దక్షిణకాశీ శక్తి పీఠం - జోగులాంబ దేవాలయం
శక్తికి ప్రతి రూపం అమ్మ వారు. ఈ పుణ్య క్షేత్రం, ఆలయానికి విశిష్టమైన చరిత్ర కలిగి ఉన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆలంపూర్లో వెలసిన జోగులాంబ ఆలయానికి శక్తి పీఠంగా పేరుంది. అమ్మ వారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, లోకేశ్వరిగా విభిన్న రూపాలలో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. పరమ పవిత్రమైన దివ్య ధామాలుగా అష్టాదశ శక్తి పీఠాలకు పేరుంది. అమ్మ వారిగా కొలువైన జోగులాంబ భక్తులకు దర్శనం ఇస్తుంటారు. రాయలసీమ ముఖ ద్వారం నుండే తెలంగాణలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. పావన తుంగభద్ర నది తీరాన ఈ ఆలయం కొలువై ఉంది. గతంలో పెను తుపాను కారణంగా అమ్మ వారి ముక్కు పుడుక దాకా వచ్చి నీళ్లు ఆగి పోయాయి. గుడి యధాస్థానంలోనే ఉన్నది. కొన్ని రోజుల పాటు నీళ్లలోనే పూజలు అందుకుంది.
మహా తేజోవంతమైన..మూర్తీ భవించిన జోగుళాంబ అమ్మ వారిని నేరుగా చూడలేం. అంతటి శక్తి ఆమెలో ఇప్పటికీ ఉన్నది. అందుకే భక్తులు ఆమెను దర్శించు కునేందుకు బారులు తీరుతారు. ప్రవాస భారతీయులతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. ఈ స్థలానికి ఉన్న ప్రాశస్త్యం గురించి పరిశోధనలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం కూడా ఉన్నది. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం.
క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునః ప్రతిష్టించారు.
రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైనది. శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. విశేష పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రైల్వే సౌకర్యంతో పాటు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు, బస్సులు నడుస్తుంటాయి. శక్తిపీఠాన్ని దర్శించు కోవాలంటే రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది అంటూ లేదు. కావాల్సిందల్లా జోగులాంబ అమ్మ వారి అనుగ్రహాన్ని పొందాలన్న సంకల్పమే మిగిలింది.

Post a Comment