Header Ads

హ‌రీషా మ‌జాకా - డైరెక్ట‌ర్ల‌లో డిఫ‌రెంట్

కాలం కొద్ది సేపే బాస్‌..లైఫ్‌లో కిక్ ఉండాలి. లేక పోతే దేనినైనా ఎదుర్కొనే ద‌మ్ము అయినా వుండాలి. క‌ల‌ల రాకుమారులు. .బేహారులకు సినిమా ఓ వేదిక‌. అక్క‌డ ఎవ్వ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌లేం. సుఖ‌దుఃఖాలు ఉన్న‌ట్టే విజ‌యాలు. ఛీత్కారాలు, ఈర్ష్య‌లు..విద్వేషాలు..కామెంట్స్‌..ఇవ్వ‌న్నీ మామూలే. ప్లాస్టిక్ న‌వ్వులు..అంతా అర్థ‌మ‌యిన‌ట్టే ఉంటుంది. కానీ ఎవ్వ‌రికీ ఎవ‌రూ తోడు రారు. దీపం ఉన్న‌ప్పుడే జ‌నం పోగ‌వుతారు. ఫ్యాన్స్ వెంట‌ప‌డుతారు. అదో రంగుల ప్ర‌పంచం. జిగేల్ మ‌నిపిస్తుంది..భ‌ళ్లున తెల్లారి పోయేలా చేస్తుంది. దానికి అంత మ‌హ‌త్తు ఉంది. క‌నుకే ఓట‌మి వెక్కిరించినా..ప‌దే ప‌దే అప‌జయాలు ప‌ల‌క‌రించినా..స‌రే దాని వెంటే ప‌రుగులు తీస్తారు. దాని కోసం క‌న్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా ఓ ప‌వ‌ర్‌ఫుల్ మాధ్య‌మం. త‌క్కువ టైంలో స‌క్సెస్ చూసిన వాళ్లున్నారు. చేతిలో చిల్లిగ‌వ్వ లేక పోయినా ..కోట్లకు ప‌డ‌గ‌లు ఎత్తిన వాళ్లున్నారు. అందుకే అదో గేమ్‌. మ‌ట్కా, జూదం ..సినీ రంగం మూడూ ఒక్క‌టే. క‌ళ్లు చెదిరే అందాలు..బిగ్ ఫేమ్‌..ప్ర‌క‌ట‌న‌లు..యాడ్స్‌..ఇలా చెప్పుకుంటూ పోతే..బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌..ఎన్నో అవ‌కాశాలు..క‌ల‌లు..అంత‌కంటే ఎక్కువ‌గా ఈ రంగం అంటేనే బ్యూటిఫుల్ జ‌ర్నీ.
ఒక‌ప్పుడు న‌టీ న‌టుల‌కు ..మిగ‌తా టెక్నిషియ‌న్ల‌కు గౌర‌వం వుండేది. నిర్మాత‌ల‌న్నా..డైరెక్ట‌ర్ల‌న్నా ప‌ద్ద‌తి ప్ర‌కారం న‌డుచుకునే వారు. అంతా మారి పోయింది. కుప్ప‌లు తెప్ప‌లుగా టెక్నిషియ‌న్లు వ‌స్తున్నారు..వెళుతున్నారు. కొద్ది మంది మాత్ర‌మే గుర్తుంటున్నారు. సినిమాలు ఎందుకు చూస్తారంటే..అందులో జీవితం క‌నిపిస్తుంది. మ‌నం పాత్ర‌ల్లో లీన‌మ‌వుతాం. మ‌న‌కూ కోర్కెలు..క‌ల‌లు ఉంటాయి. వాటిని నిజం చేయాల‌ని అనుకుంటాం. జీవితంలో సాధ్యం కాదు..రియ‌ల్ లైఫ్‌లో కంటే రీల్ లైఫ్ ఎక్కువ‌గా ఆనందం క‌లిగిస్తుంది. అందుకే ఏదీ సాధించ‌లేక పోయినా ప‌ర్వాలేదు..క‌నీసం క‌ల‌లైనా క‌నండి. ఫ్యాంట‌సీస్ ఇచ్చేంత సంతృప్తి ఇంకేదీ ఇవ్వ‌దు ఈ లోకంలో. గ‌తంలో సినిమా ఓ కాన్వాస్‌..ఇపుడు క‌నెక్టివిటీ..కోట్ల‌ల్లో వ్యాపారం..డైరెక్ట‌ర్ల‌..నిర్మాత‌ల మైండ్ గేమ్‌. హీరో, హీరోయిన్ల డామినేష‌న్‌.. ఒన్ మెన్ షోలు..రిలీజ్‌లు..ఫంక్ష‌న్లు, రోడ్ షోలు..వంద రోజుల వేడుక‌లు..ఒక‌ప్పుడు సంగీతం విన‌సొంపుగా ఉండేది..ఇపుడు కొన్ని ఆక‌ట్టుకుంటున్నాయి..