Header Ads

సోషల్ మీడియా లో తన పెళ్లి గురుంచి ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన దీపికాపదుకొనె.!!

దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ ల పెళ్లి అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 14వ తేదీన వీరి వివాహం ఇటలీ లో జరిగింది. ఆ తరువాత ఇండియా లో వీరి రిసెప్షన్ జరిగింది, బాలీవుడ్ సెలబ్రిటీస్ మొదలు జాతీయ రాజకీయ నాయకుల వరకు చాలా మంది దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ పెళ్ళికి హాజరు అయ్యారు. దాదాపు 6 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే దీపికా, రణవీర్ ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరగడం తో అందరి కళ్ళు వారి పెళ్లి మీదనే పడ్డాయి.




సోషల్ మీడియా లో చాలా మంది దీపికా, రణవీర్ ల పెళ్లి గురుంచి ఇప్పటికి చేర్చించుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు వారి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో, దాదాపు పెళ్లి అయిన 15 రోజుల వరకు ఏదో ఒక ఫంక్షన్ ని నిర్వహిస్తూ వచ్చారు దీపికా, రణవీర్ లు. దీంతో కొంత మంది నెటిజన్స్ సోషల్ మీడియా లో దీపికా, రణవీర్ లని ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు. అందులో ఒక వ్యక్తి దీపికా ని ట్యాగ్ చేసి డబ్బులు మొత్తం పెళ్లి ఫంక్షన్స్ తోనే అయిపోగొడతారా అని అడగడు, ఇటీవల ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో దీపికా కు యాంకర్, ఈ ప్రశ్న నే అడగ్గా దీపికా దిమ్మ తిరిగే జవాబు ఇచ్చింది.

మీరు పెళ్ళికి డబ్బులు వృధా చేస్తున్నారు. మీ దెగ్గర ఉన్న డబ్బంతా  పెళ్ళికే ఖర్చు పెడతారా. ?
దీపికా పదుకొనె : నా దెగ్గర చాలా డబ్బు ఉంది, మీరేమి చింతించకండి.

ఈ ఒక్క జవాబు తో దీపికా అందరి నోర్లను మూయించింది. 2018 ఫోర్బ్స్ ఉమెన్ టాప్ 100 లిస్ట్ లో ₹112.8 కోట్ల రూపాయిల ఆదాయం తో 4 వ స్థానం లో నిలిచింది దీపికా పదుకొనె. దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ కలుసుకోడానికి ముఖ్య కారణం పరోక్షంగా, ప్రత్యేక్షంగా సంజయ్ లీల బన్సాలి నే. సంజయ్ లీల బన్సాలి దర్శకత్వం వహించిన రామ్ లీలా, భాజీ రావు మస్తానీ, పద్మవత్ చిత్రాల్లో దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ నటించారు.

దీపికా పదుకొనె తో అంత ఈజీ కాదు అని మరోసారి నిరూపించింది.

No comments