Header Ads

ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ కి బదులు ఎం వచ్చిందో తెలుసా.?

మన దేశం లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సిస్టం గడిచిన సంవత్సరం నుండి ఊపందుకుంది, ఎంతలా అంటే.. 300 రూపాయిలు విలువ చేసే బిర్యానీ కూపన్స్,ఆఫర్స్ తో కలిపి దాదాపు 50 రూపాయలకే వచ్చే రకంగా. అంతా తక్కువకి పైగా మన ఇంటికే వస్తుండటం తో, అందరూ ఆన్ లైన్ లోనే డెలివరీ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో కూర బాగోలేకపోతే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్, ఆఫీస్ లో ఆకలి వేస్తే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్, హాస్టల్ లో భోజనం బాగోలేకపోతే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్.. ఇలా ఒక సందర్భం అయితే చెప్పొచ్చు, చాలా సందర్భాల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు జనాలు. కానీ ఇటీవల జొమాటో తరపున ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి డెలివరీ చెయ్యక ముందు కొంచెం ఫుడ్ ని తిని, మళ్ళీ ప్యాక్ చేసి వాళ్లకు డెలివర్ చేసాడు, అతను ఫుడ్ తింటున్న సమయం లో ఫోన్ తో రికార్డు చేసాడు ఒక వ్యక్తి, ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. దాంతో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగం ఊడింది.



ఇక పోతే, ఇలాంటి సంఘటనే మియామీ లో జరిగింది, కానీ ఈ సారి ఆర్డర్ చేసిన తిండి బదులు వేరేది వచ్చింది, వేరేది అంటే ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ కాదు. అసలు ఫుడ్ ఏ రాలేదు, దాని ప్లేస్ లో అండర్వేర్ వచ్చింది. అది కూడా అతి దుర్వాసన కలిగిన అండర్వేర్. వివరాల్లోకెళితే.. మియామీ లో లియో అనే వ్యక్తి ఆర్ట్ బసెల్ షో చూడటానికి వెళ్లాడు, అతను ఒక హోటల్ లో స్టే చేసాడు, ఆకలిగా ఉందని ఉబెర్ ఈట్స్ లో జపనీస్ రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ రైస్‌ ఆర్డర్ చేశాడు, ఉబెర్ ఈట్స్ డెలివరీ అమ్మాయి అతనికి డెలివర్ చేసి వెళ్ళిపోయింది, ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో అండర్వేర్ ఉంది, వెంటనే అతను ఉబెర్ ఈట్స్ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టిపడేసాడు, ఉబెర్ ఈట్స్ అతని డబ్బులు అతనికి రిటర్న్ చేసారు, అతను పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు ఈ ఘటన పైన, ఉబెర్ ఈట్స్ ఆ జపనీస్ రెస్టారెంట్ తో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకుంది, విచారణకు ఆదేశించింది

ఇక రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు మరెన్ని వెలుగులోకి వస్తాయో.?

No comments