కానీ హృద‌యాన్ని హ‌త్తు కోలేక పోతున్నాయి. సినిమా అదే ..కానీ ఫార్మాట్ ఛేంజ్‌. అంతే తేడా. సినిమా స‌క్సెస్ వెనుక వంద‌లాది మంది రేయింబ‌వ‌ళ్లు కంటి మీద కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ స‌క్సెస్ వ‌చ్చాక‌..వారు తెర వెన‌కాలే ఉండిపోతారు. కొంప‌దీసి మూవీ ఫ‌ట్ మంటే..డైరెక్ట‌ర్ బ‌లై పోతాడు. ఇండియ‌న్ సినిమాలోనే ఈ జాడ్యం నెల‌కొంది. స్క్రిప్ట్ రైట‌ర్స్ ..సినిమా డైరెక్ట‌ర్లుగా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టారు. మాట‌ల్ని తూటాల్లా పేలుస్తూ..ఫుల్ జోష్ నింపుతున్నారు. అలాంటి వారిలో త్రివిక్రం ఒక‌రైతే మ‌రొక‌రు హ‌రీష్ శంక‌ర్‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బ్రేక్ ఇచ్చాడు. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌గా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో పేరు సాధించింది. ఆ మూవీకి హీరో ప్ల‌స్ అయితే. . హ‌రీష్ శంక‌ర్ రాసిన డైలాగ్స్ పేలాయి. ప్రేక్ష‌కుల‌ను చ‌ప్ప‌ట్లు కొట్టేలా చేశాయి. స్వ‌త‌హాగా ఈ డైరెక్ట‌ర్‌కు పుస్త‌కాలంటే ప్రేమ‌. ఏదో ఒక పుస్త‌కం చ‌ద‌వ‌నిదే నిద్ర‌పోని మ‌న‌స్త‌త్వం మ‌నోడిది. క‌రీంన‌గ‌ర్ జిల్లా ధ‌ర్మ‌పురిలో మార్చి 31న 1979లో జ‌న్మించిన ఈ డైరెక్ట‌ర్ లో వ్యంగ్యం కూడా ఎక్కువే. ఎన‌ర్జ‌టిక్ హీరోగా పేరున్న ర‌వితేజ‌తో మిర‌ప‌కాయ్ సినిమా తీశాడు. అంత‌కు ముందు షాక్ తీశాడు. ప‌వ‌న్‌తో గ‌బ్బ‌ర్ సింగ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రామ‌య్యా వ‌స్తావ‌య్యా..సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌..అల్లు అర్జున్‌తో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలు వ‌చ్చాయి. చిన్న‌త‌న‌మంతా హైద‌రాబాద్‌లోని బిహెచ్ ఇఎల్‌లో గ‌డిచింది. కిండ‌ర్ గార్డెన్ నుండి ఎంబీఏ దాకా ఇక్క‌డే చ‌దివాడు. తండ్రి టీచ‌ర్‌..తెలుగు సాహిత్యంతో ప‌రిచ‌యం. రామారావు, అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాలంటే పిచ్చి. బాల న‌టుడిగా , క‌థానాయ‌కుడిగా నాట‌కాల్లో న‌టించారు. రాష్ట్రమంత‌టా ప‌ర్య‌టించాడు. అన్ని ప్రాంతాల యాస భాష‌ల‌ను ఆక‌ళింపు చేసుకున్నాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చేరాలనుకున్నాడు. దానికి కావలసిన ప్రాథమిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. గిరీష్ కర్నాడ్, చారు హాసన్ లాంటి ప్రముఖులు ఇంటర్వ్యూ చేశారు. హ‌రీష్ శైలి సినిమాల‌కు బాగా స‌రిపోతుంద‌ని..అక్క‌డ ట్రై చేస్తే ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని సూచించారు.

