Header Ads

నిత్యా మీనన్ గురుంచి మీకు తెలియని కొన్నిషాకింగ్ నిజాలు..!!

ఆలా మొదలయింది చిత్రం తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది నిత్య మీనన్, కేరళ కుట్టి నిత్య కు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, తను ఎంత మంచి యాక్టర్ అంటే, ఏ పాత్ర ఇచ్చినా చాలా అలవోకగా నటించేస్తుంది, కాదు కాదు ఆ పాత్రలో జీవించేస్తుంది. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలతో నితిన్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది నిత్య మీనన్, ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి గారి పాత్రలో నటిస్తుంది నిత్య మీనన్,




కేరళ కాదు కర్ణాటక..?

నేను పుట్టి పెరిగింది అంత బెంగుళూరు లోనే అని చెబుతాది నిత్య మీనన్, నాన్న సొంత ఊరు కాలికట్, మా ఫామిలీ అంత నేను పుట్టినప్పటి నుండి కర్ణాటక లోనే ఉన్నారు, మా బంధువులు కేరళ లో ఉన్నారు, ఆలా అని నేను కేరళ అమ్మాయి ని అయిపోను, నేను ఎప్పటికి కర్ణాటక అమ్మాయి నే అని అంటుంది నిత్య మీనన్.

ఆలా మొదలయింది, ఎలా మొదలైందో తెలుసా?

ఆలా మొదలయింది సినిమా లో నిత్య మీనన్ కు ఛాన్స్ రావడానికి కారణం నందిని రెడ్డి, ఒక ఎంట్రన్స్ ఎక్సమ్ రాయడానికి వెళ్ళినప్పుడు, నందిని రెడ్డి కి నిత్య మీనన్ కి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత నదిని రెడ్డి, నిత్య మీనన్ ను ఆలా మొదలయింది సినిమాలో హీరోయిన్ గా తీసుకుంది. నందిని రెడ్డి కి డైరెక్టర్ గా ఆలా మొదలయింది సినిమా మొదటి సినిమా, ఆ సినిమా తో నందిని రెడ్డి కి మంచి పేరు వచ్చింది, నిత్య మీనన్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు, ఆలా మొదలయింది సినిమా రిలీజ్ అయ్యాక మలయాళం, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లో బిజీ అయిపోయింది నిత్య మీనన్.

హిల్స్ సరిపోక చైర్స్..!!

నిత్య మీనన్ హైట్ చాలా తక్కువ, మిగిలిన హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే తక్కువే, అందుకే షూటింగ్ టైమ్స్ లో హై హిల్స్ వాడేది, ఆయినా కూడా హీరో ల పక్కన సరిపోయేది కాదు, అందుకే చిన్న చిన్న చైర్స్ వేసేవాళ్ళు.

No comments