Header Ads

వైరల్ వీడియోపై ఇంటర్నెట్‌లో మహేష్ భార్య ఏ విధంగా రియాక్ట్ అయ్యారో తెలుసా.?

మహేష్ బాబు భార్య నమ్రత గారు చాలా సైలెంట్ గా ఉంటారు, సోషల్ మీడియా లో ఆమె తన ఫ్యామిలీ విషయాలనే ఎక్కువగా షేర్ చేస్తారు, సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే మంచి పనుల గురించి కూడా ఆమె పోస్ట్ చేస్తూ ఉంటారు, ఆమె ఎప్పుడూ ఎవ్వరిని తప్పు పట్టలేదు, ఎవరి పైన ఆగ్రహించుకోలేదు. కానీ మొదటి సారి ఆమె ఒక ఫుడ్ డెలివరీ సంస్థ పైన కోపడ్డారు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థ అయిన జొమాటో ను సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.




ఇటీవల జొమాటో లో ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ సమయం లో, డెలివర్ చేయాల్సిన ఫుడ్ ని తిన్నాడు, కొంచెం తిని, దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి డెలివరీ చేసాడు, ఈ తతంగాన్ని అంతా ఒక వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియా లో పెట్టాడు. ఆ వీడియో ఎంత వైరల్ అయ్యింది అంటే, జొమాటో సంస్థ రెపుటేషన్ నే కాదు, మొత్తం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేసే సంస్థల పేరు మొత్తం డామేజ్ అయ్యింది, ఇక ఈ వీడియో పైన నమ్రత గారు కామెంట్ చేస్తూ: " ఇంత పేరున్న ఫుడ్ డెలివెరీ సంస్థ పనితీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు. కానీ ఈ విధంగానా డెలివర్ చేసేది.? మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా.? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా పిల్లలను మాత్రం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే" అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు నమ్రత.

డెలివరీ చేయాల్సిన ఫుడ్ తింటూ దొరికిపోయిన వ్యక్తిని ఉద్యోగం నుండి పీకేశారు జొమాటో సంస్థ, అతను చేసిన పనికి కొంత మంది సమర్దిస్తే, మరి కొందరు వ్యతిరేకించారు.



No comments