టాలివుడ్‌లోకి ప్ర‌వేశించేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. నిన్నే ఇష్ట‌ప‌డ్డాను అనే మూవీకి ర‌చ‌నా విభాగంలో..స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ సాయంతో ర‌వితేజ న‌టించిన వీడే సినిమాకు స‌హాయ‌కుడిగా కుదిరాడు. ఆటోగ్రాఫ్ మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్నాడు. గ్రేట్ డైరెక్ట‌ర్ రాం గోపాల్ వ‌ర్మ హ‌రీష్‌కు ర‌వితేజ హీరోగా షాక్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌ని ఛాన్స్ ఇచ్చాడు. అక్క‌డ కుద‌ర‌క పోవ‌డంతో మ‌ధ్య‌లోనే వ‌దిలేసి వ‌చ్చాడు. ఫేమ‌స్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ క‌లిసి చిరుత‌, బుజ్జిగాడు సినిమాల‌కు ర‌చ‌నా స‌హ‌కారం అందించాడు. త‌ర్వాత మిర‌ప‌కాయ్ మూవీతో ర‌వితేజ హీరోగా స‌క్సెస్ సాధించాడు. గ‌బ్బ‌ర్ సింగ్‌తో దుమ్ము రేపాడు. ఎన్టీఆర్‌తో తీసిన సినిమా అనుకున్నంత ఆడ‌లేదు.సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో తీసిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇక అల్లు అర్జున్ ..పూజా హెగ్డే తో క‌లిసి తీసిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమాగా భారీ వ‌సూళ్లు చేసి రికార్డు తిర‌గ రాసింది. ప‌లు సినిమాల‌కు ర‌చ‌నా స‌హ‌కారం అందించిన ఈ డైరెక్ట‌ర్ ఏది మాట్లాడినా అందులో అర్థం ఉంటుంది..నాకో తిక్కుంది దానికో లెక్కుంది..ఎప్పుడ‌న్నా తాగితే ఆనందం..అప్పుడ‌ప్పుడూ తాగితే అల‌వాటు..కానీ ఎప్పుడూ తాగితే అదో రోగం..కారులో వెళితే గొప్ప కాదు..బైక్‌లో వెళితే కంఫ‌ర్టూ కాదు..సుఖం అనేది కంఫ‌ర్ట్‌..ఫీలింగ్ అన్న‌ది సంతోషం..నాకు నోరు ఒక్క‌టే కాదు..వ‌ళ్లంతా ఒక‌టే దూల‌..కావాల్సిన వాళ్ల క‌ళ్లు చూస్తే చాలు క‌ష్టం ఏమిటో తెలుస్తుంది అంటూ డీజేలో డైలాగ్ రాశాడు. టెక్నాల‌జీ వ‌చ్చాక దూరం త‌గ్గాలి క‌దా..కానీ ఎందుకురా మ‌రింత పెరుగుతున్నాయి.. అంటాడు అల్జు అర్జున్‌తో న‌టుడు చంద్ర‌మోహ‌న్‌.

ఈ గ‌డ్డ‌కు పొగ‌రెక్కువ. ఆక‌లైతే అన్నం పెట్ట‌డం..క‌ష్టంలో వుంటే ఆదుకోవ‌డం..ఈ నేల స్వభావం. క‌రువొచ్చినా..కాట‌కాలు వ‌చ్చినా..ప్ర‌కృతి ప్ర‌కోపం ప్ర‌ద‌ర్శించినా చెద‌ర‌ని ఆత్మ విశ్వాసం క‌లిగిన చ‌రిత్ర దీనికుంది. అందుకే ఈ మ‌ట్టిలోంచి వ‌చ్చిన హ‌రీష్ శంక‌ర్ ...త‌న ప‌వ‌ర్ ఏమిటో రుచి చూపిస్తున్నాడు.

No comments