‌వేంద్ర స్వామి అంటే ఎన‌లేని అభిమానం. ఏడాదిలో ఒక‌సారి ఆ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటారు.

స్వామి వారి స‌న్నిధిలో ఉంటారు. ఆయ‌న‌లోని ఆధ్యాత్మిక ల‌క్ష‌ణాలు క‌లిగిన సినిమా బాబా వ‌చ్చింది. మ‌నీషా కొయిరాలా న‌టి..ర‌జ‌నీకాంత్ న‌టుడే కాదు గొప్ప భ‌క్తుడు..అంత‌కు మించి కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న మాన‌వుడే కాదు దాన‌వుడు కూడా..త‌లైవాను డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపించేలా చేసిన సినిమా కాలా. గొప్ప సందేశాత్మ‌క చిత్రం అది. వీలైతే చూడండి..ర‌జ‌నీకాంత్ లోని మేన‌రిజ‌మే కాదు..న‌ట‌న అంటే ఏమిటో తెలుస్తుంది.

No comments