ఫ్యాషన్ బ్లాగర్ గా కథనాలను రాస్తూ పాఠకులను ఆకట్టుకుంటున్న ఓ యువతి రియల్ స్టోరీ ఇది..!
''జీవితంలో నేను అనుకున్నది ఒక్కటే. చాలా సురక్షితమైన, సుఖవంతమైన ఉద్యోగం కావాలని కోరుకున్నా. ఆ భద్రత ఉంటే చాలనుకున్నా. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసుకునే మంచి జాబ్ దొరికితే చాలు. అంతకు మించి ఏమీ అవసరం లేదని భావించా. నా తల్లిదండ్రులిద్దరివీ వేర్వేరు ఉద్యోగాలు. నాన్న రికార్డ్ లేబుల్ లో చేస్తే అమ్మ యాడ్ ఏజెన్సీలో పనిచేసేది. దీంతో వారి జాబ్‌లను చూశాక నాకు ఉద్యోగ పరంగా మంచి భద్రత ఉన్న జాబ్ కావాలని అనుకున్నా. నా చిన్నతనం అంతా మా బామ్మ, తాతల వద్దే సాగింది. వారు డాక్టర్లు. వారి దగ్గరే ఉండి చదువుకున్నా.
నేను పెరుగుతున్న కొద్దీ నాకు అనేక అంశాల్లో నైపుణ్యం వచ్చింది. ముఖ్యంగా కుకింగ్, డ్రాయింగ్ వంటి వాటిలో పనితనం చూపించేదాన్ని. అందుకు నా బామ్మ, తాతలు ఇద్దరూ అభినందించేవారు. క్రమంగా నా ఆసక్తి ఫ్యాషన్ రంగం వైపు మళ్లింది. ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులు ధరించేదాన్ని. దీంతో అందరి నుంచి నాకు కాంప్లిమెంట్స్ దక్కేవి. క్రమంగా నేను ఓ బ్లాగ్ ప్రారంభించా.
నా బ్లాగ్‌లో నేను ధరించే దుస్తులు, కొత్త ఫ్యాషన్ పట్ల ఆర్టికల్స్ రాసేదాన్ని. అది నాకు ఓ హాబీ అయిపోయింది. ఫ్యాషన్ ఆర్టికల్స్ రాస్తుంటే అదో లోకంలో విహరిస్తున్నట్టు ఉండేది. రాయడం, ఆర్టికల్స్ షేర్ చేయడం అదంతా ఓ ఫన్ అయిపోయింది. చివరకు ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చెప్పలేను. అలా కొద్ది నెలలు గడిచాయి. ఇక నేను డిసైడ్ అయ్యా. ఫ్యాషన్ బ్లాగర్ అవుదామని. అప్పటికి నేను బ్లాగ్ పెట్టి కొన్ని నెలలే అయింది. అయినా ఇక అందులోనే కెరీర్ ఉందని, దాంట్లోనే ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యా. అప్పటి నుంచి ఫ్యాషన్‌పై ఫుల్ టైం ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేశా. ఏమో ఇది నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. నా తల్లిదండ్రులు మాత్రం ఒక్కటే చెప్పారు. అనుకున్నది 100 శాతం చేయమని. అలా చేసేందుకు కృషి చేస్తా..!''
--ఫ్యాషన్ బ్లాగర్‌గా రాణిస్తున్న ముంబైకి చెందిన రేవా ఖరే శర్మ అనే ఓ యువతి స్టోరీ ఇది..!

Post a Comment