పూజ్యాయా శ్రీ రాఘవేంద్రాయ నమః - భక్తుల స్వర్గ ధామం మంత్రాలయం
ఈ పవిత్రమైన భూమిపై ఎందరో యోగులు..రుషులు..మఠాధిపతులు నడయాడారు. ధర్మబద్ధమైన జీవితంతో విలువలకు కట్టుబడి కడదాకా నిలిచారు. అలాంటి పీఠాధిపతుల్లో ఒకడిగా..దైవంగా భక్తుల ఇలవేల్పుగా శ్రీ రాఘేవంద్ర స్వామి కొలవబడుతున్నారు. లెక్కలేనంత మంది భక్తులు నిత్యం ఆయనను స్మరించుకుంటారు. ఆలయాల్లో..మఠాల్లో ..ఆశ్రమాల్లో..ఎక్కువ మంది భక్తులను కలిగి ఉన్నది మంత్రాలయ స్వామి వారికే. సజీవ నదిగా తుంగభద్ర నది వినుతికెక్కింది.
ప్రశాంతమైన వాతావరణంతో శ్రీశ్రీశ్రీ రాఘవేంద్రస్వామి కొలువు తీరిన మంత్రాలయం ఆలయం భక్తుల కోర్కెలను తీరుస్తోంది. పండితులు, పామరులు, మఠాధిపతులు, స్వాములు, మేధావులు, ఉద్యోగులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడికి నిత్యం వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ పవిత్ర పుణ్య క్షేత్రం పక్కనే ప్రశాంతంగా తుంగభద్రమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మఠం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా పరిధిలోకి వస్తుంది. ట్రైను, బస్సు సౌకర్యం ఉంది.గతంలో అనుకోని రీతిలో ప్రకృతి ప్రకోపానికి ఈ ఆలయం కూడా మునిగి పోయింది. అయినా ఎక్కడా చెక్కు చెదరలేదు. జనం చెల్లా చెదురైనా మళ్లీ ఒక్కటిగా చేరారు. భక్తులకు స్వామి వారిపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. నిత్యం పూజలు అందుకుంటూ కొలువుతీరి ఉన్నారు. ప్రస్తుతం సుభీంద్రతీర్థులు ఈ మంత్రాలయ మఠానికి అధిపతిగా ఉన్నారు. కర్ణాటకలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మంత్రాలయం పేరుతో మఠాలు కొలువై వున్నాయి.
భారతీయ సినిమాలోనే అత్యంత సంపన్నమైన నటుడిగా, కోట్లాదిమంది అభిమానులను స్వంతం చేసుకున్న తమిళ తలైవా రజనీకాంత్ శ్రీశ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఏడాదిలో ఒకసారి తప్పక కుటుంబీకులతో కలిసి మంత్రాలయానికి వస్తారు. ఆయనకు స్వామి వారంటే ఎనలేని భక్తి..ప్రేమ. ఏదో మహత్తు..ఏదో ప్రశాంతత ఆ ప్రాంతంలో నెలకొన్నది. అంతకంటే స్వామి వారు చేసిన సేవ గొప్పది. నేను ఎక్కడికి వెళ్లినా లెక్కనేంత మంది ఫ్యాన్స్..తరాలకు సరిపడా నోట్లు, ఆస్తులు ఉన్నాయి. కానీ కాసింత ప్రశాంతంత కావాలిగా..అదే నాకు హిమాలయాల్లో దొరికింది. అంతకంటే మంత్రాలయ స్వామి వారి వద్ద లభించింది ..అంటారు రజనీకాంత్. తమిళనాట ప్రముఖ దర్శకుడిగా, డ్యాన్సర్‌గా, నటుడిగా , కొరియా గ్రాఫర్‌గా పేరున్న లారెన్స్ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుడే. తెలుగు వారే కాదు తమిళ, కన్నడిగులు శ్రీ స్వామి వారికి అత్యధికంగా భక్తులుగా ఉన్నారు. స్వామి వారి విషయానికి వస్తే...శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595లో జన్మించి 1671 వరకు జీవించారు. హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువుగా వినుతికెక్కారు. వైష్ణవాన్ని అనుసరిస్తూ..మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు.
శిష్యగణం రాఘవేంద్రుడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. పంచముఖిలో తపస్సు చేశారు, హనుమంతుణ్ణి దర్శించారు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, ఇక్కడే జీవ సమాధి పొందారు . నిత్యం పూజలు అందుకుంటూ భక్తులకు ప్రశాంతతను చేకూరుస్తూ ..కోరిన కోర్కెలను తీరుస్తూ మంత్రాలయం విశిష్టమైన పుణ్య క్షేత్రంగా బాసిల్లుతోంది. ఎప్పుడైనా వీలైతే మీరూ ఈ పుణ్యమైన ప్రాంతాన్ని, నది పక్కనే ఉన్న మఠాన్ని దర్శించండి. ఉద్విగ్నతకు లోనవుతారు. మీలో మార్పు ప్రారంభమవుతుంది. ఆ స్వామి వారి కృప అలాంటిది.

Post a Comment