Header Ads

రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి అసలు కారణం తెలుసా.?

తెలంగాణ రాష్ట్రమంతటా ఇప్పుడు రేవంత్ రెడ్డి ని అర్థరాత్రి జైలు లో వెయ్యడానికి గల కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. కొడంగల్ బంధు కు పిలుపునిస్తే అరెస్ట్ చేసేస్తారా అని కాంగ్రెస్ నాయకులూ కార్యకర్తలు కొడంగల్, జడ్చెర్ల లో ఆందోళనలు చేపట్టారు, రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది . అసలు రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయించింది ఎవరు? ఎందుకు చేయించారు?




రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయం అయి సీఈఓ రజత్ కుమార్ మాట్లాడుతూ:

2వ తేదీనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్ బందుకు పిలుపునిచ్చాడు. సీఎం కే.సీ.ఆర్ సభ ఉన్న నేపథ్యంలో 4వ తేదీనాడు బంద్ పిలుపునిచ్చారు. దీనిపై తెరాస పార్టీ కూడా నాకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘంకు నివేదిక పంపించాం. వారి ఆదేశాలకు అనుగుణంగా నేను రిటర్నింగ్, జిల్లా ఎన్నికల అధికారికి లెటర్ వ్రాశాను. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని కోరాం.

అందులో భాగంగా అర్థరాత్రి రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా ముందు జాగ్రత్తలలో భాగంగానే రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేశాం. అన్ని పార్టీలను ఒకేలా చూస్తాం, కొడంగల్ మాత్రమే కొంత శాంతి భద్రతల సమస్య ఉంది. రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వేడి జోరందుకుంది, ఇవ్వాళ జరిగిన ఈ ఘటన తో కాంగ్రెస్, తెరాస పార్టీ లు ఒకరినొకరు దూషించుకోడం ఎక్కువైంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కి అనుకూలంగా ఉన్న కార్యకర్తలు, అనుచరులు తెరాస పార్టీ మీద విరుచుకుపడుతున్నారు.

Watch Video :

https://www.youtube.com/watch?v=gct3s5mu-Jw

No comments