మన కాలపు సంస్కర్త - నిత్య స్ఫూర్తి ప్రదాత - లోకమంతటా కాలజ్ఞానమే
అద్భుతమైన ఈ మట్టి మీద మరో సంఘ సంస్కర్త జన్మించారు. జనం మధ్య అంతరాలు ఉండరాదని పరితపించిన తాత్వికుడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. పేదలు..ధనికులంటూ ఎవరూ లేరని అందరూ సమానులేనని చెప్పారు. మనమే మారాలి. ప్రాణం లేని రాళ్లకు మొక్కితే ఏం వస్తుందని ప్రశ్నించాడు. ఒక రకంగా కరవుకు కొండ గుర్తుగా పేరున్న రాయలసీమలోని కడప జిల్లా కందిమల్లయ్యపల్లెలో ఆయన సమాధి అయ్యారు. బ్రహ్మం గారి మఠంగా ఇది ప్రసిద్ధి చెందింది. నేటికీ బ్రహ్మం గారి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈ మఠం నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు స్వామి సమాధిని సందర్శిస్తారు. నిత్య పూజలు అక్కడ జరుగుతాయి. ఏపీలో ఏ ప్రాంతం వెళ్లినా అక్కడ బ్రహ్మంగారి పేరుతో విలాస్లు కనిపిస్తాయి. క్రీస్తు శకం 1608లో జన్మించిన ఆ మహానుభావుడు ఏది చెప్పినా అది జరిగింది. అందుకే శ్రీ స్వామి వారికి కాలజ్ఞానిగా పేరుంది. మూఢ నమ్మకాలపై ధ్వజమెత్తారు. చిల్లర రాళ్లకు మొక్కితే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఒక రకంగా నిస్తేజంగా ఉన్న సమాజాన్ని నిత్య చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేశారు. భార్య గోవిందమ్మ. శిష్యుడు సిద్దయ్యను ఆసరాగా చేసుకుని కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి. హేతువాది. సాక్షాత్తు దైవ స్వరూపుడిగా వినుతికెక్కారు. ప్రపంచంలో ఏం జరిగినా ఆనాడే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని అనడం పరిపాటిగా మారింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానంలో అన్నీ ఎక్కువగా జరగడంతో ఆయనను సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా భావిస్తారు. భక్తులు కొలుస్తారు. దివంగత నందమూరి తారక రామారావుకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారంటే ఎనలేని అభిమానం. గౌరవ సూచకంగా స్వామి వారి పేరుతో సినిమా కూడా తీశారు. అప్పట్లో ఆ సినిమాపై కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఆలంపూర్లో కొలువై ఉన్న జోగులాంబ అమ్మ వారి ముక్కు పుడుక దాకా నీళ్లు వస్తాయని, ఏ రోజైనా కర్నూలుకు ప్రమాదం పొంచి ఉందని స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం నిజమైంది. బీచుపల్లి వంతెనపైకి నీళ్లు ప్రవహించిన తీరును జనం ప్రత్యక్షంగా చూశారు. ఇక అప్పటి నుండి కాలజ్ఞానంకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సకల జనులంతా సన్మార్గంలో నడవాలని బోధించిన మహిమాన్వితుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. కాళికాంబ పై సప్తశతి రచించి చిన్నతనంలోనే అందరినీ అబ్బుర పరిచాడు. లోక కళ్యాణం కోసం దేశాటన చేశాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో గోపాలకుడిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గిరి గీసి ఈ మహోన్నత కార్యం చేపట్టారు. బ్రహ్మంగారిని చూసి అచ్చమ్మ ఆశ్చర్యానికి లోనవుతుంది. రవ్వలకొండలో ఇప్పటీకీ బ్రహ్మంగారి గుడి ఉంది. ఆయన మహిమలు తెలుసుకున్న ఆమె తన పుట్టుకతో గుడ్డి వాడైన కొడుక్కు చూపు ప్రసాదించమని కోరింది. స్వామి వారు తన దివ్య దృష్టితో చూపు ప్రసాదించారు. గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గ్రంధాలు మఠంలో నేటికీ భద్రంగా వున్నాయి. కాలజ్ఞానం పూర్తయ్యాక కందిమల్లయపల్లెకు చేరుకుని వడ్రంగి పని చేస్తూ గడిపాడు. తన వద్దకు వచ్చే వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా జీవించాలని బోధించాడు.
దేశాటన ద్వారా జ్ఞానాన్ని సంపాదించి..ప్రజలకు చేర్చడం అంటే మక్కువ. తల్లితోనే ప్రారంభించాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని బోధించారు. వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.అచ్చమ్మ అడిగిన సందేహాలకు సరైన సమాధానాలు చెప్పాడు బ్రహ్మం గారు. పరమాత్మ ఎక్కడున్నారని అడిగితే..నీలో నాలో ..ఈ పశువుల్లో అన్నిటా ఆయన ఉనికి ఉంటుందని, భక్తి, ధ్యాన మార్గాల ద్వారా పరమాత్మను చేరుకునే వీలుంటుందన్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు..వర్ణనకు అతీతుడు. కాలజ్ఞానం రాస్తున్న సమయంలో..బనగానపల్లె నవాబు బ్రహ్మం గారి గురించి విని ..ఆయన మహిమాన్వితుడో కాదోనని తన వద్దకు పిలిపించాడు. మాంసాహారంతో నిండిన కంచాన్ని స్వామి వారి ముందు ఉంచారు. కప్పిన వస్త్రాన్ని తీసి వేయగా అక్కడ పూలు కనిపించాయి. తాను చేసిన తప్పిదం తెలుసుకుని క్షమించమని కోరాడు. కాలజ్ఞాన విశేషాలు తెలిపారు . బ్రహ్మం గారికి 70 ఎకరాల భూమిని దానం చేశారు. మఠం నిర్వహణకు వాడుకోమని విన్నవించారు.
హైదరాబాదు నవాబు కోరిక మేరకు అక్కడికి వెళ్లారు. నవాబు ఆయనతో 'మీరు జ్ఞాని అయినా దైవాంశ సంభూతుడుగా నమ్మలేనని ..ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని 'అని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు.సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసాడు.బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు.స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు.అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు. ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన శిష్యుడిగా చేసుకున్నాడు. సిద్ధయ్యగా నామకరణం చేశాడు. పూలు తీసుకురమ్మని బనగాన పల్లెకు పంపి బ్రహ్మంగారు 1693లో సమాధిలోకి వెళ్ళాడు.
బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ , జూనియర్ కాలేజీలు, వేద పాఠశాల నడుస్తోంది. - గాలిరీతి విశ్వ గోళాలలో నుందు - దివుల భువుల మధ్య తిరుగగలవు. నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు - కాళికాంబ! హంస కాళికాంబ అంటూ ఆ సంఘ సంస్కర్త చెప్పిన తత్వాలు నేటికీ ఎక్కడో ఒకచోట పాడబడుతున్నాయి.
టెక్నాలజీ మారినా కాలజ్ఞానం అలాగే వుంది. తాత్వికుడిగా..సంఘ సంస్కర్తగా..మూఢ నమ్మకాలు నిరసిస్తూ..లోక కళ్యాణం కోసం ఆజన్మాంతం బతికి..సజీవ సమాధి అయిన ఆ పుణ్యక్షేత్రం..బ్రహ్మంగారి మఠంగా విరాజిల్లుతోంది. తిరుపతికి వెళ్లేటప్పుడు ఒక్కసారి కందిమల్లయపల్లెను దర్శించండి చాలు.

Post a Comment