Header Ads

శనగలను నానబెట్టిన నీటిని పారబోస్తున్నారా..? ఇది చదివితే ఇకపై అలా చేయరు తెలుసా..?

శనగలు.. వీటిని మనం వంటల్లో ఎక్కువగా వేస్తాం. వీటితో కూరలు చేస్తారు, గుగ్గిళ్లలా చేసుకుని తింటారు. పలు పిండి వంటలు చేస్తారు. ఇంకా ఎన్నో ఆహారాల్లో శనగలను వేస్తారు. అయితే ఎలా వేసినా శనగలను ముందుగా కొన్ని గంటల పాటు నానబెట్టాకే ఆహార పదార్థాల్లో వేస్తారు. అయితే శనగలను నానబెట్టాక వాటిని తీసి ఆ నీటిని మాత్రం పారబోస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే శనగలను నానబెట్టిన నీరు కూడా మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగలను నానబెట్టిన నీటిని తాగితే అందులో ఉండే ఐరన్ శరీరానికి అందుతుంది. దీంతో రక్తం బాగా పెరగడమే కాదు, శరీరానికి శక్తి బాగా అందుతుంది. నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి దూరమవుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ఎంత పనిచేసినా అలసట రాదు.

2. ఈ నీటిని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది.

3. వ్యాయామం చేసే వారికి ఈ నీరు చాలా మంచిది. కండరాలు త్వరగా పెరుగుతాయి. కొత్త కణజాలం నిర్మాణమవుతుంది. మజిల్స్ బిల్డ్ అవుతాయి. శారీరక దృఢత్వం ఏర్పడుతుంది.

4. శనగలను నానబెట్టిన నీరు మధుమేహం ఉన్న వారికి ఔషధమనే చెప్పవచ్చు. ఈ నీటిని తాగితే వారి రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

5. ఫైబర్ ఎక్కువగా అందడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరుగుతుంది. పొట్టు చుట్టూ ఉండే కొవ్వు పోయి స్లిమ్‌గా అవుతారు. అధిక బరువు తగ్గుతారు.

6. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా, చురుగ్గా పనిచేస్తుంది. చదువుకునే వారికి ఎంతో మంచి డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. చదువుల్లో విద్యార్థులు రాణిస్తారు.

7. చర్మ సమస్యలు పోతాయి. చర్మంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు ఉండవు. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

8. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు పోతాయి. వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

9. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. దంతాలు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన పోతుంది. చిగుళ్లు దృఢంగా ఉంటాయి.

10. శనగలను నానబెట్టిన నీటిని తాగితే క్యాన్సర్ కణాలు నాశనమవుతాయి. ఆ కణాలు పెరగవు. క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కునే ఔషధ గుణాలు ఈ నీటిలో ఉన్నాయి.

No comments