వెండితో చేసిన ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..?
ఏనుగులు తెలివితేటలకే కాదు, అదృష్టాన్ని తెచ్చిపెట్టే వాహకాలు కూడా. అవును, మీరు విన్నది నిజమే. ఏనుగులకు వాస్తు శాస్త్రంలో సముచిత స్థానం ఉంది. ఈ క్రమంలోనే ఏనుగులతో చేసిన బొమ్మలను ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వెండి లోహంతో ఏనుగు బొమ్మను చేసి ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి ఏనుగు బొమ్మకు చెందిన మరిన్ని వాస్తు విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వెండితో చేసిన ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుంది. ధనం బాగా లభిస్తుంది. సిరి సంపదలు, ఆరోగ్యంతో కుటుంబ సభ్యులు వర్థిల్లుతారు.
2. వెండితో చేసిన ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుందట. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ శక్తిని పెంచుతుంది. ఎలాంటి పనినైనా చేసేందుకు కావల్సిన ధైర్యం వస్తుంది. ఏ పనినైనా అలవోకగా చేసి విజయం సాధిస్తారు.
3. వెండితో చేసిన ఏనుగు బొమ్మను ఆఫీస్‌లో పెట్టుకుంటే దోషం పోతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
4. వెండి ఏనుగు బొమ్మను పనిచేసే డెస్క్ లేదా టేబుల్‌పై పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుంది. ధనం బాగా లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. అయితే ఏనుగు బొమ్మను ఉత్తర దిశలో పెట్టాలి
5. వెండితో చేసిన ఏనుగు బొమ్మ పెండెంట్ ను మెడలో వేసుకుంటే లక్ కలసి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు.
6. వైవాహిక జీవితం సాఫీగా సాగని దంపతులు వెండితో చేసిన ఏనుగు బొమ్మల జంటను ఇంట్లో పెట్టుకుంటే వారి కలహాలు పోతాయి. కాపురం సజావుగా సాగుతుంది. ఏ సమస్యలు రావు.

Post a Comment