Header Ads

నన్ను గెలిపిస్తే బాల్య వివాహాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా జరిపిస్తా అంటున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి.!

బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సెన్సేషన్ క్రిఎట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో, ఆ సీరియల్ లో బాల్య వివాహం లోని కష్టాలను చూపించారు, బాల్య వివాహాలు చెయ్యకూడదు అని 2007, 1 నవంబర్ నుండి అమలు చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది, ఆ నాటి నుండి ఈ నాటి వరకు మన దేశం లో పలు చోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయ్, చట్ట రీత్యా నేరం కనుక, దొరికితే తల్లి తండ్రులకు జరిమానాతో పాటు, కటకటాల్లో కూడా తోస్తారు.




అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, బాల్య వివాహాలు జరిపించే బాధ్యత నాది అంటూ ఎన్నికల ప్రచారం లో హామీ ఇచ్చారు, హామీ ఇచ్చింది ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి, వివరాల్లోకెళితే రాజస్థాన్‌లోని సోజత్ నియోజకవర్గం నుంచి 'శోభ చౌహాన్' బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం పీపాలియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ: "తనను గెలిప్తే బాల్య వివాహాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తానని, పోలీసుల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు".

ఒక మహిళ అయ్యుండి, ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తూ ఇలాంటి వివాదాస్పద హామీలు ఇవ్వడం ఏంటని ప్రతి ఒక్కరు మండి పడుతున్నారు, సోషల్ మీడియా లో నెటిజన్స్ 'శోభ చౌహాన్' ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఇప్పుడు మహిళ సంఘాలు ఎటు పోయాయి అంటూ బయట జనాలు కామెంట్స్ చేస్తున్నారు, ప్రత్యర్థి పార్టీలు అయితే, దొరికిందే సందు అని బీజేపీ పార్టీ అభ్యర్థుల పైన ఆరోపణల అస్త్రాలు సంధిస్తున్నారు,

ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న మహిళ, బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే సహించబోను అని చెప్పడం మానేసి దెగ్గరుండీ జరిపిస్తా అనడం చాలా విడ్డురంగా ఉందని ప్రత్యర్థి పార్టీ ల అభ్యర్థులు శోభ చౌహాన్ పైన విరుచుకుపడుతున్నారు, ఒక్క మాట తో రాత్రి కి రాత్రి సోషల్ మీడియా లో వైరల్ అయిపోయారు 'శోభ చౌహాన్'. మొత్తానికి రాజస్థాన్ ఎన్నికలు వేడి వేడిగా జరుగుతున్నాయి.

No comments