Header Ads

కొలువు తీర‌నున్న కొత్త స‌ర్కార్ - అభ్య‌ర్థుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్

ఎన్న‌డూ లేనంత చైత‌న్యంతో త‌మ విలువైన ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా వుంటే..సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన అన్ని పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు మాత్రం నిద్ర‌కు దూర‌మ‌య్యారు. అంతులేని టెన్ష‌న్‌ను అనుభ‌విస్తున్నారు. ఎవ్వ‌రితో చెప్పుకోవాలో తెలియ‌క వారి అనుచ‌ర‌గ‌ణం మ‌ద్యాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో లెక్క‌లేనంత హ‌వాలా రూపంలో కోట్ల రూపాయ‌లు చేతులు మారాయి. 137 కోట్ల‌కు పైగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాయి. క‌రెన్సీతో పాటు మ‌ద్యం, బంగారం దొరికింది. పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వాటిని కోర్టుల‌కు హ్యాండ్ ఓవ‌ర్ చేశారు. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌. పోలీసుల‌తో పాటు ఎన్నిక‌ల సిబ్బంది ఓట్ల‌ను లెక్కించనున్నారు. అధికార పార్టీ టీఆర్ ఎస్‌తో పాటు మ‌హాకూట‌మి పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, ఇంటి పార్టీ తో పాటు ఎంఐఎం, బీజేపీ, బీఎస్పీతో పాటు ఇండిపెండెంట్లు అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. ఎవ‌రికి వారే తాము ప‌వ‌ర్‌లోకి రావ‌డం ఖాయ‌మ‌ని ..ఏ శ‌క్తి త‌మ‌ను ఆప‌ద‌ని జోస్యం చెప్పారు.
కొద్ది గంట‌ల్లో ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. కానీ రాష్ట్రంలో ఎన్న‌డూ లేనంత‌గా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారి పోతున్నాయి. ఎలాగైనా స‌రే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న క‌సితో ఉన్న పార్టీలు క్యాంపు రాజ‌కీయాల‌కు తెర లేపాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌ల ప‌ర్వం స్టార్ట్ చేశారు. త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించింది. కానీ ఆయ‌న దీనిని ఖండించారు. ప‌రువు న‌ష్టం కేసు వేస్తానంటూ హెచ్చ‌రించారు. త‌న‌కు అంత దుర్గ‌తి ప‌ట్ట‌లేద‌న్నారు. ఓటింగ్ కేంద్రాల వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటైంది. వేలాది మంది కేంద్ర‌, రాష్ట్ర పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఎలాంటి చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా చ‌ర్య‌లు ఉండేలా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌జ‌త్ కుమార్ ముందస్తు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో డీఐజీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మిన‌ట్ టు మిన‌ట్ ఇక్క‌డ జ‌రిగే ప్ర‌తి దానిని రికార్డు చేస్తున్నారు. పూర్తి వివ‌రాల‌ను ఇటు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు ..అటు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు క‌మిష‌న‌ర్ పంపిస్తున్నారు.

పోస్ట‌ల్ బ్యాలెట్‌ల విష‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే స‌ర‌ఫ‌రా చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇప్ప‌టికే గులాబీ ద‌ళం ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించ‌గా..ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం ప్ర‌జాకూట‌మికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఈవీఎంల టాంప‌రింగ్ జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని ..గ‌జ్వేల్ కాంగ్రెస్ అభ్య‌ర్థి వంటేరు ప్ర‌తాప్ రెడ్డి క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. అన్ని పార్టీలు సంబ‌రాలు చేసుకునేందుకు రెడీ కాగా. చాలా మంది అభ్య‌ర్థులు మాత్రం ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని ఆందోళ‌న‌కు లోన‌వుతున్నారు. పాజిటివ్ ఓటు త‌మ‌కే ప‌డింద‌ని..అదే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తుండ‌గా..ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు త‌మ వైపే ఉంద‌ని..తామే ప‌వ‌ర్‌లోకి రావ‌డం ఖాయ‌మ‌ని మ‌హాకూట‌మి అంటోంది.

ఒక‌వేళ ప్ర‌భుత్వం ఏర్పాటులో ఏమైనా స‌హ‌కారం కావాలంటే..తాము రెడీగా ఉన్నామంటూ కాషాయ ద‌ళం ప్ర‌క‌టించింది. ఇక కేసీఆర్ ప్రభుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉన్న ఎంఐఎం అధినేత ఓవైసీ ఏకంగా బుల్లెట్ మీద ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్లి కేసీఆర్‌ను ఆలింగ‌నం చేసుకున్నారు. మరోసారి కాబోయే సీఎం కేసీఆరేన‌ని ప్ర‌క‌టించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో..ఎవ‌రు ఎవ‌రిని క‌లుస్తున్నారో..తెలియ‌క రాజ‌కీయ మేధావులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కొన్ని గంట‌ల‌లో అస‌లు బండారం బ‌య‌ట ప‌డ‌నుంది. గెలుపు గుర్రాలు ఎవ‌రో..తేల‌నుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపు పూర్తి స్ప‌ష్టం వ‌స్తుంది. ఈ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కొత్త సీఎం ఎవ‌రో స్ప‌ష్టం కానుంది. చైత‌న్యానికి ప్ర‌తీక‌గా పేరున్న ఈ మ‌ట్టి బిడ్డ‌లు కేసీఆర్ కు ప‌ట్టం క‌డ‌తారా..లేక కోదండ‌రాం చేరిన ప్ర‌జాకూట‌మికి అప్ప‌గిస్తారో వేచి చూడాల్సిందే.

No comments