ఎరుపు రంగు వర్షం గురించి మీకు తెలుసా..? అది కేరళలో పడింది..!
అనేక సంవత్సరాల నుంచి మనిషి చేస్తున్న తప్పులకు గాను పర్యావరణం బాగా దెబ్బ తింటుందని అందరికీ తెలిసిందే. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, తగ్గుతున్న అటవీ విస్తీర్ణం వంటి అంశాల కారణంగా ఏటా భూతాపం పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు వేసవిలో నమోదు అవుతున్నాయి. ఇక వర్షాకాలంలోనైతే పెను తుఫాన్లు వస్తున్నాయి. తాజాగా అమెరికాలో, వెస్టిండీస్‌లో, ఇతర దేశాల్లో వచ్చిన తుఫాన్లే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఇవన్నీ సహజమే. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఓ విషయం మాత్రం వినేందుకు చాలా షాకింగ్‌గా ఉంటుంది. అదేమిటంటే... ఎరుపు వర్షం. అవును, మీరు విన్నది నిజమే. వాన ఎరుపు రంగులో ఉంటుంది.
ఏంటీ ఎరుపు రంగులో వర్షం పడడం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును పడింది. అయితే అది ఇప్పుడు కాదు, ఎప్పుడో 2001లో జూలై 25 నుంచి సెప్టెంబర్ 23ల మధ్య కేరళలో పడింది. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. దీంతో స్థానికులు చాలా బెంబేలెత్తిపోయారు. రక్తంలా ఉండే వర్షం చినుకులను చూసి జడుసుకున్నారు. అయితే నిజానికి వర్షం అలా ఎరుపు రంగులో ఎందుకు పడింతో చాలా కాలం వరకు సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు. తరువాత కొన్ని రోజులకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే...
వాతావరణంలో ఉండే alga అనే ఒక రకమైన జీవికి చెందిన స్పోర్స్ (spores) పెద్ద ఎత్తున వర్షం నీటితో కలవడం వల్లే వర్షం నీరు అలా రక్తంలా ఎరుపు రంగులోకి మారిందని సైంటిస్టులు కనుగొన్నారు. అయితే ఇలాంటి ఎరుపు వర్షం గతంలోనూ పడిందట. అది కూడా కేరళలోనే కావడం విశేషం. 1896లో మొట్ట మొదటగా కేరళలో ఒక చోట ఎరుపు వర్షం పడిందట. తరువాత అడపా దడపా అలాంటి వర్షాలు పడుతూనే ఉన్నాయట. కానీ అవి కేవలం కేరళ ప్రాంతానికే పరిమితమయ్యాయట. అయితే ఆ ఎరుపు వర్షాలు కేవలం ఆ రాష్ట్రంలోనే ఎందుకు పడుతున్నాయో, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పడడంలో లేదో సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. కాగా దీనికి కారణం పర్యావరణం పట్ల మనిషి చేస్తున్న తప్పిదాలే అని కొందరు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఎరుపు వర్షాలపై సైంటిస్టులు మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పవచ్చు..!

Post a Comment