కులాంతర వివాహం చేసుకుంటే ఏ రాష్ట్రంలో ఎంత పారితోషికాన్ని దంపతులు పొందవచ్చో తెలుసా..?
ఒకప్పుడేమో గానీ ఇప్పుడు మాత్రం కులాంతర వివాహాలు బాగానే పెరుగుతున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకుల్లో చైతన్యం రావడం, సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు, కొందరు తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావడం వంటి అనేక అంశాల కారణంగా చాలా మంది కులాంతర వివాహాలను అంగీకరిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి వివాహాలు చేసుకునే వారిని అంటరానివారిగానే చూస్తున్నారు. కొన్ని చోట్లనైతే భౌతిక దాడులు చేసి నవ దంపతుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్తగా కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనే పథకం కింద రూ.2.50 లక్షలను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఒడిశా ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఇచ్చే పారితోషికాన్ని రూ.50వేల నుంచి రూ.1 లక్షకు పెంచింది. అక్కడ ఈ పథకం ద్వారా 2010 నుంచి 2016 మధ్య కాలంలో 4100 మంది జంటలు ఆర్థిక సహాయం పొందారు. కేవలం ఒడిశా మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉన్నాయి.
బీహార్లో కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు రూ.1 లక్ష వరకు ఇస్తారు. హర్యానాలో ఈ వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.01 లక్షలను ఇస్తారు. ఇలా ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 161 జంటలకు రూ.1కోటి వరకు ఇచ్చారు. ముఖ్యమంత్రి సామాజిక్ సమ్రస్త అంతర్జాతీయ వివాహ షగున్ యోజన అనే పథకం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. కర్ణాటకలో కులాంతర వివాహం చేసుకునే యువతులకు రూ.3 లక్షలు, యువకులకు రూ.2 లక్షలను ఇస్తున్నారు. రాజస్థాన్లో ఈ పారితోషికం రూ.5 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం ఈ తరహా ఆర్థిక సహాయాన్ని గరిష్టంగా అందజేస్తున్న రాష్ట్రం ఇదే కావడం విశేషం. కాగా త్వరలోనే మహారాష్ట్ర ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు చేస్తే అప్పుడు కులాంతర వివాహం చేసుకుని పెద్దలకు దూరంగా ఉండే వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయనే చెప్పవచ్చు..!

Post a Comment