Header Ads

కెసిఆర్ పైన సంచలన కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.!!

రామ్ గోపాల్ వర్మ ఏ క్షణాన ఎవరి పక్కన ఉంటాడో ఎవ్వరికీ అర్ధం కాదు, ఆయన తిడుతున్నా, పొగుడుతున్నా ఒకే రకంగా అనిపిస్తాయి. ఇండియా సినిమా హిస్టరీ లో ఒక డైరెక్టర్ డైరెక్ట్ గా ఎవరిని పడితే వారిని తిట్టడం, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చెయ్యడం. ఇదంతా ఒక్క రామ్ గోపాల్ వర్మ కె సాధ్య పడింది, మాములుగా మందేస్తే ట్విట్టర్ ఓపెన్ చేసి ఎవరిని పడితే వారిని తిడుతూ ఉంటాడు, మందు వేయని సమయాల్లో కూడా తిడుతూ ఉంటాడనుకోండి, వర్మ దెగ్గర శిష్యరికం చేసి డైరెక్టర్ లుగా మారిన వారి సంఖ్యా చాలా ఎక్కువ, చేతిలో ఒక ఫోన్, నటించడానికి నలుగురు ఆర్టిస్ట్స్ ఉంటే చాలు. సినిమా తీసేస్తాడు వర్మ.



ఇప్పుడు వర్మ గాలి కెసిఆర్ వైపు మళ్లింది, కెసిఆర్ ని గాల్లోకి లేపుతున్నాడు వర్మ, కెసిఆర్ అందరి హీరో ల కంటే గ్లామర్ గా ఉంటాడు అని ట్విట్టర్ లో ట్వీట్ వేసాడు, వర్మ ట్వీట్ లో "హిమాలయాలకంటే ఎక్కువ ఆకర్షితుడు కెసిఆర్, ఇన్ని రోజులు హీరోయిన్స్ కంటే కెసిఆర్ కె ఎక్కువ గ్లామర్ ఉందని అనుకున్నా, కానీ హీరో ల కంటే కూడా కెసిఆర్ ఏ హ్యాండ్సమ్ గా ఉంటాడని అర్ధమైంది" అని ఒక ట్వీట్ లో వేసాడు.

ఇంకో ట్వీట్ లో చంద్ర బాబు నాయుడు ని కెసిఆర్ ట్రోల్ చేస్తున్న వీడియో ఒకటి పెట్టి. కెసిఆర్, రజినీకాంత్ కంటే 20 రెట్లు, మహేష్ బాబు కంటే 200 రెట్లు, చంద్రబాబు నాయుడు కంటే 2000 రెట్లు పెద్ద అంటూ ట్వీట్ వేసాడు రామ్ గోపాల్ వర్మ.

మరొక ట్వీట్ లో మోడీ గుజరాత్ లో కట్టించిన విగ్రహం కంటే తెలంగాణ లో కెసిఆర్ విగ్రహం రెండు రెట్లు పెద్దగా కట్టియాలి అని ట్వీట్ వేసాడు.

ఇలా వరుసపెట్టి కెసిఆర్ ని పొగడటానికి అసలు కారణం ఏంటా అని అనుకుంటున్నారా.? 14 వ తారీఖున వర్మ తీసిన భైరవ గీత సినిమా విడుదల అవుతుంది. ప్రచారం కోసమే ఈ తిప్పలు అని జనాలు అనుకుంటున్నారు. ఎంత మంది ఎన్ని చెప్పినా, వర్మ తీరు మారదు.

Tweet:

https://twitter.com/RGVzoomin/status/1072542184367382530

No comments