Header Ads

కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు అను నేను అంత: కరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్, డిప్యూటీ సీఎం గా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాస పార్టీ సంచలనం సృష్టించింది, ఒంటరిగా నిలబడి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసింది, కేసీఆర్ ని తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారి పాత్ర ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక ఇంటర్వ్యూ లో కేటీఆర్ చెప్పినట్లు, ఇంకో 10-15 ఏళ్ళు కేసీఆర్ ఏ ముఖ్యమంత్రిగా ఉంటారేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే తెరాస కు బలమైన ప్రత్యర్థి పార్టీ లేదు, తెరాస కు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ రెండు కళ్ళు, మాస్ జనాలని హరీష్ రావు ఆకర్షిస్తే. యువతని, హైదరాబాద్ జనాలను కేటీఆర్ ఆకర్షించారు, ఇక మహిళలకు కొండంత అండగా నిలిచిన కవిత గారు కూడా తెరాస పార్టీ లో పెద్ద పాత్ర నే పోషిస్తున్నారు. వీరు ముగ్గురు ఉన్నంత వరకు కేసీఆర్ కు, తెరాస పార్టీ కి ఎటువంటి ఇబ్బందులు రావని జనాలు గట్టి నమ్మకం తో చెబుతున్నారు.




‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, ఎలాంటి పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో కూడా మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా వున్నారు. ఈసారి కూడా ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా కేసీఆర్ సతీమణి, మహమూద్ అలీ సతీమణి, కవిత, కేటీఆర్, హరీశ్ రావు కుటుంబ సభ్యులు, కేశవరావు, దానం నాగేందర్, అసదుద్దీన్ ఒవైసీ, మాగంటి గోపీనాథ్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



No comments